ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మరో భారీ పరిశ్రమ రానుంది. తిరుపతి జిల్లాలోని మేనకూరు ఇండస్ట్రియల్ పార్క్‌లో గ్రీన్‌ల్యామ్ కంపెనీ రూ.1,147 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు అధికారిక సమాచారం. రాష్ట్ర పరిశ్రమాభివృద్ధి సంస్థ APIIC (Andhra Pradesh Industrial Infrastructure Corporation) ఇప్పటికే దీనికి అంగీకారం తెలిపింది.
గ్రీన్‌ల్యామ్ సంస్థ మూడేళ్ల క్రితమే మేనకూరులో తమ పరిశ్రమను ఏర్పాటు చేసింది. ఇటీవల సీఎం చంద్రబాబు నాయుడు ప్రత్యేక ఆహ్వానంతో గ్రీన్‌ల్యామ్ మళ్లీ పెట్టుబడులు పెంచేందుకు ముందుకొచ్చింది. సామర్థ్యాన్ని మరింత విస్తరించడంలో భాగంగా ఈ పెట్టుబడి కేటాయింపు జరుగుతుంది.
ఈ ప్రాజెక్టుకు అవసరమైన 65 ఎకరాల భూమిని APIIC కేటాయించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. పరిశ్రమ పూర్తిస్థాయిలో కార్యకలాపాలు ప్రారంభించిన తర్వాత దాదాపు 1,475 మంది ఉద్యోగ అవకాశాలు కలుగనున్నాయి. రాష్ట్రంలో పరిశ్రమాభివృద్ధికి ఇది మరో పెద్ద ముందడుగు అని అధికారులు తెలిపారు.