అమెజాన్ ఇండియా తన గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ 2025ను సెప్టెంబర్ 23న ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. ఈ భారీ సేల్ సందర్భంగా స్మార్ట్‌ఫోన్‌లు, ఎలక్ట్రానిక్స్, గృహోపకరణాలు, ఫర్నిచర్, ఫ్యాషన్ ఉత్పత్తులు, అలాగే ప్రయాణ సేవలపై అద్భుతమైన ఆఫర్లు అందుబాటులో ఉండనున్నాయి. ప్రతి సంవత్సరం జరిగే ఈ ఫెస్టివల్ సేల్ కస్టమర్లు అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తారు. ఈసారి మరింత పెద్ద ఎత్తున ఆఫర్లు, డిస్కౌంట్లు ఇవ్వనున్నట్లు కంపెనీ ప్రకటించింది.
డెలివరీ సౌకర్యాలను విస్తరించిన అమెజాన్, ఇప్పుడు 50 ప్రధాన నగరాల్లో 1 మిలియన్ ఉత్పత్తులను ఒకే రోజు డెలివరీ చేసే సామర్థ్యాన్ని పెంచింది. అలాగే మరో 4 మిలియన్ ఉత్పత్తులు మరుసటి రోజు డెలివరీకి అందుబాటులో ఉంటాయి. ప్రైమ్ సభ్యులు ఈ సేల్‌లో ప్రత్యేక ప్రయోజనాలు పొందనున్నారు. ముఖ్యంగా వారు ఇతర కస్టమర్ల కంటే 24 గంటల ముందుగానే ఆఫర్లను పొందే అవకాశం ఉంటుంది.
ఆఫర్ల విషయానికొస్తే, ఈ సేల్‌లో ఎలక్ట్రానిక్స్, ఫ్యాషన్, గృహోపకరణాలు, ఫర్నిచర్ వంటి విభాగాల్లో భారీ తగ్గింపులు లభిస్తాయి. ఎంపిక చేసిన ఉత్పత్తులపై 3 నెలల నో కాస్ట్ EMI, అర్హత కలిగిన కస్టమర్లకు రూ.60,000 వరకు తక్షణ క్రెడిట్ సౌకర్యం, అలాగే SBI కార్డ్ హోల్డర్లకు ప్రత్యేక తగ్గింపులు ఉంటాయి. అదనంగా, రివార్డ్స్ గోల్డ్ ప్రోగ్రామ్ ద్వారా ప్రైమ్ సభ్యులకు 5 శాతం, ప్రైమ్ కాని సభ్యులకు 3 శాతం వరకు క్యాష్‌బ్యాక్ లభిస్తుంది.
ప్రయాణం, గిఫ్ట్ కార్డుల విభాగాల్లో కూడా భారీ ఆఫర్లు ప్రకటించారు. విమానాలపై 15 శాతం, హోటళ్లపై 40 శాతం, బస్సు టిక్కెట్లపై 15 శాతం వరకు తగ్గింపు అందిస్తున్నారు. అలాగే గిఫ్ట్ కార్డులు కొనుగోలు చేస్తే రూ.250 వరకు క్యాష్‌బ్యాక్, 10 శాతం వరకు పొదుపు సాధ్యమవుతుంది. మరోవైపు, Apple, Samsung, OnePlus వంటి బ్రాండ్ల స్మార్ట్‌ఫోన్‌లపై 40 శాతం వరకు, HP, Sony, boAt వంటి ఎలక్ట్రానిక్స్‌పై 80 శాతం వరకు, గృహోపకరణాలపై 65 శాతం వరకు, స్మార్ట్ టీవీలు, ప్రొజెక్టర్లపై కూడా 65 శాతం వరకు తగ్గింపులు ప్రకటించారు. ఈసారి జరగబోయే గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ అమెజాన్ చరిత్రలోనే అతిపెద్ద సేల్‌గా నిలుస్తుందని అధికారులు చెబుతున్నారు.