LIVE
Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!  •  Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!  •  Modi: ఫ్రాన్స్, స్లోవేకియా పర్యటనకు ప్రధాని మోదీ.. యూరప్ దేశాలతో బంధాల బలోపేతమే లక్ష్యం!  •  Health Tips: పక్షవాతానికి ముందు వచ్చే డేంజర్ బెల్స్.. మైక్రో స్ట్రోక్ పై వైద్యుల వివరణ!  •  Promotions: దేవాదాయ శాఖలో భారీ ప్రమోషన్లు.. గ్రేడ్-1 ఆఫీసర్లుగా 26 మంది ఈఓలకు పదోన్నతులు!  •  TTD Updates: శ్రీవారి భక్తులకు అలర్ట్.. సెప్టెంబర్ నెల తిరుమల దర్శన టికెట్ల కోటా షెడ్యూల్ విడుదల!  •  EPFO: పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్... 8.25 శాతం వడ్డీ డబ్బులు అకౌంట్లలోకి వచ్చేది అప్పుడే!  •  Allu Arjun: రెండు దశాబ్దాల తర్వాత అదే క్రేజ్... 'హ్యాపీ' రీ-రిలీజ్ కలెక్షన్ల సంచలనం!  •  Srisailam: శ్రీశైల క్షేత్రంలో రికార్డు స్థాయి ఆర్థిక ప్రగతి.. బ్యాంకుల్లో వందల కోట్ల భారీ ఫిక్స్‌డ్ డిపాజిట్లు!  •  Google Maps: గూగుల్ మ్యాప్స్ క్రేజీ అప్‌డేట్.. ఇకపై పెట్రోల్, డీజిల్ ఖర్చులు మిగిలడం ఖాయం!  • 
AndhraPravasi
AndhraPravasi
Latest Telugu and AP community news
⚡ BREAKING
Lifestyle

Milk Fat Increase Tips: పాడి రైతులకు కాసుల పంట... పాలల్లో వెన్న శాతం పెరగాలంటే ఈ చిట్కాలు పాటించాల్సిందే!

Milk Fat Increase Tips: పాడి పశువులలో పాల వెన్న శాతం ఎస్‌ఎన్‌ఎఫ్ తగ్గడం వల్ల నష్టపోతున్నారా? పాల నాణ్యతను పెంచి, అధిక ధర పొందేందుకు వెటర్నరీ నిపుణులు సూచించిన మార్గాలను తెలుసుకోండి...

AndhraPravasi News Desk 2 min read
Milk Fat Increase Tips: పాడి రైతులకు కాసుల పంట... పాలల్లో వెన్న శాతం పెరగాలంటే ఈ చిట్కాలు పాటించాల్సిందే!

Milk Fat Increase Tips : నేటి కాలంలో పాడి పరిశ్రమ కేవలం జీవనాధారమే కాదు, ఒక లాభసాటి వ్యాపారంగా మారుతోంది. అయితే, చాలామంది పాడి రైతులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య పాలల్లో వెన్న శాతం ఎస్‌ఎన్‌ఎఫ్  తగ్గిపోవడం. పాలు ఎన్ని లీటర్లు ఇచ్చినా, ఫ్యాట్ తక్కువగా ఉంటే కేంద్రాల్లో సరైన ధర లభించదు. దీంతో కష్టపడి పెంచిన పశువుల వల్ల ఆశించిన లాభాలు రాక రైతులు నిరాశ చెందుతుంటారు. అసలు పాల నాణ్యత ఎందుకు తగ్గుతుంది? వెటర్నరీ నిపుణులు సూచిస్తున్న ఆ 7 అద్భుత పరిష్కారాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

 చాలామంది రైతులు పచ్చిగడ్డి పుష్కలంగా ఉంటే చాలని అనుకుంటారు. కానీ పాలలో వెన్న శాతం పెరగాలంటే పశువుల పొట్టలో 'పీచు పదార్థం' (Fiber) చాలా ముఖ్యం. ఇది కేవలం ఎండుగడ్డి ద్వారానే లభిస్తుంది. ఆవులకు రోజుకు 8 కిలోలు, గేదెలకు 10 కిలోల ఎండుగడ్డిని విడతల వారీగా ఇవ్వాలి. ఇది జీర్ణక్రియను మెరుగుపరిచి పాల నాణ్యతను పెంచుతుంది.

 పశువులకు పెట్టే దాణాలో అన్ని రకాల పోషకాలు ఉండాలి. కేవలం తవుడు లేదా ఏదో ఒక రకమైన చెక్క ఇస్తే సరిపోదు. దాణాలో 30 శాతం ధాన్యాలు (మొక్కజొన్న లేదా జొన్నలు), 20 శాతం తవుడు, 20 శాతం ఆయిల్ కేక్, మిగిలిన 30 శాతం మినప పొట్టు ఉండేలా చూసుకోవాలి. అలాగే అధిక దిగుబడి ఇచ్చే పశువులకు రోజుకు 50 గ్రాముల మినరల్ మిక్చర్ (ఖనిజ లవణాల మిశ్రమం) తప్పనిసరిగా అందించాలి.

పశువుల శరీరంలో రక్తం బాగా ప్రసరించినప్పుడే పొదుగులో పాలు తయారవుతాయి. ఒక లీటరు పాలు రావాలంటే దాదాపు 400 లీటర్ల రక్తం పొదుగు ద్వారా ప్రవహించాలి. దీనికి తగినంత నీరు అవసరం. ఎండాకాలంలో పశువులకు కనీసం 150 లీటర్ల నీరు అందుబాటులో ఉంచాలి. నీరు తాగే పరిమాణం తగ్గితే ఆటోమేటిక్‌గా పాల గాఢత తగ్గిపోతుంది.

పశువుల జీర్ణ వ్యవస్థ చాలా సెన్సిటివ్‌గా ఉంటుంది. రోజుకో సమయంలో దాణా వేయడం వల్ల వాటి జీర్ణక్రియ దెబ్బతింటుంది. ప్రతిరోజూ నిర్ణీత సమయానికే మేత, దాణా అందించాలి. ఈ క్రమశిక్షణ వల్ల పశువుల శరీరం పోషకాలను గ్రహించే శక్తి పెరుగుతుంది. పాలు పితికే ముందు దాణా ఇచ్చే అలవాటు మనకు ఉంది. అయితే, దాణా తిన్న వెంటనే ఎండుగడ్డి వేయడం వల్ల అది రూమెన్  లో బాగా కలిసిపోతుంది. ఇది 'యాసిడ్ ఇండైజేషన్' వంటి సమస్యలు రాకుండా కాపాడుతుంది. దీనివల్ల పాలలో వెన్న శాతం స్థిరంగా ఉంటుంది.

పశువు ఎంత ఎక్కువ సేపు నెమరు వేస్తే అంత మంచిది. రోజుకు కనీసం 6 నుండి 8 గంటల పాటు పశువు ప్రశాంతంగా కూర్చుని నెమరు వేసేలా వాతావరణం ఉండాలి. నెమరు వేసేటప్పుడు ఉత్పత్తి అయ్యే లాలాజలం జీర్ణక్రియకు సహాయపడి, పాలలో ఫ్యాట్ పెరగడానికి తోడ్పడుతుంది.

పాల దిగుబడి పెరుగుతుందని కొందరు రైతులు మొక్కజొన్న లేదా బియ్యం వంటి ధాన్యాలను అధికంగా పెడుతుంటారు. కానీ ధాన్యాలు 30 శాతం కంటే ఎక్కువైతే పశువులకు అరుగుదల సమస్యలు వచ్చి, పాల నాణ్యత పడిపోతుంది. కాబట్టి మేతలో పీచు పదార్థానికి, ధాన్యానికి సరైన సమతుల్యత పాటించాలి. ఈ చిన్న చిన్న జాగ్రత్తలు పాటిస్తే పాలలో వెన్న శాతం పెరగడమే కాకుండా, పశువులు ఆరోగ్యంగా ఉంటాయి. తద్వారా పాడి రైతులకు అధిక లాభాలు చేకూరుతాయని నిపుణులు చెబుతున్నారు.

Be the first to react

More Coverage

Highway Signboards: మీరు ఎప్పుడైనా గమనించారా? రోడ్డు పక్కన ఉండే ఆకుపచ్చ బోర్డుల వెనుక ఇంత పెద్ద సైన్స్ ఉందా? తెలిస్తే అబ్బా అంటారు!

Highway Signboards: మీరు ఎప్పుడైనా గమనించారా? రోడ్డు పక్కన ఉండే ఆకుపచ్చ బోర్డుల వెనుక ఇంత పెద్ద సైన్స్ ఉందా? తెలిస్తే అబ్బా అంటారు!

Highway Signboards: మీరు ఎప్పుడైనా హైవేలపై ప్రయాణించినప్పుడు రోడ్డు పక్కన లేదా పైన ఉండే బోర్డులను గమ…

South Korea: కొరియాలో ఉద్యోగం అంత కష్టమా? ‘భారతీయులెవరూ ఇక్కడికి రావద్దు’ అంటూ యువతి వైరల్ వీడియో!

South Korea: కొరియాలో ఉద్యోగం అంత కష్టమా? ‘భారతీయులెవరూ ఇక్కడికి రావద్దు’ అంటూ యువతి వైరల్ వీడియో!

South Korea: దక్షిణ కొరియాలో ఉద్యోగం చేయాలనుకుంటున్న భారతీయులను హెచ్చరిస్తూ ఓ యువతి పోస్ట్ చేసిన వీడ…