ఇది కూడా చదవండి: Thalliki Vandanam: తల్లికి వందనం డబ్బు జమ కాలేదా? ఇవాళ్టితో ముగియనున్న 'ఆ' గడువు!
ఇంగ్లాండ్(England) పర్యటనను టీమిండియా(Team India) పరాజయంతో ప్రారంభించిన విషయం తెలిసిందే. తొలి టెస్టులో రెండు ఇన్నింగ్స్‌లలో కలిపి 800కు పైగా పరుగులు సాధించి, ఏకంగా ఐదు సెంచరీలు నమోదు చేసినప్పటికీ భారత జట్టుకు ఓటమి తప్పలేదు. ఈ వైఫల్యంతో హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌పై తీవ్ర ఒత్తిడి నెలకొంది. ఆయన కోచింగ్‌లో జట్టు ప్రదర్శన ఆశించిన స్థాయిలో లేకపోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ విషయంపై భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా తన యూట్యూబ్ ఛానల్‌లో స్పందించాడు. "టీమిండియా హెడ్‌కోచ్ గౌతమ్ గంభీర్‌పై ప్రస్తుతం చాలా ఒత్తిడి ఉంది. అది రోజురోజుకూ పెరుగుతోంది. ఆయన మార్గదర్శకత్వంలో భారత్ ఆడిన చివరి తొమ్మిది టెస్టుల్లో కేవలం రెండింటిలోనే గెలిచింది.
ఇది కూడా చదవండి: Kakani Remand: కాకాణికి ఒక కేసులో బెయిల్.. మరో కేసులో రిమాండ్.. ఇంకో కేసులో కస్టడీ!
ఏకంగా ఏడు మ్యాచ్‌లలో ఓటమి చవిచూసింది" అని విశ్లేషించాడు. గంభీర్ ఆధ్వర్యంలో బంగ్లాదేశ్‌పై రెండు, ఆస్ట్రేలియా(Australia)పై ఒక టెస్టు గెలిచిన జట్టు.. న్యూజిలాండ్‌తో మూడు, ఆస్ట్రేలియా(Australia)తో మూడు, తాజాగా ఇంగ్లాండ్‌తో ఒక మ్యాచ్‌లో ఓడిపోయిందని ఆయన గుర్తుచేశాడు. ప్రస్తుత ఇంగ్లాండ్(England) సిరీస్‌లో జట్టు ప్రదర్శన మెరుగుపడకపోతే గంభీర్ తన ప్రధాన కోచ్ పదవిని కోల్పోయే ప్రమాదం కూడా ఉందని ఆకాశ్ చోప్రా హెచ్చరించాడు. "ఈ పర్యటనలో టీమిండియాకు అనుకూల ఫలితాలు రాకపోతే గౌతమ్ గంభీర్ తన పదవిని కోల్పోవచ్చు. ఎందుకంటే జట్టు యాజమాన్యం కోరిన ఆటగాళ్లనే సెలక్టర్లు ఎంపిక చేశారు. అడిగిన ప్లేయర్స్‌ను జట్టులోకి తీసుకున్న తర్వాత కూడా ఫలితాలు రాకపోతే ఇబ్బందులు తప్పవు" అని ఆయన స్పష్టం చేశాడు. దీంతో ఈ సిరీస్‌లోని మిగిలిన మ్యాచ్‌ల ఫలితాలు గంభీర్ భవిష్యత్తును నిర్ణయించనున్నాయని క్రీడా వర్గాల్లో చర్చ జరుగుతోంది.
ఇది కూడా చదవండి: New Railway Lines: ఏపీలో కొత్తగా మూడో రైల్వే లైన్.. ఈ రూట్‌లో రూ.1,200 కోట్లతో, ఆ ప్రాంతం దశ తిరిగినట్లే!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
Special Trains: ప్రయాణికులకు శుభవార్త.. హైదరాబాద్- కన్యాకుమారి మధ్య 8 ప్రత్యేక రైళ్లు!
Ration Card: ఏపీలో రేషన్ కార్డులు ఉన్నవారికి జూన్ 30 వరకే ఛాన్స్..! ఇలా చేయకపోతే రేషన్ కార్డ్ రద్దు!
Ration Supply: రేషన్ పంపిణీలో కీలక మార్పులు! ఇక నుండి ఇలా!
Toll Plazas: బీ అటెన్షన్! వారికి టోల్ ప్లాజాతో పనిలేదు... ఓఆర్ఆర్ పై దూసుకెళ్లిపోవచ్చు!
TTD Devotees: భక్తులకు శుభవార్త! తిరుమలలో హోటళ్ల అద్దె తగ్గించిన టీటీడీ!
Real Estate Fraud: వైసీపీ నేత కుమారుడి నయా దందా.. రూ.8 కోట్లతో పరార్! అరెస్టు చేసిన పోలీసులు!
Paytm UPI: పేటీఎంలో కొత్త ఫీచర్స్! వెంటనే తెలుసుకోండి.. లేకపోతే అంతే!
New Project : గోదావరి వాసులకు శుభవార్త! 26న కీలక ప్రాజెక్ట్‌కి శంకుస్థాపన!
Aadhaar New Rules: ఆధార్ కార్డ్ రూల్స్ మార్చిన UIDAI! కొత్త రూల్స్ ఇవే!
Building Rules: ఏపీలో పేదలకు గుడ్ న్యూస్! జస్ట్ రూపాయి కడితే చాలు.. వాటికి గ్రీన్ సిగ్నల్!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: