GST: పెట్రోల్-డీజిల్ పై జీఎస్టీ! కేంద్రం వాయిదా..!

చియా సీడ్స్‌ను న్యూట్రిషనల్ పవర్ హౌస్‌గా పిలుస్తారు. వీటిలో ఒమెగా-3 ఫ్యాటీ యాసిడ్స్, ప్రొటీన్, యాంటీ ఆక్సిడెంట్స్, జింక్, కాపర్ వంటి పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ఇవి కురుల కుదుళ్లను బలంగా మార్చి, చివర్లు చిట్లిపోకుండా కాపాడతాయి. అలాగే జుట్టు రాలడం తగ్గించి, దృఢంగా పెరగడానికి సహాయపడతాయి. చియా సీడ్స్‌ను రాత్రంతా నీటిలో నానబెట్టి మరుసటి రోజు ఉదయం తింటారు లేదా జ్యూస్, స్మూతీల్లో( మిల్క్ షేక్స్, ఐస్ క్రీమ్) కలిపి వాడతారు.

SSEPL Plant: దేశంలోనే అతి పెద్ద ప్రాజెక్ట్ ఏపీలోనే..! అక్కడే ఫిక్స్, ఆ ప్రాంతం దశ తిరిగినట్లే..!

ఉదయం చియా సీడ్స్ తీసుకోవడం వల్ల రోజంతా శరీరానికి కావలసిన శక్తి లభిస్తుంది. ఇందులో ఉండే ఒమెగా-3 మరియు ప్రొటీన్ కురుల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. యోగర్ట్, ఓట్స్, స్మూతీలు లేదా బెర్రీస్‌తో కలిపి తింటే మరింత ప్రయోజనం ఉంటుంది. ఉదయం తీసుకోవడం వల్ల రక్త ప్రసరణ బాగా జరిగి, కొలాజీన్ ఉత్పత్తి పెరుగుతుంది. ఇది జుట్టు డ్యామేజ్ కాకుండా కాపాడుతుంది.

Hundreds Nails : రోడ్డుపై వందలకొద్దీ మేకులు.. వాహనదారుల్లో భయాందోళనలు!

రాత్రి పూట చియా సీడ్స్ తింటే వేరే రకమైన ప్రయోజనాలు ఉంటాయి. రాత్రి శరీరం రిపేర్ మోడ్‌లో ఉండే సమయంలో వీటిలోని పోషకాలు బాగా శోషించబడతాయి. దీంతో జుట్టుకు కావాల్సిన విటమిన్లు, ఖనిజాలు సమృద్ధిగా అందుతాయి. అలాగే జీర్ణక్రియ మెరుగవుతుంది, శరీరం డిటాక్స్ అవుతుంది. రాత్రి సమయంలో వీటిని వేడి పాలు లేదా హర్బల్ టీతో కలిపి తింటే ఇంకా మంచిది.

Madhav: కేంద్ర సహకారంతో త్వరలో రాజధాని పూర్తవుతుంది.. మాధవ్!

చియా సీడ్స్‌ని ఎలా తింటామన్నది కూడా చాలా ముఖ్యం. ఉదయం సమయంలో నిమ్మరసం లేదా పండ్లతో కలిపి తీసుకుంటే శక్తి ఎక్కువగా లభిస్తుంది. రాత్రి అయితే పాలతో కలిపి లేదా యోగర్ట్‌లో వేసుకుని తినడం మంచిది. దాల్చిన చెక్క, పెప్పర్‌మింట్ టీ వంటి పదార్థాలతో కలిపి తీసుకుంటే వీటి ప్రభావం మరింతగా ఉంటుంది.

Electric Scooter offer: ఈవీ మార్కెట్‌లో సంచలనం.. రూ.28,499కే సొంతం చేసుకోండి! రూ.10కే 100కిమీ వెళ్లొచ్చు!

మరి చివరగా, ఉదయం తీసుకోవడం బెటరా, రాత్రి తీసుకోవడమా అన్నదానిపై మాట్లాడితే – రెండు సమయాల్లోనూ ప్రయోజనాలున్నాయి. రోజంతా ఎనర్జీ కావాలంటే ఉదయం తినాలి. కురుల పెరుగుదల కోసం న్యూట్రియెంట్స్ బాగా శోషించబడాలంటే రాత్రి తినడం మంచిది. డబుల్ బెనిఫిట్స్ కావాలనుకుంటే ఒక టేబుల్ స్పూన్ ఉదయం, మరొకటి రాత్రి తినవచ్చు. ఇలా చేస్తే జుట్టు ఆరోగ్యంగా, ఒత్తుగా పెరుగుతుంది.

అమెరికాలో ఇమిగ్రేషన్ రైడ్‌! వందలాది కొరియన్ల అరెస్ట్‌! అసలు కారణం ఇదే!
Central Railway: సెంట్రల్ రైల్వేలో 2418 అప్రెంటీస్ పోస్టులు.. రేపే చివరి తేదీ!
Pawan Kalyan: రాయలసీమకు ఎప్పుడూ ఒకటే సీజన్ కరవు సీజన్.. పవన్ కల్యాణ్!
Amazon: అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్! రికార్డ్ డిస్కౌంట్లు..! ఏయే వస్తువులు ఎంత తగ్గనున్నాయ్ అంటే..!
AP Jobs: నిరుద్యోగులందరికీ సువర్ణావకాశం.. 10వ నుంచి పీజీ వరకు! వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ - వారికి కూడా.!