ఏపీ అసెంబ్లీ కమిటీ హాల్‌లో సీఎం చంద్రబాబు అధ్యక్షతన టీడీఎల్పీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు పార్టీ నేతలకు కీలక సూచనలు చేశారు. మనం ఏదైనా పొరపాటుగా మాట్లాడితే విపక్షం దాన్ని అవకాశంగా తీసుకుంటుందన్నారు. ఎమ్మెల్యేలకు, ప్రజలకు, కేడర్‌కు మధ్య సమన్వయం పెరగాలని సూచించారు. ఈ సందర్భంగా చీఫ్ విప్ అంజనేయిలు, బుచ్చయ్య చౌదరిలు నియోజకవర్గ నిధులు ఇవ్వాలని కోరారు. దీనికి స్పందించిన చంద్రబాబు.. ఆర్థిక పరిస్థితి ఆధారంగా ఎప్పుడు నిర్ణయం తీసుకోవాలో తాను చూస్తానని చెప్పారు. కేంద్ర బడ్జెట్ తరహాలోనే రాష్ట్ర బడ్జెట్‌పై కూడా విస్తృతమైన చర్చ జరుగాలన్నారు. వేసవిలో అనారోగ్య కేసులుపై మంత్రులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సీనియర్లకు తన మైండ్ సెట్ ఎలా ఉంటుందో తెలుసు కానీ కొత్తవాళ్లు కూడా తెలుసుకోవాలన్నారు చంద్రబాబు. అందరూ కలిసి ప్రయాణం చేయాలని స్పష్టం చేశారు.
ఇది కూడా చదవండి: ఏపీ మహిళలకు సీఎం చంద్రబాబు నాయుడు మరో శుభవార్త! ఆది ఏంటో తెలుసా..!
సమైక్యాంధ్ర ఉద్యమ సమయంలో కూడా అందరు తనను రావద్దని చెప్పారని చివరకు గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు సమావేశం ఏర్పాటు చేసి తనను రమ్మన్నారని గుర్తు చేసుకున్నారు చంద్రబాబు. యరపతినేని ఏర్పాటు చేసిన సమావేశంతో రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో మీటింగ్‌లు పెట్టామని అన్నారు. అప్పుడు ప్రత్యర్థుల కుట్రలను కూడా యరపతినేని సమర్థవంతంగా తిప్పి కొట్టారని చంద్రబాబు అభినందించారు. ఇక, నామినేటెడ్ పోస్టుల భర్తీపైనా చంద్రబాబు క్లారిటీ ఇచ్చారు. మార్చి నెలాఖరుకల్లా నామినేటెడ్ పదవులు భర్తీ చేస్తామని సీఎం చంద్రబాబు చెప్పారు. సాధికార కమిటీ సభ్యులకే నామినేటెడ్ పదవులని తేల్చిచెప్పారు. మార్కెట్ యార్డులు, దేవస్థానాలకు పేర్లు ఇవ్వాలని సూచించారు. పార్టీ పదవులు మహానాడులోపు పూర్తి చేయాలన్నారు. ఎమ్మెల్యేలు బహిరంగంగా మాట్లాడే సమయాల్లో జాగ్రత్తా మాట్లాడాలన్నారు. అనవసరమైన విషయాలు మాట్లాడొద్దని సీఎం చంద్రబాబు ఎమ్మెల్యేలను హెచ్చరించారు.
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
తాడేపల్లిలో అరుదైన నాలుగు కాళ్ల జీవి కలకలం! భయంతో పరుగులు తీసిన స్థానికులు!
పసిపిల్లల దందా! 9 నెలల్లో 26 శిశువులను విక్రయించిన మహిళా ముఠా! తల్లి ఒడి నుంచి దూరం చేసి...!
టీడీపీ శ్రేణుల్లో ఉత్సాహం! రఘురామ కేసులో కీలక మలుపు! సీఐడీ మాజీ చీఫ్ పై సస్పెన్షన్ వేటు!
పోసాని కేసులో కొత్త మలుపు! అరెస్టు భయంతో హైకోర్టు మెట్లెక్కిన సజ్జల రామకృష్ణారెడ్డి, కుమారుడు!
శ్రీశైలం ఆలయంలో నకిలీ టికెట్ల గుట్టురట్టు! భక్తులకు మరో హెచ్చరిక!
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ! ఉమెన్ ఎంపవర్‌మెంట్ బ్రాండ్ అంబాసిడర్‌గా ఆ హీరోయిన్..
రఘురామ టార్చర్ కేసులో షాకింగ్ ట్విస్ట్! కీలక ఆధారాలు వెలుగులోకి… డీఐజీకి నోటీసులు!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: