ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దీపం-2 పథకం ద్వారా వార్షికంగా మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు అందిస్తోంది. ఇప్పటివరకు లబ్ధిదారులు మొదటగా గ్యాస్ సిలిండర్ ధరను చెల్లించి, ఆ తర్వాత ప్రభుత్వం వారి బ్యాంక్ ఖాతాలో డబ్బు జమ చేసే విధానం అమలులో ఉంది.
అయితే, తాజాగా ప్రభుత్వం కొత్త విధానాన్ని ప్రవేశపెట్టేందుకు సన్నద్ధమవుతోంది. దీని ప్రకారం, గ్యాస్ బుకింగ్ సమయంలో ముందుగా డబ్బు చెల్లించాల్సిన అవసరం లేకుండా, బ్యాంకులు మరియు గ్యాస్ ఏజెన్సీల సమన్వయంతో సిలిండర్ ఉచితంగా డెలివరీ చేయనున్నారు.
ప్రస్తుతం ఈ పైలట్ ప్రాజెక్ట్‌ను గుంటూరు మరియు ఎన్టీఆర్ జిల్లాల్లో ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నారు. లబ్ధిదారులకు సింపుల్ మెసేజ్ ద్వారా బుకింగ్ పూర్తవుతుంది. అలాగే బ్యాంకు నుంచి డైరెక్ట్‌గా గ్యాస్ ఏజెన్సీకి సబ్సిడీ పంపిణీ చేయడం వంటి ప్రక్రియలు జరుగుతున్నాయి.
ఈ విధానం విజయవంతమైతే త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా దీపం-2 పథకంలో అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. దీని ద్వారా గ్రామీణ మహిళలకు మరింత సౌకర్యం, ఆర్థిక భారం తగ్గే అవకాశముందని అధికారులు పేర్కొంటున్నారు.
ముందుగా డబ్బు చెల్లించాల్సిన అవసరం లేదు
నేరుగా ఉచితంగా గ్యాస్ సిలిండర్ డెలివరీ
ఆన్‌లైన్ లేదా ఫోన్ ద్వారా సులభమైన బుకింగ్
గ్రామీణ మహిళలకు ప్రయోజనం