విశాఖకు రానున్న మరో ప్రతిష్ఠాత్మక ఐటీ సంస్థ! రూ.87,250 కోట్ల పెట్టుబడి.. రైడైన్​తో ముందడుగు!

హైదరాబాద్‌–విజయవాడ జాతీయ రహదారి (ఎన్‌హెచ్‌–65) విస్తరణ ప్రాజెక్టు రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ప్రయాణ సౌకర్యాలను మరింత మెరుగుపరిచే దిశగా వేగంగా ముందుకు సాగుతోంది. దండుమల్కాపూర్ సమీపంలోని ఆందోల్ మైసమ్మ ఆలయం నుంచి విజయవాడ కనకదుర్గమ్మ గుడి వరకు సుమారు 231.32 కిలోమీటర్ల దూరాన్ని ఆరు లైన్లుగా విస్తరించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఈ భారీ ప్రాజెక్టుకు సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్)ను నవంబర్ మొదటి లేదా రెండో వారంలోగా పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అనంతరం వచ్చే ఏడాది మార్చి నాటికి టెండర్ల ప్రక్రియను ముగించి, వెంటనే నిర్మాణ పనులు ప్రారంభించేలా ప్రణాళిక రూపొందించారు.

AP Government: ఏపీలో నిరుద్యోగులకు గుడ్‌న్యూస్! ప్రభుత్వ ఉద్యోగాల వయోపరిమితి పెంపు... ఎంతంటే!

ప్రాజెక్టు మొత్తం వ్యయాన్ని సుమారు రూ.10,391.53 కోట్లుగా అంచనా వేశారు. ఇందులో నిర్మాణ పనులకు రూ.6,775.47 కోట్లు, భూసేకరణ మరియు ఇతర అవసరాలకు రూ.3,616.06 కోట్లు కేటాయించనున్నారు. ప్రతి కిలోమీటర్‌ నిర్మాణానికి సగటున రూ.44.92 కోట్లు ఖర్చు కానున్నట్లు అధికారులు తెలిపారు. ఈ విస్తరణ పూర్తయితే, హైదరాబాద్ నుంచి విజయవాడ వరకు ప్రయాణ సమయం గణనీయంగా తగ్గి, రవాణా సౌకర్యాలు మెరుగవుతాయి. అంతేకాక, పారిశ్రామిక రవాణా, వాణిజ్య, పర్యాటక రంగాలకు కూడా ఈ మార్గం ప్రాధాన్యతను అందిస్తుంది.

ఉపాధ్యాయులతో చర్చించి సమస్యలు పరిష్కరించుకుందాం – లోకేష్!!

నిర్మాణ భాగంలో 33 ప్రధాన జంక్షన్లు, 105 మైనర్ జంక్షన్లు, 4 కొత్త ఫ్లైఓవర్లు, 17 అండర్‌పాస్‌లు/ఓవర్‌పాస్‌లు నిర్మించనున్నారు. అదనంగా, ఆంధ్రప్రదేశ్ పరిధిలో రెండు కొత్త బైపాస్‌లు ఏర్పాటు చేయబడతాయి. మొత్తం ప్రాజెక్టులో 22.5 కిలోమీటర్ల మేర గ్రీన్‌ఫీల్డ్ విధానంలో రహదారి నిర్మాణం జరగనుంది. ప్రయాణికుల సౌకర్యార్థం 94 విశ్రాంతి ప్రాంతాలు, 16 బస్ షెల్టర్లు కూడా ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ సదుపాయాలు పూర్తవుతే, ఈ రహదారి దేశంలోని అత్యాధునిక రవాణా మార్గాల్లో ఒకటిగా మారనుంది.

ప్రెస్ క్లబ్ ఆఫ్ అమరావతి వెబ్‌సైట్ ప్రారంభించిన సీఎం చంద్రబాబు!!

భూసేకరణ ప్రక్రియ కూడా వేగంగా సాగుతోంది. ఆంధ్రప్రదేశ్ పరిధిలో సుమారు 162 హెక్టార్ల భూమి సేకరించాల్సి ఉండగా, దీని కోసం రూ.1,414 కోట్లు ఖర్చు కానున్నాయి. ఇటీవల ఎన్‌హెచ్‌ఏఐ, రోడ్లు–భవనాల శాఖ, మరియు ఇతర ప్రభుత్వ విభాగాలు సంయుక్తంగా ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించాయి. రహదారి మార్గంలోని విద్యుత్ స్తంభాలు, చెట్లు, భవనాలు, ఇతర అడ్డంకుల వివరాలను అక్టోబర్ చివరి నాటికి సమర్పించాలనే ఆదేశాలు ఇచ్చారు. ఈ సమాచారం ఆధారంగా తుది డీపీఆర్‌ను ఖరారు చేసి, కేంద్రం మరియు రాష్ట్ర ప్రభుత్వాలకు సమర్పించనున్నారు. ఈ ప్రాజెక్టు పూర్తి అయితే, రెండు రాష్ట్రాల మధ్య రవాణా వేగం పెరిగి, ఆర్థిక, పారిశ్రామిక అభివృద్ధికి కొత్త దారులు తెరవనుంది.

Gold Mine: దేశంలోనే తొలి ప్రైవేట్ బంగారు గని! నవంబర్‌లో ప్రారంభం, రోజుకు ఎంత గోల్డ్ వస్తుందంటే!
Free Tabs: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం! వారందరికీ ఉచితంగా టాబ్ లు!
ఫ్లిప్‌కార్ట్ బిగ్ బ్యాంగ్ దీపావళి సేల్.. ఈ స్మార్ట్‌ఫోన్లపై అద్భుతమైన డిస్కౌంట్లు.. స్పెషల్ బెనిఫిట్స్.. డోంట్ మిస్!
Bhagavad Gita: మోక్షం పొందాలంటే మనస్సు నిరంతరం ధ్యానంలో.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా -27!
APSDMA alert: రేపు భారీ వర్షాలు.. ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాలకు హెచ్చరిక.. APSDMA అలర్ట్!
ఆపిల్ ఐఫోన్ 15పై భారీ డిస్కౌంట్.. అమెజాన్‌లో ఇలా కొన్నారంటే అతి తక్కువ ధరకే..!