గ్రామ/ వార్డు సచివాలయ ఉద్యోగుల బదిలీల్లో వారి సొంత మండలంలో పోస్టింగ్ ఇవ్వరాదని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ప్రక్రియకు సంబంధించి గురువారం జారీచేసిన మార్గదర్శకాల్లో ఈ విషయాన్ని స్పష్టం చేసింది. 2025 మే 31 నాటికి ఒకే సచివాలయంలో ఐదేళ్ల సర్వీస్ పూర్తిచేసిన వారికి బదిలీ తప్పనిసరి. స్థానచలనం కల్పించిన ఉద్యోగుల వివరాలు హెచ్ఎర్ఎంఎస్ పోర్టల్లో జులై 10లోగా అప్లోడ్ చేయాలి. బదిలీల తరువాత సచివాలయాల్లో నిర్దేశించిన దానికంటే అధికంగా ఉన్న ఉద్యోగులు తదుపరి ఆదేశాలు వెలువడే వరకు ఆయా చోట్లే కొనసాగనున్నారు. దీనికి సంబంధించి ప్రభుత్వం కలెక్టర్లకే పూర్తి అధికారాలు కల్పించింది. ఈ నెల 30లోగా ప్రక్రియను పూర్తిచేయాలని ఆదేశించింది.
బదిలీల్లో వీరికి ప్రాధాన్యం..
అంధులు
మానసిక వికలాంగులైన పిల్లల తల్లిదండ్రులు
గిరిజన ప్రాంతాల్లో రెండేళ్లకు పైగా పనిచేసిన వారు
40 శాతానికి పైగా అంగవైకల్యం ఉన్నవారు
క్యాన్సర్, ఓపెన్ హార్ట్ సర్జరీ, న్యూరో సర్జరీ, కిడ్నీ మార్పిడి సమస్యలు ఉన్నవారు.
ఇది కూడా చదవండి: పేర్ని నాని.. అరెస్టు భయంతో పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నారు! మంత్రి షాకింగ్ కామెంట్స్!
కారుణ్య నియామకాల కింద ఉద్యోగాలు పొందిన వారు
భార్యాభర్తలిద్దరూ ఉద్యోగులైతే వీలైనంత వరకు సమీప ప్రాంతాల్లో వారిని నియమించాలి
వీరందరివీ రిక్వస్ట్ ట్రాన్స్ఫర్లుగా పరిగణించి ప్రయాణ భత్యాలు వర్తింపజేయాలి
ఐటీడీఏల్లో మొదట ఖాళీలు నింపాలి
అంతర్గత, వెనుకబడిన ప్రాంతాల్లో ఖాళీల భర్తీకి ప్రాధాన్యమివ్వాలి
ఐటీడీఏ ప్రాంతాల నుంచి బదిలీ అయిన వారి స్థానంలోకి వేరొకరు వచ్చి చేరాకే రిలీవ్ చేయాలి..
గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగుల హేతుబద్ధీకరణ, బదిలీలను ప్రభుత్వం ఒకేసారి చేపట్టింది. హేతుబద్ధీకరణకు సంబంధించిన జీవోలు (నంబర్లు 1, 3, 4) అనుసరించి బదిలీలు చేయాలని కలెక్టర్లకు సూచించింది. జనాభా పరంగా సచివాలయాలను ప్రభుత్వం పలు కేటగిరిలుగా విభజించింది. 'ఏ' కేటగిరి సచివాలయాల్లో ఆరుగురు, 'బీ'లో ఏడుగురు, 'సీ'లో ఎనిమిది మంది ఉద్యోగులను ఉంచాలని నిర్ణయించింది. వీరిని స్పెసిఫిక్ పర్పస్ (టెక్నికల్), జనరల్ పర్పస్ ఫంక్షనరీలుగా గుర్తించింది. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను బదిలీల్లో కలెక్టర్లు పాటించనున్నారు.
ఇది కూడా చదవండి: నామినేటెడ్ పదవుల మరో జాబితా విడుదల! ఆ కార్పొరేషన్ సభ్యులుగా..
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
ఆంధ్రప్రదేశ్‌లో మారిన కార్మిక చట్టం.. ఇకనుంచి 10 గంటలు పని చేయాల్సిందే! మహిళలకు రాత్రి షిఫ్ట్‌లలో..
ఆధార్ కార్డు ఉన్న వారికి అలర్ట్.. ఇదే ఆఖరి రోజు! ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన విషయం!
రెండు ఫ్యామిలీలకు సరిపోద్ది - ఈ కారు భారతదేశంలో నంబర్ వన్! ధర కేవలం రూ. 8.97 లక్షలు!
ఏపీలో వారందరికి గుడ్‌న్యూస్.. కొత్తగా పింఛన్‌లు.. నెలకు ఒక్కొక్కరికి రూ.4వేలు ఇస్తారు!
ఏపీ నుంచి అంతర్జాతీయ నగరాలకు విమానాల కనెక్టివిటీ పెంచాలి! సీఎం అధికారులకు సూచన!
ఏపీలో రైతులకు గుడ్‌న్యూస్.. ఒక్కొక్కరి అకౌంట్‌లో రూ.7వేలు! మూడు విడతల్లో - మంత్రి కీలక ప్రకటన!
నేడే తల్లికి వందనం పథకం అమలు.. ఒక్కో విద్యార్ధికి రూ.15 వేలు చొప్పున జమ!
కొత్త మంత్రులకు శాఖలు ఖరారు.. మరి కాసేపట్లో ఉత్తర్వులు! రేపే బాధ్యతల స్వీకరణ!
సజ్జలకు నోటీసులు.. అరెస్ట్‌కు రంగం సిద్ధం! ఆ పార్టీ నాయకులు మానసిక క్షోభకు..
పొదిలి లో హై టెన్షన్.. జగన్ పర్యటన నిరాకరించిన ప్రజలు! చెప్పు విసిరిన దుండగుడు!
టాలీవుడ్‌లో తీవ్ర విషాదం.. ప్రముఖ దర్శకుడు హఠాన్మరణం! దర్శకులు, నటీనటులు, అభిమానులు ఆవేదన వ్యక్తం
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: