N-18 road : అమరావతిలో వేగంగా సాగుతున్న N-18 రహదారి పనులు.. భవిష్యత్తు రాజధానికి.. 2.3 కిలోమీటర్ల మేర!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 15వ ఆర్థిక సంఘం నుండి మరో శుభవార్త అందింది. రాష్ట్రంలో కొత్తగా 17 అగ్నిమాపక కేంద్రాల (ఫైర్ స్టేషన్లు) ఏర్పాటుకు ఆమోదం లభించింది. ఈ విషయాన్ని ఏపీ అగ్నిమాపక సేవల డైరెక్టర్ జనరల్ పీవీ రమణ వెల్లడించారు. కాకినాడ, తూర్పు గోదావరి, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ, ఏలూరు, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో అగ్నిమాపక విభాగ పనితీరు సమీక్ష సందర్భంగా ఆయన మాట్లాడారు. ఈ ప్రాజెక్ట్ కోసం 252 కోట్ల బడ్జెట్‌ను ఆమోదించగా, తొలి విడతగా రూ.72 కోట్లు ఇప్పటికే విడుదల చేసినట్లు ఆయన తెలిపారు. ఈ నిధుల సాయంతో రాష్ట్రవ్యాప్తంగా అగ్నిమాపక పరికరాలు, వాహనాలు కొనుగోలు జరుగుతున్నాయి.

OnePlus Open ఫోల్డబుల్ ఫోన్ లాంచ్! ఫీచర్లు... ధర ఎంతంటే!

డీజీ రమణ వివరాల ప్రకారం, ఇప్పటికే 5 మినీ రెస్క్యూ టెండర్లు, 50 అడ్వాన్స్‌డ్ వాటర్ టెండర్లు, 20 వాటర్ బ్రౌజర్లు, 40 కాన్వాయ్ వాహనాలు, 46 ఇతర వాహనాల కొనుగోలు కోసం టెండర్లు పిలవబడ్డాయి. అంతేకాకుండా రాష్ట్రంలో అసంపూర్తిగా ఉన్న 36 అగ్నిమాపక కేంద్ర భవనాలను పూర్తి చేయడానికి నిధులు మంజూరు చేయబడ్డాయి. ప్రస్తుతం పనులు చివరి దశలో కొనసాగుతున్నాయి. ఈ చర్యల ద్వారా ఏపీలో అగ్నిమాపక విభాగం మరింత బలపడనుందని అధికారులు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. ఆధునిక వాహనాలు, సదుపాయాలు అందుబాటులోకి రావడం వల్ల అగ్ని ప్రమాదాల సమయంలో స్పందన వేగంగా, సమర్థవంతంగా ఉండనుంది.

Eat food: ఆహారాన్ని గబగబా తింటున్నారా.. ఆరోగ్యానికి ముప్పు.. వైద్యుల హెచ్చరిక!

డీజీ రమణ వెల్లడించిన వివరాల ప్రకారం, ఈ ఏడాది ఇప్పటి వరకు రాష్ట్రంలో 1,498 అగ్ని ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనల్లో చిక్కుకున్న 51 మందిని సురక్షితంగా రక్షించారని, రూ.108 కోట్ల విలువైన ఆస్తిని కాపాడగలిగామని ఆయన తెలిపారు. అదనంగా, 2021–22 గెజిట్ నోటిఫికేషన్ ప్రకారం భవనాలకు ఇచ్చే NOCల్లో సవరణలు జరుగుతున్నాయని చెప్పారు. 1999 అగ్నిమాపక చట్టం ప్రకారం భవనాల్లో తప్పనిసరిగా అగ్నిమాపక పరికరాలు ఉండాలని ఆదేశాలు ఇచ్చినట్లు తెలిపారు. అలాగే, NOC పొందిన భవన యజమానులు తమ భవనాలు చట్టానికి అనుగుణంగా ఉన్నాయో లేదో 30 రోజుల్లోపు అగ్నిమాపక శాఖకు తెలియజేయాలని ఆయన స్పష్టం చేశారు.

Pumpkin Seeds: ఈ గింజలు... డయాబెటిస్‌ ఉన్నవారికి అద్భుత ఔషధం! క్యాన్సర్ కు దూరం!

మరోవైపు గ్రామీణాభివృద్ధి కోసమే 15వ ఆర్థిక సంఘం ఇటీవల గ్రామ పంచాయతీలకు రూ.1,120 కోట్ల నిధులను విడుదల చేసింది. సెప్టెంబర్ మొదటి వారంలో ఈ నిధులను పంచాయతీలకు 70 శాతం, మండల పరిషత్తులకు 20 శాతం, జిల్లా పరిషత్తులకు 10 శాతం చొప్పున పంచారు. ఈ నిధుల విడుదలలో జాప్యం జరగడంతో పలు సర్పంచులు ప్రభుత్వ దృష్టికి సమస్యను తీసుకెళ్లగా, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా సీఎం నారా చంద్రబాబు నాయుడుతో చర్చించారు. దీంతో ఆర్థిక శాఖ వెంటనే చర్యలు తీసుకుని నిధులను విడుదల చేసింది. ఈ నిధులతో గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతం కానున్నాయి.

ALERT.. ఈరోజే ITR ఫైలింగ్ చివరి గడువు.. నిర్లక్ష్యం చేస్తే పెనాల్టీ!
Jet: మిగ్-21 ఫైటర్ జెట్లకు వీడ్కోలు..! వేల కోట్లు విలువైన యుద్ధ విమానాలు తక్కువ ధరకే విక్రయం!
SBI: హోమ్ లోన్ కస్టమర్లకు శుభవార్త..! వడ్డీ రేట్లలో ఎలాంటి పెంపు లేదు!
CM Chandrababu: కలెక్టర్ల సదస్సు! 2047 స్వర్ణాంధ్ర విజన్‌పై సీఎం చంద్రబాబు కీలక సందేశం!
UPI Good News: పెరిగిన యూపీఐ లిమిట్.. 24 గంటల్లో ఫోన్ పే నుంచి ఎంత డబ్బు పంపొచ్చంటే.?