ఆంధ్రప్రదేశ్‌లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అందుబాటులో విషయం అందరికి తెలిసిందే. ఈ పథకం అమలులోకి వచ్చిన మహిళలకు ఆర్థిక భారం తగ్గిందని చెప్పుకోవాలి ఒకప్పుడు తమ జీతం 10,000 అయితే అందులో నుండి నెలకు 3000 బస్సు చార్జి కే అయిపోయాయి. చంద్రన్న ప్రభుత్వం ఈ పథకం అమలు చేయడం ద్వారా తమ ఆర్థిక స్థాయి కాస్త మెరుగుపడిందని ఏదో ఒక సందర్భంలో తమ అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తూనే ఉన్నారు మహిళలు.
అయితే ఏపీఎస్‌ఆర్టీసీ అధికారులు ప్రజలకు మరింత మంచి సేవలు అందించేందుకు ప్రయత్నిస్తున్నారు. రాష్ట్రంలోని ప్రధాన నగరాలు, జిల్లా కేంద్రాల్లో ఎక్స్‌ప్రెస్, పల్లెవెలుగు బస్సులను పెంచుతున్నారు. రద్దీగా ఉండే మార్గాల్లో కొత్త బస్సులను కూడా నడుపుతున్నారు.
కార్తీక మాసం సందర్భంగా మహిళా ప్రయాణికుల సంఖ్య పెరిగే అవకాశం ఉండటంతో ఆర్టీసీ అధికారులు ముందస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. ముఖ్యంగా పుణ్యక్షేత్రాలు అయిన శ్రీశైలం, శ్రీకాళహస్తి వంటి ఆలయాలకు వెళ్లే భక్తుల కోసం ప్రత్యేక బస్సులను సిద్ధం చేస్తున్నారు.
ప్రభుత్వం ఆలయ పర్యాటకాన్ని ప్రోత్సహిస్తున్నందున రాష్ట్రంలోని అన్ని ప్రముఖ ఆలయాలకు ఇప్పటికే ప్రత్యేక ప్యాకేజీ టూర్లు అమలులో ఉన్నాయి. ఈ సీజన్‌లో మరింత మంది భక్తులు ఆలయ దర్శనానికి వెళ్లే అవకాశం ఉండటంతో, కొత్త ప్యాకేజీలను కూడా ఆర్టీసీ అందించనుంది.
ఈ నెల 20న దీపావళి జరగనుంది. దీని తర్వాతి రోజు నుంచే కార్తీక మాసం మొదలవుతుంది. అందుకోసం ప్రత్యేకంగా బస్సులు అక్టోబర్ 25 నుంచి నవంబర్ 16 వరకు ప్రతి శని, ఆదివారాల్లో నడుస్తాయి. అక్టోబర్ 25, 26 నవంబర్ 1, 2, 8, 9, 15, 16 తేదీల్లో బస్సులు రాష్ట్రంలోని ప్రధాన పట్టణాలు, జిల్లా కేంద్రాల నుంచి పంచారామ క్షేత్రాల దిశగా బయలుదేరతాయి.
బస్సులు శనివారం ఆదివారం రాత్రి 8 గంటలకు కాకినాడ నుండి బయలుదేరి మరుసటి రోజు రాత్రి 8 గంటలకు పంచారామ క్షేత్రాలకు చేరుకుంటాయి. భక్తులు దర్శనం ముగించుకున్న తర్వాత తిరిగి తమ గమ్యస్థానాలకు చేరుకునేలా ఏర్పాట్లు చేశారు.
అంతేకాకుండా అయ్యప్ప స్వామి భక్తుల కోసం కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రతి సంవత్సరం లాగే ఈసారి కూడా శబరిమలకు వెళ్లే భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నందున,మ రాష్ట్రంలోని అన్ని డిపోల్లో నుంచి శబరిమలకు ప్రత్యేక బస్సులను నడపనున్నారు.
ప్రతి ప్రాంతానికి అనుగుణంగా బస్సుల షెడ్యూల్‌లు, టికెట్ ధరలు, టైమ్‌టేబుల్ వంటి వివరాలు రీజియన్ వారీగా సిద్ధం చేస్తున్నారు. భక్తులు సౌకర్యంగా ప్రయాణించేందుకు అన్ని అవసరమైన సదుపాయాలు అందించనున్నట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు.
మహిళలు, కుటుంబాలు భక్తులందరూ ఈ సేవలను వినియోగించుకోవాలని ఆర్టీసీ విజ్ఞప్తి చేసింది. కార్తీక మాసం సందర్భంగా భక్తి, పుణ్యం, సౌకర్యం అన్నీ ఒకే చోట అందించేలా ఆర్టీసీ ఈసారి ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేస్తుంది.