LIVE
Assam: అస్సాంలో యుద్ధ విమానం ప్రమాదం.. ఐదుగురు వాయుసేన సిబ్బంది మృతి!  •  Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!  •  Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!  •  Modi: ఫ్రాన్స్, స్లోవేకియా పర్యటనకు ప్రధాని మోదీ.. యూరప్ దేశాలతో బంధాల బలోపేతమే లక్ష్యం!  •  Health Tips: పక్షవాతానికి ముందు వచ్చే డేంజర్ బెల్స్.. మైక్రో స్ట్రోక్ పై వైద్యుల వివరణ!  •  Promotions: దేవాదాయ శాఖలో భారీ ప్రమోషన్లు.. గ్రేడ్-1 ఆఫీసర్లుగా 26 మంది ఈఓలకు పదోన్నతులు!  •  TTD Updates: శ్రీవారి భక్తులకు అలర్ట్.. సెప్టెంబర్ నెల తిరుమల దర్శన టికెట్ల కోటా షెడ్యూల్ విడుదల!  •  EPFO: పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్... 8.25 శాతం వడ్డీ డబ్బులు అకౌంట్లలోకి వచ్చేది అప్పుడే!  •  Allu Arjun: రెండు దశాబ్దాల తర్వాత అదే క్రేజ్... 'హ్యాపీ' రీ-రిలీజ్ కలెక్షన్ల సంచలనం!  •  Srisailam: శ్రీశైల క్షేత్రంలో రికార్డు స్థాయి ఆర్థిక ప్రగతి.. బ్యాంకుల్లో వందల కోట్ల భారీ ఫిక్స్‌డ్ డిపాజిట్లు!  • 
AndhraPravasi
AndhraPravasi
Latest Telugu and AP community news
⚡ BREAKING
Lifestyle

Chinthakaya Pappu Charu: పక్కా పల్లెటూరి స్టైల్ ‘చింతకాయ పప్పుచారు’.. వేడి అన్నంలోకి అదిరిపోయే కాంబినేషన్!

Chinthakaya Pappu Charu: నోరూరించే చింతకాయ పప్పుచారును పక్కా కొలతలతో, రుచిగా ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకోండి ఈ పప్పుచారు అన్నం, అప్పడాలతో తింటే అమృతంలా ఉంటుంది.

AndhraPravasi News Desk 2 min read
Chinthakaya Pappu Charu: పక్కా పల్లెటూరి స్టైల్ ‘చింతకాయ పప్పుచారు’.. వేడి అన్నంలోకి అదిరిపోయే కాంబినేషన్!

Chinthakaya Pappu Charu: మార్కెట్లోకి పచ్చి చింతకాయలు  వచ్చాయంటే చాలు.. ఆ పులుపుని తలచుకోగానే నోట్లో నీళ్లూరుతాయి. కేవలం పచ్చడికే పరిమితం కాకుండా, ఈ సీజన్‌లో దొరికే పచ్చి చింతకాయలతో పప్పుచారు చేసుకుంటే ఆ రుచే వేరు. వేడివేడి అన్నంలోకి కాస్త నెయ్యి వేసుకుని, అప్పడాలు నంచుకుని తింటే ఆ మజానే వేరు. మరి ఈ కమ్మని చింతకాయ పప్పుచారును ఇంట్లోనే సులభంగా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.

కావలసిన పదార్థాలు:

 కందిపప్పు: 200 గ్రాములు

 పచ్చి చింతకాయలు: 150 - 180 గ్రాములు

 పసుపు: అర టీస్పూన్

 కారం: ఒక టీస్పూన్

 కల్లు ఉప్పు: రుచికి సరిపడా

తాలింపు కోసం: ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, వెల్లుల్లి రెబ్బలు

అదనపు రుచి కోసం: ఇంగువ, ఉల్లిపాయ ముక్కలు, టమాటా (ఆప్షనల్), పచ్చిమిర్చి, కొత్తిమీర.

ముందుగా 200 గ్రాముల కందిపప్పును శుభ్రంగా కడిగి, తగినన్ని నీళ్లు పోసి కనీసం అరగంట పాటు నానబెట్టాలి. ఇలా చేయడం వల్ల పప్పు త్వరగా ఉడుకుతుంది. ఆ తర్వాత అందులో పసుపు, కొద్దిగా కరివేపాకు, పచ్చిమిర్చి ముక్కలు, కొంచెం నూనె వేసి కుక్కర్‌లో మూడు, నాలుగు విజిల్స్ వచ్చే వరకు మెత్తగా ఉడికించుకోవాలి. పప్పు ఉడికిన తర్వాత పప్పుగుత్తితో మరీ మెత్తగా కాకుండా లైట్‌గా మెదుపుకుని పక్కన పెట్టుకోవాలి.

మరోపక్క చింతకాయలను శుభ్రంగా కడిగి, అవి మునిగేంత వరకు నీళ్లు పోసి స్టవ్ మీద ఉడికించాలి. చింతకాయ మీద పొట్టు విడిపోయి మెత్తబడే వరకు ఉడికించి, చల్లారబెట్టాలి. చల్లారిన తర్వాత వాటిని బాగా పిసికి చింతరసాన్ని వేరు చేయాలి. ఇలా రెండు మూడు సార్లు నీళ్లు పోస్తూ చింతకాయలోని పులుపును పూర్తిగా తీసుకోవాలి. మెదిపి పెట్టుకున్న పప్పులో ఈ చింతరసాన్ని కలపాలి. దీనికి సుమారు 700 ml వరకు నీళ్లు పోసి, కారం మరియు రుచికి సరిపడా ఉప్పు (కల్లు ఉప్పు అయితే రుచి బాగుంటుంది) వేసి బాగా కలుపుకోవాలి.

స్టవ్ మీద గిన్నె పెట్టి రెండు టేబుల్ స్పూన్ల నూనె వేయాలి. నూనె వేడయ్యాక ఆవాలు, జీలకర్ర, దంచిన వెల్లుల్లి, ఎండుమిర్చి, ఉల్లిపాయ ముక్కలు వేసి ఎర్రగా వేయించాలి. ఇందులో చిటికెడు ఇంగువ, కరివేపాకు వేసి, చివరగా ఒక టమాటా ముక్కలు వేసి మగ్గనివ్వాలి. తాలింపు వేగాక తయారు చేసుకున్న పప్పుచారు మిశ్రమాన్ని అందులో పోయాలి.

ఈ మిశ్రమాన్ని ఐదు నుండి పది నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద బాగా మరిగించాలి. పప్పుచారు ఎంత బాగా మరిగితే అంత రుచి వస్తుంది. చివరగా సన్నగా తరిగిన కొత్తిమీర చల్లుకుని స్టవ్ ఆఫ్ చేస్తే.. ఎంతో రుచికరమైన చింతకాయ పప్పుచారు రెడీ.‌ ఈ పప్పుచారులోకి మిరపకాయ బజ్జీలు లేదా ఆలూ ఫ్రై కాంబినేషన్ అదిరిపోతుంది.

Be the first to react

More Coverage

Highway Signboards: మీరు ఎప్పుడైనా గమనించారా? రోడ్డు పక్కన ఉండే ఆకుపచ్చ బోర్డుల వెనుక ఇంత పెద్ద సైన్స్ ఉందా? తెలిస్తే అబ్బా అంటారు!

Highway Signboards: మీరు ఎప్పుడైనా గమనించారా? రోడ్డు పక్కన ఉండే ఆకుపచ్చ బోర్డుల వెనుక ఇంత పెద్ద సైన్స్ ఉందా? తెలిస్తే అబ్బా అంటారు!

Highway Signboards: మీరు ఎప్పుడైనా హైవేలపై ప్రయాణించినప్పుడు రోడ్డు పక్కన లేదా పైన ఉండే బోర్డులను గమ…

South Korea: కొరియాలో ఉద్యోగం అంత కష్టమా? ‘భారతీయులెవరూ ఇక్కడికి రావద్దు’ అంటూ యువతి వైరల్ వీడియో!

South Korea: కొరియాలో ఉద్యోగం అంత కష్టమా? ‘భారతీయులెవరూ ఇక్కడికి రావద్దు’ అంటూ యువతి వైరల్ వీడియో!

South Korea: దక్షిణ కొరియాలో ఉద్యోగం చేయాలనుకుంటున్న భారతీయులను హెచ్చరిస్తూ ఓ యువతి పోస్ట్ చేసిన వీడ…