144 ఏళ్లకు ఒకసారి వచ్చే ఆధ్యాత్మిక వేడుక మహా కుంభమేళా ముగియడానికి సమయం దగ్గర పడుతోంది. ప్రపంచంలోనే అతిపెద్దదైన ఈ ఆధ్యాత్మిక సంరంభం మరో 8 రోజుల్లో ముగియనుంది. ఫలితంగా ప్రయాగ్‌రాజ్‌కు భక్తుల తాకిడి బాగా పెరుగుతోంది. మహా కుంభమేళాకు వెళ్లే అవకాశం మళ్లీ రాదనే అభిప్రాయంతో భక్తులు పెద్ద సంఖ్యలో పోటెత్తుతున్నారు. ఫలితంగా దేశవ్యాప్తంగా దార్లన్నీ ప్రయాగ్‌రాజ్ వైపే సాగుతున్నాయి. గత 37 రోజుల్లో 53.24 కోట్లకు పైగా భక్తులు మహాకుంభమేళాలో పుణ్య స్నానాలు చేశారు. ఎక్కువగా రోడ్డు మార్గంలోనే భక్తులు వస్తుండటంతో ట్రాఫిక్ జామ్ సమస్య ఏర్పడుతోంది. సోమవారం రాత్రి మహా కుంభ్ సమీప ప్రాంతాలైన నైని నయా వంతెన, ఫాఫమౌలో 10-12 కి.మీ మేర వాహనాలు నిలిచిపోయాయి.
ఇది కూడా చదవండి: అదిరిపోయే గుడ్ న్యూస్.. ఏపీలో 5 సంస్థలు...2 వేల కోట్ల పెట్టుబడులు! వేలల్లో ఉద్యోగ అవకాశాలు!
8 నుంచి 10 కి.మీ ప్రయాణం చేయడానికి 3-4 గంటలు పట్టింది. వారాంతం తర్వాత రద్దీ తగ్గుతుందని అంచనా వేశారు. అయితే సోమవారం కోటి మందికి పైగా భక్తులు మహా కుంభమేళాకు వచ్చారు. మంగళవారం ఉదయం కూడా అక్కడ రద్దీ విపరీతంగా ఉంది. బయటి నుంచి వచ్చే వాహనాలను ప్రయాగ్‌రాజ్ శివార్లలోనే పోలీసులు ఆపుతున్నారు. అక్కడి నుంచి షటిల్ బస్సులు, ఇ-రిక్షాలు నడుస్తున్నాయి, కానీ భారీ రద్దీ కారణంగా, భక్తులు త్రివేణి సంగమం చేరుకోవడానికి 10-12 కి.మీ నడిచి వెళ్ళవలసి వస్తుంది. కాగా కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి, బాలీవుడ్ నటి జూహీచావ్లా మంగళవారం నాడు ప్రయాగ్‌రాజ్‌లో పుణ్యస్నానాలు చేశారు మహాకుంభమేళాకు రావడం తన జీవితంలో మరిచిపోలేని అనుభవం అని జూహీచావ్లా పేర్కొన్నారు. మాజీ ఉపరాష్ట్ర పతి వెంకయ్యనాయుడు, ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నేడు ప్రయాగ్‌రాజ్ రానున్నారు.
ఇది కూడా చదవండి: జగన్‌కు మరో బిగ్ షాక్.. వైసీపీ కీలక నేత అరెస్ట్! పోలీసులు వెంటనే రంగంలోకి..
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
తుని మున్సిపల్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత! మున్సిపల్ వైస్ ఛైర్మన్ ఎన్నిక నేపథ్యంలో..!
డిప్యూటీ సీఎం పవన్ తో సీనియర్ నటుడు మర్యాదపూర్వక భేటీ! కారణం ఇదే!
మోదీ - ట్రంప్ సమావేశమైన కొన్ని రోజులకే భారత్‌కు భారీ షాక్! మరికొన్ని దేశాలకు కూడా..
ఏపీ వాసులకు గుడ్ న్యూస్.. మరో 8 నెలల్లో.. ఎమ్మెల్యే బాలకృష్ణ కీలక ప్రకటన!
జగన్ చాప్టర్ క్లోజ్.. అలా ఎవరైనా వాగితే.. బుద్దా వెంకన్న సంచలన వ్యాఖ్యలు!
తమన్ కు బాలయ్య అదిరిపోయే గిఫ్ట్! టాలెంట్‌ను అభినందించడంలో ఆయన స్టైలే వేరు!
పాలిటెక్నిక్ రంగంలో అద్భుతమైన అవకాశాలు! నిపుణులు ఏం చెప్తున్నారంటే!
టోల్ ప్లాజా కొత్త నిబంధనలు.. కారులో వెళ్తున్నారా.? ఈ తప్పు చేస్తే డబుల్ టోల్ చెల్లించాల్సిందే.!
జగన్ హయాంలో టీడీపీ ఎమ్మెల్యేపై అక్రమ కేసు నమోదు! కారణం ఇదే! వైసీపీ నేతల గుట్టురట్టు!
వైసీపీకి మరో బిగ్ షాక్..! టీడీపీ ఎమ్మెల్యేపై దాడి కేసులో కీలక నేతపై ఎఫ్‌ఐఆర్!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: