Header Banner

ఏపీ హైకోర్టు సీరియస్ వార్నింగ్! అలా చేస్తే రూ.10 లక్షల జరిమానా!

  Wed May 21, 2025 11:58        Politics

ఆంధ్రప్రదేశ్ హైకోర్టు రాజకీయ పార్టీల తీరుపై సీరియస్ అయింది. చిన్న విషయాలకు కూడా కోర్టును ఆశ్రయించడాన్ని తప్పుబట్టింది. తిరువూరు నగర పంచాయతీ ఛైర్మన్ ఎన్నికలో భద్రత కల్పించాలని వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్లు వేసిన పిటిషన్‌పై కోర్టు విచారణ జరిపింది. ఎన్నికల సంఘం ఆదేశించినా పోలీసులు పట్టించుకోలేదా అని ప్రశ్నించింది. పోలీసులు తప్పు చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. రాజకీయ పార్టీలు కోర్టును క్రీడామైదానంలా వాడుకుంటున్నాయని వ్యాఖ్యానించింది.

 

ఆంధ్రప్రదేశ్ హైకోర్టు రాజకీయ పార్టీల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టును ఆటస్థలంగా మార్చడానికి వీల్లేదని వ్యాఖ్యానించింది. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నగర పంచాయతీ ఛైర్మన్ ఎన్నికలో ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకునేలా పోలీసు భద్రత కల్పించాలని వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్లు హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్‌పై న్యాయమూర్తి జస్టిస్ వై.లక్ష్మణరావు విచారణ జరిపారు. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నగర పంచాయతీ ఛైర్మన్ ఎన్నికలో వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్లకు పోలీసు భద్రత కల్పించాలని విజయవాడ పోలీసు కమిషనర్‌ను ఆదేశించింది. ఇలాంటి చిన్న విషయాలకు కూడా కోర్టును ఆశ్రయిస్తున్నారని.. ఇది కోర్టు స్థాయిని తగ్గిస్తోందని హైకోర్టు వ్యాఖ్యానించింది. ఈ నెల 29న పూర్తి వివరాలతో నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. పోలీసులు తప్పు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.

 

ఇది కూడా చదవండి: ఏపీ రైతులకు శుభవార్త.. ఈ కార్డుతో ఎన్నో ప్రయోజనాలు! వెంటనే దరఖాస్తు చేయండి!

 

భద్రత కోసం పిటిషనర్లు సమర్పించిన వినతిని రాష్ట్ర ఎన్నికల సంఘం పోలీసులకు పంపిందని హైకోర్టు న్యాయమూర్తి గుర్తు చేశారు. ఎస్‌ఈసీ ఆదేశించినా పోలీసులు పట్టించుకోలేదా అని ప్రశ్నించారు. పోలీసులు తప్పు చేస్తే సుమోటో కోర్టుధిక్కరణ కేసు నమోదు చేసి చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఒకవేళ పిటిషనర్లు పోలీసు భద్రత ముసుగులో అక్రమాలకు పాల్పడితే రూ.10 లక్షల జరిమానా విధిస్తామని హెచ్చరించారు. ప్రస్తుత వ్యాజ్యం విషయంలో పోలీసులు తప్పు చేశారని తేలితే డీజీపీ స్థాయి నుంచి కానిస్టేబుల్‌ వరకు శిక్షిస్తామని కోర్టు తేల్చి చెప్పింది.

 

గత కొన్నేళ్లుగా రాజకీయ పార్టీలు ప్రతి చిన్న విషయానికి హైకోర్టును ఆశ్రయిస్తున్నాయని వ్యాఖ్యానించింది. గత ఐదారేళ్లుగా ప్రతి చిన్న విషయానికి రాజకీయ పార్టీలు హైకోర్టును క్రీడామైదానంలా వాడుకుంటున్నాయని తీవ్రంగా స్పందించింది. చిన్న సమస్యలను కూడా కోర్టు వెలుపల పరిష్కరించుకోలేకపోతున్నారని ప్రశ్నించింది. ఇలాంటి కారణాలతో కోర్టును ఆశ్రయించడం వల్ల హైకోర్టు స్థాయి తగ్గిపోతోందని అభిప్రాయపడింది. హైకోర్టు స్థాయిని రెండో తరగతి మేజిస్ట్రేట్‌ కోర్టు స్థాయికి తగ్గించేశారని ఘాటుగా వ్యాఖ్యానించింది. హైకోర్టు చేసిన ఈ వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.

 


వైఎస్సార్‌సీపీ ఛైర్మన్ అభ్యర్థి ఓటింగ్‌లో పాల్గొనకుండా సీఐ, డీఎస్పీ అడ్డుకున్నారని పిటిషనర్ల తరఫు లాయర్ కోర్టుకు తెలిపారు. శాంతిభద్రతల సమస్య తలెత్తడంతో కౌన్సిలర్లు ఒక హోటల్‌లో ఉన్నారని చెప్పారు. వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్లు ఎక్కడ ఉన్నారో పోలీసులకు తెలియదని పోలీసుల తరఫున ప్రభుత్వ లాయర్ వాదనలు వినిపించారు. వారు స్టేషన్‌లో వినతి పత్రం అందజేస్తే వారికి భద్రత కల్పించడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. అలాగే పోలీసుల ఆత్మస్ధైర్యాన్ని దెబ్బతీసేలా నిరాధార ఆరోపణలు చేస్తున్నారని పేర్కొన్నారు. ఒకవేళ పోలీసులు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తుంటే ఎందుకు ఫిర్యాదు చేయలేదన్నారు. వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్లు ఇంట్లో లేరని.. ఎక్కడున్నారో పోలీసులకు తెలియదన్నారు.

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

 

అసైన్డ్ భూముల ఫ్రీహోల్డ్ పై మంత్రివర్గ కీలక నిర్ణయాలు! ఇక నుండి ఇలా...!

 

 టీటీడీలో కీలక నియామకాలు! ఏరి కోరి.. వారి మార్గదర్శకంలోనే ఇక!

 

ఏపీలో ఆ ఉద్యోగులందరికి పండగే పండగ..! కీలక ఉత్తర్వులు జారీ!

 

నేడు (21/5) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

 

ఏపీలో రేషన్ కార్డులు ఉన్నవారికి గుడ్‌న్యూస్..! వచ్చే నెల నుంచి ఆ రూల్ రద్దు?

 

 రేషన్ పంపిణీపై ఏపీ సర్కార్ కీలక నిర్ణయం! జూన్ నుంచి ఇలా..!

 

ఢిల్లీకి సీఎం చంద్రబాబు.. ఆపరేషన్ వైసీపీ! నెక్స్ట్ వికెట్..!

 

ఈ-పాస్‌పోర్ట్ వచ్చేసింది! విదేశాంగ శాఖ కీలక నిర్ణయం!

 

వారిని అభినందించిన లోకేష్.. ఏపీలో విద్యాసంస్కరణలపై దేశ వ్యాప్తంగా..

 

ఏపీలో రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసిన వారికి గుడ్‌న్యూస్..! ఒక్క క్లిక్‌తో స్టేటస్ చెక్ చేస్కోండిలా..!

 

ఎవ్వరూ మాట్లాడొద్దు..! లిక్కర్ స్కాంపై సీఎం ఆర్డర్స్!

 

ఏపీలో కొత్త నేషనల్ హైవే నాలుగు లైన్లుగా.. ఈ రూట్‌లో భూసేకరణ! ఇక 8 గంటల్లో విశాఖ!

 

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. అతి తక్కువ ధరకే ఫైబర్ నెట్.. ఆ వివరాలు మీకోసం!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 



   #AndhraPravasi #APHighCourt #CourtWarning #LegalNews #Penalty #Judgement #AndhraPradesh #BreakingNews