ఇండియాలో విమానంలో ప్రయాణించాలని అందరికీ ఉంటుంది. ధనవంతులు ఈజీగా ఫ్లైట్ ఎక్కేయగలరు. ఎక్కడి నుంచి ఎక్కడికైనా ప్రయాణించగలరు. కాని మధ్యతరగతి వాళ్లు విమానం ప్రయాణించాలని అనుకుంటారని, వారి కలను నెరవేర్చడం తమ బాధ్యత అని టాటా గ్రూప్ ఎయిర్ ఇండియా భావించింది. అందుకే తక్కువ ధరకే ప్రీమియం ఎకానమీ ఫ్లైట్ టిక్కెట్లను అమ్ముతోంది. ఎయిర్ ఇండియా డొమెస్టిక్ ఫ్లైట్స్‌లో ప్రీమియం ఎకానమీ టికెట్ ధరను కేవలం రూ. 599 నుంచి స్టార్ట్ చేసింది. ఇది సాధారణ ఎకానమీ ఫేర్ కంటే తక్కువ. ఈ ఆఫర్ రూట్, డిమాండ్‌ను బట్టి మారుతుంది. ఇండియాలో ప్రీమియం ఎకానమీని అందించే ఏకైక ఎయిర్‌లైన్ ఎయిర్ ఇండియానే కావడం విశేషం.
ఇది కూడా చదవండి: ఇండియాలో 5 ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులు ఉన్న ఒకే ఒక్క రాష్ట్రం ఏదో తెలుసా.? అసలు ఊహించి ఉండరు!
ఈ రూ. 599 ఆఫర్‌ను ఉపయోగించుకొని టికెట్ తీసుకున్న వారు ఎయిర్ ఇండియాకు చెందిన 39 డొమెస్టిక్ రూట్లలో ఏదైనా ఒక రూటులో ప్రయాణించవచ్చు. మధ్య తరగతి వారు కూడా విమానాల్లో ప్రయాణించేలా చేయాలని ఎయిర్ ఇండియా ఈ నిర్ణయం తీసుకుంది. వారానికి 50,000 సీట్లను డిస్కౌంట్ ధరకు విక్రయించాలని ఎయిర్ ఇండియా నిర్ణయించింది. ఇప్పుడు ప్రీమియం ఎకానమీ సీట్లను 30% పెంచారు. దీంతో డిస్కౌంట్ ధరల్లో ప్రీమియం ఎకానమీ సీట్ల సంఖ్య వారానికి 65,000 దాటుతుంది. వీటిలో 34,000 సీట్లు మెట్రో నగరాల మధ్య ఉన్నాయి. ఢిల్లీ-ముంబై, ఢిల్లీ-బెంగళూరు, ఢిల్లీ-హైదరాబాద్, ముంబై-బెంగళూరు, ముంబై-హైదరాబాద్ రూట్లలో రూ. 599 నుంచి ఆఫర్ ధరతో ప్రీమియం ఎకానమీలో ప్రయాణించవచ్చు. ఎయిర్ ఇండియా ప్రీమియం ఎకానమీ కస్టమర్లకు అదనపు బెనిఫిట్స్ కూడా ఇస్తోంది. ఫ్రీగా సీట్లు సెలెక్ట్ చేసుకోవచ్చు. చెక్-ఇన్, బోర్డింగ్, లగేజీకి ప్రయారిటీ కూడా ఉంటుంది.
ఇది కూడా చదవండి: షాక్ షాక్.. నా రాజీనామా కి కారణం ఆమెనే.. ఇదే ఫైనల్ అన్న రాజశేఖర్! ఈయన బాటలో మరికొందరు ఎమ్మెల్సీలు!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
యాంకర్ విష్ణు ప్రియ అరెస్ట్..? ఎందుకో తెలుసా? వాస్తవానికి ఈ కేసులో..
కేబినెట్ ర్యాంకుతో.. కీలక నిర్ణయం! ఏపీ ప్రభుత్వ గౌరవ సలహాదారుగా ఆమె పేరు ఫిక్స్!
మాజీ మంత్రికి టీడీపీ నేత బుద్ధా వెంకన్న సవాల్! అవినీతి సొమ్ముతో అడ్డగోలుగా..
బొత్స వ్యాఖ్యలకు లోకేష్ దిమ్మతిరిగే కౌంటర్! మండలిలో మాటల యుద్ధం! దమ్ముంటే ఈ డేటాను ఇవ్వండి..
జగన్ కి షాక్‌ల మీద షాక్‌లు.. వైసీపీలో గందరగోళం.. మరో కీలక నేత రాజీనామా!
అయ్యయ్యో.. ఏపీ ఎమ్మెల్యేలకు క్రీడా పోటీలు... గాయపడిన ఎమ్మెల్యే.!
వైసీపీకి గట్టి ఎదురు దెబ్బ! రేపు కూటమిలో చేరబోతున్న వైసీపీ కార్పొరేటర్లు ....
ఏపీలో భానుడి ప్రతాపం ! తీవ్రంగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలు! ఆస్పత్రుల్లో డీహైడ్రేషన్ కేసులు...
ఇండియాలో 5 ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులు ఉన్న ఒకే ఒక్క రాష్ట్రం ఏదో తెలుసా.? అసలు ఊహించి ఉండరు!
పోసాని పొలిటికల్ స్క్రిప్ట్! డైలాగ్ రైటర్ నుండి రిమాండ్ రైటర్ వరకు...
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: