పల్నాడు (Palnadu) జిల్లా మాచర్ల నియోజకవర్గం, దుర్గి మండలంలోని అడిగొప్పుల గ్రామ విద్యార్థుల శ్రేయస్సు దృష్ట్యా అక్కడి NRIలు మరియు గ్రామస్తుల సహకారంతో ఉచిత ట్యూషన్లు నిర్వహించనున్నారు. విద్యలో అభివృద్ధి కోసం ఉన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయికి చేరుకునే ఉద్దేశంతో ఈ ప్రత్యేక కార్యక్రమంలో జులై 21, 2025 నుంచి జులై 25, 2025 మధ్య అప్లై చేసుకోవచ్చు. ప్రతి రోజూ సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 8:30 గంటల వరకు ఈ ట్యూషన్లు నిర్వహించబడతాయి.
ఈ ఉచిత ట్యూషన్లు 1వ తరగతి నుండి 10వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులందరికీ అందుబాటులో ఉంటాయి. అనుభవం కలిగిన ఉపాధ్యాయులు విద్యా బోధన చేస్తారు. అలాగే విద్యార్థుల్లో క్రీడా ఆసక్తి పెంపొందించేందుకు క్రీడల ప్రోత్సాహం కూడా అందించనున్నారు. USA, డెన్మార్క్ (Denmark), ఆస్ట్రేలియా (Australia), UK లాంటి దేశాల్లో ఉన్న అడిగొప్పుల గ్రామానికి చెందిన NRIలు ఈ కార్యక్రమాన్ని ముందుండి నిర్వహిస్తున్నారు. వారి తోడ్పాటుతో గ్రామ యువత కూడా చురుకుగా పాల్గొంటూ సేవా కార్యక్రమాల్లో భాగస్వాములవుతున్నారు.
ఈ అవకాశాన్ని అడిగొప్పుల గ్రామ విద్యార్థులందరూ సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు కోరుతున్నారు. మరిన్ని వివరాల కోసం యాగంటి సూర్య (96183 15244), వెంకటేశ్ కిరణ్ (99591 25819) లను సంప్రదించవచ్చు. గ్రామ అభివృద్ధి కోసం ఈ సంస్థ చేస్తున్న ఈ ప్రయత్నం ఎంతో ఆదర్శనీయం.