ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (Skill Development Corporation) ఆధ్వర్యంలో విశాఖపట్నం జిల్లా కంచరపాలెం పాలిటెక్నిక్ కళాశాలలో (Kancharapalem Polytechnic College) జూలై 21న భారీ జాబ్ మేళా (Job Fair) నిర్వహించబడుతోంది. ఇందులో భాగంగా 1000 కంటే ఎక్కువ ఖాళీ (Vacancies) పోస్టులు అందుబాటులో ఉండటంతో నిరుద్యోగ యువతీ, యువకులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. జిల్లా ఉపాధి అధికారి (Employment Officer) కె. శాంతి ప్రకారం, ఈ మేళాలో 10కి పైగా ప్రైవేట్ కంపెనీలు (Private Companies), బ్యాంకులు (Banks) మరియు మెడికల్ సంస్థలు (Medical Organizations) పాల్గొంటున్నాయని తెలిపారు.
ఈ ఉద్యోగ అవకాశాలకు అర్హతగా 10వ తరగతి (10th Class), ఇంటర్మీడియట్ (Intermediate), ఐటీఐ (ITI), డిగ్రీ (Degree), డిప్లొమా (Diploma), బీటెక్ (B.Tech) మరియు ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ (Industrial Engineering) లేదా ఎలక్ట్రికల్ ఎనర్జీ సిస్టమ్స్ (Electrical Energy Systems) కోర్సులు పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులని పేర్కొన్నారు. అభ్యర్థుల వయసు 18 నుండి 30 సంవత్సరాల మధ్య (Age: 18–30 years) ఉండాలి. ఎంపికైన వారికి విశాఖపట్నం, తూర్పుగోదావరి, అనకాపల్లి, హైదరాబాద్, పరవాడ, అచ్చుతాపురం మరియు విజయనగరం వంటి ప్రాంతాల్లో ఉద్యోగం చేసే అవకాశం ఉంటుంది.
ఈ జాబ్ మేళా (Job Fair)కు స్పాట్ రిజిస్ట్రేషన్ (Spot Registration) కూడా ఉంది. అయితే ముందుగా ఆసక్తి గల అభ్యర్థులు naipunyam.ap.gov.in వెబ్‌సైట్‌లో నమోదు చేసుకోవాలి. జూలై 21 ఉదయం 10 గంటలకు ప్రాంగణంలో హాజరుకావాలని కోరుతున్నారు. ఇది నిరుద్యోగులకు పండుగ లాంటి అవకాశం అవుతుందని అధికారులు తెలిపారు.