Lakhs crores: బ్యాంక్, ఐటీ శాఖ షాక్... 20 ఏళ్ల యువకుడి ఖాతాలో లక్షల కోట్లు!

బుల్లితెరపై అగ్ర యాంకర్‌గా గుర్తింపు తెచ్చుకున్న అనసూయ భరద్వాజ్, ప్రస్తుతం సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ, ఇంకా చాలామందికి ఆమెను జబర్దస్త్ షో ద్వారానే గుర్తింపు ఉంది. ముఖ్యంగా జబర్దస్త్ పేరు వింటే అనసూయ పేరు తప్పనిసరిగా గుర్తుకు వస్తుంది. అయితే, ఆ షో ఇచ్చిన పాపులారిటీతోనే అనసూయ తర్వాత సినిమాల వైపు అడుగుపెట్టింది. రంగస్థలం, పుష్ప, పుష్ప 2, విమానం వంటి పెద్ద సినిమాల్లో నటించి మంచి స్థానం సంపాదించుకుంది.

Balakrishna: బాలకృష్ణను కలిసిన టాలీవుడ్‌ నిర్మాతలు.. ఎందుకు అంటే..!

ఇన్నేళ్ల తర్వాత మళ్లీ జబర్దస్త్ స్టేజ్ పై మెరిసిన అనసూయ, షో 12 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహించిన భారీ ఈవెంట్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ వేడుకకు నాగబాబు, ఇంద్రజ, ఖుష్బూ, అలాగే అప్పటి టీమ్ లీడర్లు, కమెడియన్లు హాజరయ్యారు. అనసూయ మాత్రం తన అందాలతో మెప్పించడమే కాకుండా ఓ స్టేజ్ పెర్ఫార్మెన్స్ కూడా ఇచ్చింది.

Gold News: అమ్మమ్మగారి నగలు అమ్ముదామనుకుంటున్నారా? పొరపాటున కూడా ఈ తప్పు చేయొద్దు! కొత్త నిబంధనలు ఇవే.!

ఇందుకు సంబంధించిన ప్రోమోలో, అనసూయ తొలిసారిగా యాంకర్ రష్మీతో తన విభేదాలపై స్పందించింది. “జీవితం ఒక్కోసారి రెండో అవకాశం ఇవ్వదని అంటారు. కానీ నేను నమ్మేది ఇస్తుందని. నేను కూడా కొన్ని ప్యాచప్స్ చేయడానికి రెడీగా ఉన్నాను” అని అనసూయ చెప్పి, స్టేజ్ మీద రష్మీని కౌగిలించుకుంది. ఈ సన్నివేశంతో రష్మీ కన్నీళ్లు పెట్టుకుంది. 

SIM Cards: 4 లక్షల సిమ్ కార్డులు బ్లాక్ చేసిన కేంద్రం..! వాటిని అరికట్టేందుకే..!

“ఇంత కాలం మన మధ్య గ్యాప్ ఉందని అందరూ మాట్లాడుకున్నారు. నిజానికి మనం ముందే వాట్సాప్‌లో కానీ, ఫోన్‌లో కానీ మాట్లాడుంటే ఈగోలు అడ్డుకాలేవు” అని రష్మీ చెప్పగా, అనసూయ నవ్వుతూ అంగీకరించింది.

500 Notes: ఏటీఎంలలో రూ. 500 నోట్ల సరఫరా ఆపుతున్నారా? పార్లమెంటులో కేంద్రం కీలక ప్రకటన!

ఈ సంఘటనతో ఇంతవరకు రూమర్స్‌గా మాత్రమే ఉన్న అనసూయ – రష్మీ విభేదాలు నిజమేనని తేలిపోయింది. గమనించదగ్గ విషయం ఏమిటంటే, అనసూయ జబర్దస్త్ యాంకర్‌గా ఉన్న సమయంలోనే ఎక్స్‌ట్రా జబర్దస్త్ ప్రారంభమైంది. దీనికి కూడా అనసూయనే యాంకర్‌గా కొనసాగించాలని మల్లెమాల భావించినా, ఆమె రెమ్యూనరేషన్ ఇష్యూ కారణంగా రష్మీని తీసుకువచ్చారని అప్పట్లో వార్తలు వచ్చాయి.

Annadatha Sukhibava: ఇలాంటి మెసేజ్ మీకూ వచ్చిందా..! బీకేర్ పుల్!

 దీంతో షోలో పోటీలా ఉన్న జబర్దస్త్ Vs ఎక్స్‌ట్రా జబర్దస్త్ పోరులో, యాంకర్ల మధ్యనూ తగువులు ఉన్నాయనే టాక్ వచ్చింది. అయితే ఇప్పటివరకు ఇద్దరూ ఈ విషయంపై స్పందించలేదు. ఇప్పుడు మాత్రం అనసూయ స్వయంగా ఈ విషయాన్ని అంగీకరించినట్టే అయింది.

Chandrababu Naidu: లిక్కర్ కేసు గురించి ఎవరూ మాట్లాడొద్దు! మంత్రులకు చంద్రబాబు హెచ్చరిక!

ఇక కెరీర్ విషయానికొస్తే, అనసూయ ఇటీవలే బుల్లితెరకు రీఎంట్రీ ఇచ్చి, కిర్రాక్ బాయ్స్ ఖిలాడీ గర్ల్స్ (సీజన్ 1, 2)తో పాటు పలు ప్రత్యేక ఈవెంట్లను కూడా యాంకర్ చేసింది. రష్మీ మాత్రం ప్రస్తుతం జబర్దస్త్‌తో పాటు శ్రీదేవి డ్రామా కంపెనీ షోలో కొనసాగుతోంది. అయితే సినిమాల్లో ఒకప్పుడు బిజీగా ఉన్న రష్మీ, ఇటీవలి కాలంలో మాత్రం కొంచెం లో ప్రొఫైల్‌లోకి వెళ్లినట్లు కనిపిస్తోంది.

Ropeway: ఆ ప్రాంతం ప్రజలకు శుభవార్త! రోప్ వే వచ్చేస్తోంది.. ఇక గాల్లో తేలిపోవడమే!
Stree Shakti: స్త్రీ శక్తి పథకానికి కేబినెట్ ఆమోదం.. పల్లెవెలుగు నుంచి మెట్రో ఎక్స్‌ప్రెస్!
Suman: సుమన్ పొలిటికల్ ఎంట్రీ? ఏ పార్టీలోకి అంటే?