ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో బుధవారం కేదార్‌నాథ్ రోప్‌వే, హేమ్‌కుండ్ సాహిబ్ రోప్‌వే ప్రాజెక్టులకు ఆమోదం లభించింది. 12.9 కిలోమీటర్ల పొడవైన కేదార్‌నాథ్ రోప్‌వే ప్రాజెక్ట్‌కు రూ. 4,081 కోట్ల వ్యయం ఉంటుందని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. హేమ్‌కుండ్ సాహిబ్ రోప్‌వే ప్రాజెక్ట్ కోసం సుమారు రూ. 2,730 కోట్లు ఖర్చు అవుతుందని వెల్లడించారు.
కేదార్‌నాథ్ రోప్‌వే ప్రాజెక్ట్ సోన్‌ప్రయాగ్ – కేదార్‌నాథ్ మధ్య నిర్మాణం చేపట్టనుంది. ఇది డిజైన్, బిల్డ్, ఫైనాన్స్, ఆపరేట్, ట్రాన్స్‌ఫర్ (DBFOT) మోడల్‌లో పబ్లిక్-ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్ ద్వారా అభివృద్ధి చేయనున్నారు. అత్యాధునిక ట్రై-కేబుల్ డిటాచబుల్ గోండోలా (3S) టెక్నాలజీతో నిర్మించనున్న ఈ రోప్‌వే ద్వారా గంటకు 1,800 మంది, రోజుకు 18,000 మంది యాత్రికులు ప్రయాణించగలరు.
ఇది కూడా చదవండి: వైసీపీకి దిమ్మ తిరిగి సీన్ రివర్స్.. లోకేష్ సంచలన కామెంట్స్.! వేట మొదలైంది.. వారందరికీ జైలు శిక్ష తప్పదు!
ప్రస్తుతం సోన్‌ప్రయాగ్ నుండి కేదార్‌నాథ్ చేరడానికి గౌరికుంద్ నుంచి 16 కిలోమీటర్ల ఎత్తైన ఎడములో ప్రయాణించాల్సి వస్తుంది. కాలినడకన వెళితే 8-9 గంటలు పడుతుంది. పైనీలతో, పల్లకీలతో లేదా హెలికాప్టర్లతో ప్రయాణించే అవకాశం ఉన్నా, అది ఖరీదైనదే. రోప్‌వే అందుబాటులోకి రాగానే కేవలం 36 నిమిషాల్లోనే కేదార్‌నాథ్ చేరుకోవచ్చు! ఇది వేగవంతమైన, సౌకర్యవంతమైన, పర్యావరణానికి మేలు చేసే ప్రత్యామ్నాయ మార్గంగా నిలుస్తుంది.
ఈ ప్రాజెక్ట్ ద్వారా యాత్రికులకు ప్రయోజనం కలిగేదే కాకుండా నిర్మాణం, నిర్వహణ దశల్లో భారీ స్థాయిలో ఉద్యోగావకాశాలు ఏర్పడనున్నాయి. హోటల్, రవాణా, ఆహార, పర్యాటక రంగాలు కొత్త ఊపునందుకోనున్నాయి.
హిమాలయ ప్రాంతాల్లో టూరిజం మౌలిక వసతుల అభివృద్ధిని ప్రోత్సహిస్తూ, సమతుల్య ఆర్థిక వృద్ధిని అందించాలనే కేంద్ర ప్రభుత్వ లక్ష్యానికి ఈ ప్రాజెక్ట్ దోహదం చేయనుంది. భద్రత, వేగం, సౌకర్యాలను పెంచుతూ యాత్రికుల కోసం మరింత మెరుగైన ప్రయాణ మార్గాన్ని అందించనుంది.
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
మీ ఇంట్లో గ్యాస్ సిలిండర్ ఉందా.? అయితే మీకు రెండు శుభవార్తలు! అలా చేస్తే కఠిన చర్యలు..
వైఎస్ వివేకా కేసులో షాక్! కీలక సాక్షి మృతి.. విచారణ కొత్త మలుపు!
మాజీ మంత్రి రోజాకు షాక్! ఆడుదాం ఆంధ్రా’పై స్వతంత్ర విచారణకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్!
సీఎం చంద్రబాబుతో సమావేశమైన ఎమ్మెల్సీ గాదె! సమస్యల పరిష్కారానికి కీలక హామీలు!
అమెరికాలో తెలుగు యువకుడి అనుమానాస్పద మృతి! స్థానికంగా ఉండే ఓ స్టోర్‌లో..
నేడు విజయవాడ పోలీసుల విచారణకు వైసీపీ నేత! భారీగా జన సందోహంతో..
వెంటిలేటర్ పైనే గాయని కల్పనకు చికిత్స.. ఆత్మహత్యకు గల కారణంపై.. ఆసుపత్రికి పలువురు ప్రముఖులు
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో నాగబాబుకు కీలక పదవి.. త్వరలోనే నియామకం!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: