Transfers in AP: ఏపీలో పలువురు సీనియర్ అధికారుల బదిలీ..! 31 మంది ఏఐఎస్ అధికారులకు కొత్త బాధ్యతలు..!

ఆంధ్రప్రదేశ్ యువతకు ప్రభుత్వం ఒక గొప్ప శుభవార్త చెప్పింది. ఇకపై కేవలం దేశంలోనే కాదు, విదేశాల్లో కూడా భారీగా ఉపాధి అవకాశాలు కల్పించడంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. దీనికి సంబంధించి రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ కీలక ఆదేశాలు జారీ చేశారు.

Whatsapp: అకౌంట్ హ్యాక్ భయపడకండి! ఈ 5 దశల్లో సురక్షితంగా వాట్సాప్ రికవరీ చేయండి..!

గురువారం ఉండవల్లిలోని తన నివాసంలో స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో లోకేశ్ ఒక భారీ లక్ష్యాన్ని నిర్దేశించారు. ఓవర్సీస్ మ్యాన్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (ఓంక్యాప్) ద్వారా రాబోయే ఐదేళ్లలో లక్ష బ్లూకాలర్ ఉద్యోగాలు కల్పించడమే తమ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. ఈ లక్ష్యాన్ని చేరుకోవడానికి పక్కా ప్రణాళికతో కూడిన రూట్ మ్యాప్‌ను సిద్ధం చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు.

India US: భారత్ అమెరికా సంబంధాలపై ఆందోళన.. ట్రంప్‌కు 19 మంది లా మేకర్స్ లేఖ!

విదేశాల్లో ప్రస్తుతం ఏ ఉద్యోగాలకు డిమాండ్ ఉందో గుర్తించి, దానికి అనుగుణంగా మన యువతను సిద్ధం చేయాలని మంత్రి లోకేశ్ సూచించారు.
డిమాండ్ ఉన్న ఉద్యోగాలు: నర్సింగ్, వెల్డర్స్, ట్రక్కర్స్, బిల్డింగ్ వర్కర్లకు యూరప్‌తో పాటు జర్మనీ, ఇటలీల్లో మంచి డిమాండ్ ఉందని ఆయన తెలిపారు.

Pawan Kalyan: మాట ఇస్తున్నా… ఉప్పాడకు సీ వాల్ కట్టిస్తా – పవన్ కల్యాణ్ హామీ!

భాషా శిక్షణ ముఖ్యం: నర్సింగ్, ఐటీఐ, పాలిటెక్నిక్ విద్యనభ్యసించిన యువతీయువకులకు ఆయా దేశాల భాషల్లో శిక్షణ ఇచ్చి, విదేశాల్లో ఉద్యోగాలు లభించేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు.

Silver price : వెండి ధరకు రెక్కలు.. ఒక్క రోజులోనే రూ.7 వేల జంప్.. కేజీ వెండి ఎంత అంటే!

కేరళ మోడల్: నర్సింగ్ ఉద్యోగాలకు సంబంధించి కేరళ రాష్ట్రం చాలా విజయవంతమైంది. అందుకే, కేరళ మోడల్‌ను అధ్యయనం చేసి, ఆ పద్ధతులను ఏపీలో అమలు చేయాలని లోకేశ్ ఆదేశించారు.

Railway: రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. అన్ని సౌకర్యాలు ఒకే ప్లాట్‌ఫామ్‌లో..! త్వరలో అందుబాటులో..!

ప్రస్తుతం ఓంక్యాప్ ద్వారా రాష్ట్రంలో 2,774 మంది నర్సింగ్ అభ్యర్థులు విదేశీ భాషల్లో శిక్షణ పొందుతున్నట్లు అధికారులు మంత్రికి తెలిపారు. జర్మనీ లాంగ్వేజెస్ అసెస్ మెంట్ సెంటర్లను రాష్ట్రంలో ఏర్పాటుచేయడానికి కూడా ఎంఓయూ చేసుకున్నట్లు అధికారులు వివరించారు.

7000mAh బ్యాటరీ, డ్యూయల్ కెమెరాతో Moto G06 Power.. కేవలం రూ.7,499!

యువతకు ఉద్యోగాల సమాచారం సులభంగా అందించడానికి ఉద్దేశించిన 'నైపుణ్యం' పోర్టల్‌పై కూడా మంత్రి సమీక్షించారు.
పోర్టల్ సమాచారం: ఈ పోర్టల్‌లో ఇప్పటికే 23 విభాగాల డాటా బేస్ ను ఇంటిగ్రేట్ చేసినట్లు మంత్రి చెప్పారు. వచ్చేనెలలో పోర్టల్ ప్రారంభించే సమయానికి ఉద్యోగాలకు సంబంధించిన సంపూర్ణ సమాచారాన్ని యువతకు అందుబాటులోకి తేవాలని ఆదేశించారు.

Prasar Bharati: ప్రసార్‌ భారతి నుంచి ఉద్యోగాల వర్షం..! డిగ్రీ అర్హతతో రూ.80 వేల జీతం..!

పరిశ్రమలకు వర్క్ ఫోర్స్: రాష్ట్రంలో ఉన్న 4,639 భారీ, మధ్యతరహా పరిశ్రమలతో అనుసంధానం ఏర్పరచుకుని, వారికి అవసరమైన విధంగా వర్క్ ఫోర్స్ (Workforce) ను సిద్ధం చేయాలని లోకేశ్ సూచించారు.

IAF Dayలో పాకిస్తాన్‌పై సూపర్ ట్రోల్..! ఎయిర్ బేస్ పేర్లతో ప్రత్యేక మెనూ..!

ఐటీఐల అభివృద్ధి: రాష్ట్రంలోని 83 ప్రభుత్వ ఐటీఐలను యుద్ధ ప్రాతిపదికన అభివృద్ధి చేసేందుకు చర్యలు చేపట్టాలని మంత్రి ఆదేశించారు. వీటిలో మౌలిక సదుపాయాలు, ఆధునికీకరణ పనుల కోసం రూ.322 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు అధికారులు తెలిపారు.

AP Government: ఏపీలో ఆ బస్టాండ్‌కు ఎన్టీఆర్ పేరు! ఒక ప్రత్యేకత... ప్రభుత్వ ఉత్తర్వులు జారీ!

ఐటీఐలలో అడ్మిషన్లు పెరిగినప్పటికీ సిబ్బంది కొరత ఉన్నట్లు అధికారులు మంత్రి దృష్టికి తీసుకురాగా, దాని పరిష్కారంపై దృష్టి సారించాలన్నారు. పీఎం వికసిత్ భారత్ రోజ్ గార్ యోజన, పీఎం ఇంటర్న్ షిప్ లలో ఏపీని నెం.1గా నిలపాలని ఆయన లక్ష్యంగా పెట్టుకున్నారు.

Jio: జియో నుంచి మరో బంపర్ ఆఫర్..! రూ.799కే భద్రతా ఫీచర్లతో జియోభారత్ ఫోన్..!

పాలిటెక్నిక్ కళాశాలల పరిస్థితిపైనా మంత్రి సమీక్షించారు. రాష్ట్రంలో 87 పాలిటెక్నిక్ కళాశాలల్లో 646 టీచింగ్, 2183 నాన్ టీచింగ్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని అధికారులు తెలిపారు.

వ్యవసాయ శాఖ సమీక్షలో చంద్రబాబు.. రైతుల కోసం కీలక నిర్ణయాలు, కొత్త దిశానిర్దేశం! బిగ్ రిలీఫ్..

పాలిటెక్నిక్ కళాశాలలను మెరుగ్గా తీర్చిదిద్దేందుకు దేశంలో ఉన్న సక్సెస్ మోడల్స్‌ను అధ్యయనం చేయాలని మంత్రి ఆదేశించారు. విశాఖపట్నం, అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో 3 హబ్‌లు, వాటిని అనుబంధంగా 13 స్పోక్స్ లలో ఐటీఐలను అభివృద్ధి చేయడానికి త్వరగా ప్రణాళికలు సిద్ధం చేయాలని లోకేశ్ సూచించారు.

డ్యూడ్ ట్రైలర్.. ప్రదీప్ ఖాతాలో మరో బ్లాక్‌బస్టర్ సెట్!

ఆర్సెలర్ మిట్టల్ అండ్ నిప్పాన్ స్టీల్స్ అనుబంధ సంస్థ నామ్ టెక్ (NAM Tech) రాష్ట్రంలో నైపుణ్య శిక్షణా కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి ముందుకు రావడం వంటి పరిణామాలు రాష్ట్ర యువతకు ఉజ్వల భవిష్యత్తు ఉండబోతోందని సూచిస్తున్నాయి.

భారత్‌లో భారీ ప్రమాదం.. కీళ్ల నొప్పులకు కొత్త కారణం! గాలి కాలుష్యంతో కొత్త ముప్పు...
ఒక్కో కుటుంబానికి ₹5 లక్షలు... చంద్రబాబుకు పవన్ కల్యాణ్ ఎమోషనల్ ధన్యవాదాలు!