5G Android Phones: ఏపీలో ఆ ఉద్యోగులకు గుడ్‌న్యూస్! ఉచితంగా 5జీ ఆండ్రాయిడ్ మొబైల్స్.. త్వరపడండి!

తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియకు హైకోర్టు బ్రేక్‌ వేసింది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో 9పై హైకోర్టు మధ్యంతర స్టే విధించింది. సుప్రీంకోర్టు నిర్ణయించిన 50 శాతం గరిష్ఠ పరిమితిని రాష్ట్ర ప్రభుత్వం ఉల్లంఘించిందన్న పిటిషనర్ల వాదనను హైకోర్టు సమర్థించింది. దీంతో ఎన్నికల ప్రక్రియ తాత్కాలికంగా నిలిచిపోయింది. ఈ కేసులో ప్రభుత్వానికి నోటీసులు జారీ చేస్తూ నాలుగు వారాల్లో కౌంటర్‌ సమర్పించమని, పిటిషనర్లకు రెండు వారాల సమయం ఇచ్చింది. విచారణను ఆరు వారాల తర్వాతకు వాయిదా వేసింది.

నిరుద్యోగులకు లోకేశ్ తీపికబురు.. పక్కా ప్లాన్ రెడీ - డీఎస్సీ, టెట్ షెడ్యూల్ ఖరారు.!

రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వకేట్‌ జనరల్‌ సుదర్శన్‌రెడ్డి వాదనలో, బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వడం కోసం ప్రభుత్వం చట్టపరమైన అన్ని ప్రక్రియలు పూర్తిచేసిందని తెలిపారు. రాష్ట్రంలో 57.6 శాతం ప్రజలు వెనుకబడిన వర్గాలకు చెందినవారని కుల సర్వే ద్వారా తేలిందన్నారు. ఈ సర్వే రిపోర్ట్‌ ఆధారంగానే ప్రభుత్వం బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని నిర్ణయించిందని వివరించారు. ఆ బిల్లులు రాష్ట్ర అసెంబ్లీ, కౌన్సిల్‌లో ఏకగ్రీవంగా ఆమోదం పొందాయని, గవర్నర్‌ వాటిని రాష్ట్రపతికి పంపారని తెలిపారు.

Bhagavad Gita: మోక్షానికి మూలం ధ్యానం, ధ్యానానికి మూలం దివ్యశక్తి.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా -28!

ప్రభుత్వం 50 శాతం పరిమితిని తొలగించేందుకు పంచాయతీరాజ్‌ చట్టంలో సవరణ చేసినట్లు అడ్వకేట్‌ జనరల్‌ గుర్తు చేశారు. ఈ సవరణ ఇప్పటికే అమలులో ఉందని, ఆర్డినెన్స్‌ కూడా చెల్లుబాటు అవుతుందని పేర్కొన్నారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం రాష్ట్రపతి వద్ద మూడు నెలలు ఉన్న బిల్లులు ఆమోదం పొందినట్లే అని వాదించారు. కాబట్టి రాష్ట్రపతి వద్ద ఉన్న బీసీ రిజర్వేషన్‌ బిల్లులు చట్టాలుగా మారినట్లే భావించాలన్నారు.

Forest Department: అటవీశాఖ 791 పోస్టుల స్క్రీనింగ్ ఫలితాలు విడుదల.. వేలమంది మెయిన్స్‌కు అర్హులు!

అలాగే అడ్వకేట్‌ జనరల్‌ అభిప్రాయంలో, సుప్రీంకోర్టు 50 శాతం పరిమితిని నిర్ణయించినా అది రాజకీయ రిజర్వేషన్లకు వర్తించదన్నారు. ఇది కేవలం న్యాయవ్యాఖ్య మాత్రమేనని, రాజ్యాంగంలో ఎక్కడా ఇలాంటి పరిమితి లేదని చెప్పారు. బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వడం వెనుక ప్రజల అభీష్టం ఉందని, ఏ రాజకీయ పార్టీ కూడా ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించలేదని తెలిపారు.

Johnson and Johnson: అమెరికా కోర్టు ఆదేశం.. బాధిత కుటుంబానికి భారీ పరిహారం.. టాల్కమ్ పౌడర్ కేసులో జాన్సన్ & జాన్సన్‌కు!

వాదనలు విన్న హైకోర్టు ధర్మాసనం, ప్రభుత్వం జారీ చేసిన జీవోపై స్టే విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ పూర్తిగా నిలిచిపోయింది. రాష్ట్ర ప్రభుత్వం కౌంటర్‌ సమర్పించిన తరువాత విచారణ తిరిగి ప్రారంభమవుతుంది. ఈ తీర్పుతో తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలపై ఉత్కంఠ నెలకొంది.

యువతకు విదేశీ డ్రీమ్స్.. 23 విభాగాల డాటాబేస్ ఇంటిగ్రేట్.. త్వరలో ప్రారంభం! లోకేశ్ కీలక ప్రకటన!
Chandrababu Naidu: రేపు నెల్లూరు జిల్లాకు సీఎం చంద్రబాబు...! పలు కీలక ప్రాజెక్టులకు శ్రీకారం..!
Transfers in AP: ఏపీలో పలువురు సీనియర్ అధికారుల బదిలీ..! 31 మంది ఏఐఎస్ అధికారులకు కొత్త బాధ్యతలు..!
Whatsapp: అకౌంట్ హ్యాక్ భయపడకండి! ఈ 5 దశల్లో సురక్షితంగా వాట్సాప్ రికవరీ చేయండి..!
India US: భారత్ అమెరికా సంబంధాలపై ఆందోళన.. ట్రంప్‌కు 19 మంది లా మేకర్స్ లేఖ!