ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) రాష్ట్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఏపీ ఉమెన్ ఎంపవర్‌మెంట్ బ్రాండ్ అంబాసిడర్ (Women Empowerment Brand Ambassador)గా హీరోయిన్ మీనాక్షి చౌదరి (Meenakshi Chaudhary)ని నియమించింది. ఈ మేరకు కూటమి ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేసింది. ఇటీవల వరస విజయాలతో మీనాక్షి చౌదరి దూసుకెళ్తున్నారు. ఈ ఏడాది సంక్రాంతికి విడుదలైన "సంక్రాంతికి వస్తున్నాం" సినిమాలోనూ ఆమె నటించి మంచి మార్కులు కొట్టేశారు. కాగా, ఆ మూవీ ఏకంగా రూ.300 కోట్లు వసూలు చేసి టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. గతేడాది మహేశ్ బాబు "గుంటూరు కారం", దుల్కర్ సల్మాన్ "లక్కీ భాస్కర్"లోనూ నటించి మెప్పించారు. మరోవైపు మెగాస్టార్ చిరంజీవి "విశ్వంభర".. అలాగే "అనగనగా ఒకరోజు" చిత్రంలోనూ మీనాక్షి చౌదరి నటిస్తున్నారు. దీంతో ఆమెను ఏపీ ఉమెన్ ఎంపవర్‌మెంట్ బ్రాండ్ అంబాసిడర్‌గా చంద్రబాబు సర్కార్ నియమించింది.
ఇది కూడా చదవండి: నామినేటెడ్ పదవుల భర్తీకి డెడ్‌లైన్.. పార్టీ నిర్మాణంపై కీలక ఆదేశాలు! చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
దారుణం హత్య.. హల్చల్ చేస్తున్న న్యూస్.. సూట్‌కేసులో కాంగ్రెస్ మహిళా కార్యకర్త మృతదేహం!
విద్యార్థులకు లోకేష్ శుభవార్త! లీప్ అమలుపై సమీక్ష.. ఏపీలో ప్రతి నియోజకవర్గంలో..
కూటమిలో అంతర్యుద్ధం వచ్చిందని వైసీపీ మాజీ ఎంపీ! హోంమంత్రి అనిత రివర్స్ పంచ్!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: