ఇది కూడా చదవండి: Thalliki Vandanam: తల్లికి వందనం డబ్బు జమ కాలేదా? ఇవాళ్టితో ముగియనున్న 'ఆ' గడువు!
ఆంధ్రప్రదేశ్‌లో రేషన్‌కార్డులు ఉన్నవారికి ముఖ్యమైన గమనిక.. రేషన్ కార్డుల ఈకేవైసీ చేయించుకునేందుకు గడువు మరో ఐదు రోజుల్లో ముగుస్తుంది. రాష్ట్రవ్యాప్తంగా ప్రతి ఒక్కరూ కచ్చితంగా ఈకేవైసీ పూర్తి చేయాలని అధికారులు సూచిస్తున్నారు. రేషన్ కార్డు ద్వారా సంక్షేమ పథకాలతో పాటుగా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని. ప్రతి ఒక్కరూ ఈకేవైసీ ప్రక్రియ పూర్తి చేయాలని కోరుతున్నారు. రేషన్ కార్డుల ఈకేవైసీ గడువును ఈ నెల 30తో ముగియనుంది. ఇప్పటివరకు 95 నుంచి 98శాతం వరకు రేషన్‌కార్డులు ఉన్నవారు ఈకేవైసీ చేయించుకున్నారు. ఇంకా చేయించుకోని వారు వెంటనే చేయించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఈకేవైసీ పూర్తి చేయడం ద్వారా అసలైన లబ్ధిదారులను గుర్తించాలని ప్రభుత్వం భావిస్తోంది.
ఇది కూడా చదవండి: Rain Alert: వచ్చే రెండు రోజులూ భారీ వర్షాలే! ఈ జిల్లాలకు బిగ్ అలర్ట్!
ఐదేళ్లలోపు పిల్లలకు, 80 ఏళ్లు పైబడిన వృద్ధులకు ఈకేవైసీ నుంచి మినహాయింపు ఉంది. గడువు నాటికి వంద శాతం ఈకేవైసీ పూర్తి చేయాలని పౌర సరఫరాల అధికారులు భావిస్తున్నారు. అయితే గతంలో చాలా మంది అనర్హులకు రేషన్ కార్డులు వచ్చాయనే ఆరోపణలు ఉన్నాయి. అంతేకాదు రేషన్‌కార్డులు ఉన్న కొందరు చనిపోగా.. వారి పేర్లను కూడా తొలగించలేదు. దీనివల్ల చాలా నష్టం జరుగుతోందని ప్రభుత్వం భావిస్తోంది.. అదే బయోమెట్రిక్ (ఈ కేవైసీ) నమోదు పూర్తయితే అసలైన లబ్ధిదారులకు మాత్రమే రేషన్ అందుతుం అంటున్నారు అధికారులు. ఒకవేళ ఎవరైనా రేషన్ కార్డుల ఈకేవైసీని నిర్లక్ష్యం చేస్తే కార్డు రద్దు అవుతుందంటున్నారు. కాబట్టి రేషన్ కార్డు లబ్ధిదారులు తప్పనిసరిగా ఈకేవైసీ పూర్తి చేయాలని కోరుతున్నారు.
ఇది కూడా చదవండి: Latest Update: ఏపీలో వారందరికి రూ.36 వేలు! మంత్రి కీలక ప్రకటన!
కేంద్రం రేషన్‌కార్డుల ఈ-కేవైసీ ప్రక్రియను చేపట్టింది. ఈ మేరకు అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో రేషన్‌కార్డులు ఉన్నవారు ఈకేవైసీని పూర్తి చేయాలని ఆదేశించింది. 'ఆహార భద్రతా చట్టం కింద పంపిణీ అవుతున్న నిత్యావసర సరకుల సబ్సిడీలలో పారదర్శకత, సబ్సిడీ సజావుగా కేటాయించడానికి ఈ-కేవైసీ ప్రక్రియ తప్పనిసరి' అని కేంద్రం తెలిపింది. అంతేకాదు దేశంలోనే ఆంధ్రప్రదేశ్‌లో అత్యధికంగా ఈకేవైసీలను పూర్తి చేసిన రాష్ట్రంగా ఉందని పౌరసరఫరాలశాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు.. 100శాతం పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తామన్నారు.
ఇది కూడా చదవండి: Nominated Post: మరో నామినేటెడ్ పోస్టు! జీఓ జారీ! ఎన్నారైలకు..
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
Special Trains: ప్రయాణికులకు శుభవార్త.. హైదరాబాద్- కన్యాకుమారి మధ్య 8 ప్రత్యేక రైళ్లు!
Ration Card: ఏపీలో రేషన్ కార్డులు ఉన్నవారికి జూన్ 30 వరకే ఛాన్స్..! ఇలా చేయకపోతే రేషన్ కార్డ్ రద్దు!
Ration Supply: రేషన్ పంపిణీలో కీలక మార్పులు! ఇక నుండి ఇలా!
Toll Plazas: బీ అటెన్షన్! వారికి టోల్ ప్లాజాతో పనిలేదు... ఓఆర్ఆర్ పై దూసుకెళ్లిపోవచ్చు!
TTD Devotees: భక్తులకు శుభవార్త! తిరుమలలో హోటళ్ల అద్దె తగ్గించిన టీటీడీ!
Real Estate Fraud: వైసీపీ నేత కుమారుడి నయా దందా.. రూ.8 కోట్లతో పరార్! అరెస్టు చేసిన పోలీసులు!
Paytm UPI: పేటీఎంలో కొత్త ఫీచర్స్! వెంటనే తెలుసుకోండి.. లేకపోతే అంతే!
New Project : గోదావరి వాసులకు శుభవార్త! 26న కీలక ప్రాజెక్ట్‌కి శంకుస్థాపన!
Aadhaar New Rules: ఆధార్ కార్డ్ రూల్స్ మార్చిన UIDAI! కొత్త రూల్స్ ఇవే!
Building Rules: ఏపీలో పేదలకు గుడ్ న్యూస్! జస్ట్ రూపాయి కడితే చాలు.. వాటికి గ్రీన్ సిగ్నల్!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: