మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత బుద్దా వెంకన్న తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మద్యం తాగడం ఆరోగ్యానికి హానికరం అని గతంలో ఉండేదని.. కానీ జగన్ జమానాలో మద్యం తాగితే ప్రాణాలు కోల్పోయేలా చేశారని విమర్శలు చేశారు. ‘చంద్రబాబు మీలాగా దౌర్జన్యాలు చేయిస్తే... మీరు అసలు రోడ్ల మీదకు వచ్చేవారా. అరాచక శక్తులను చంద్రబాబు అణచి వేస్తారు.. మీలాగా దాడులు చేయించరు. పుంగనూరులో మా టీడీపీ కార్యకర్తను చంపించారు... చంద్రబాబు, లోకేష్ మిమ్మలను వదలరు. ఈహత్య కేసులో దోషులను కఠినంగా శిక్షించాలి. గత జగన్ ప్రభుత్వంలో వేలకోట్ల రూపాయల మద్యం కుంభకోణం చేశారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దమ్ముంటే నేను అడిగే వాటికి సమాధానం చెప్పాలి. ప్రజల సొమ్ము దోచుకున్న మీరు ప్రజా నాయకుడిని ఓడిస్తా అంటూ ప్రగల్భాలు పలుకుతారా. వైసీపీ నేతలతో సోషల్ మీడియాలో చంద్రబాబు, లోకేష్‌లపై నీచంగా ట్రోల్ చేయిస్తారా. అవినీతి సొమ్ముతో అడ్డగోలుగా వ్యవహారిస్తే...
ఇది కూడా చదవండి: బొత్స వ్యాఖ్యలకు లోకేష్ దిమ్మతిరిగే కౌంటర్! మండలిలో మాటల యుద్ధం! దమ్ముంటే ఈ డేటాను ఇవ్వండి..vv
మీ అందరి సంగతి తేలుస్తాం. అయ్యప్ప సాక్షిగా మద్యం కుంభకోణంలో మా పాత్ర లేదని చెప్పే ధైర్యం ఉందా. ప్రతి సంవత్సరం మాల వేయడం కాదు...అవినీతి చేయకుండా .. నిజాయితీగా బతకాలి. ఈ మద్యం కుంభకోణం గురించి ప్రజలకు కూడా వాస్తవాలు తెలియాలి. రేపు తండ్రీ, కొడుకులు అరెస్టు అయితే కూటమి ప్రభుత్వంపై గగ్గోలు పెడతారు. తప్పు చేసిన ఎవరైనా జైలుకు వెళ్లక తప్పదు. మేము తప్పు చేయకపోయినా మా వాళ్లను అక్రమంగా అరెస్టు చేశారు. నా ఛాలెంజ్‌కు పెద్దిరెడ్డి కుటుంబం స్పందించాలి. మద్యం అవినీతి సొమ్ముతో మాకు సంబంధం లేదని ప్రమాణం చేయాలి. ప్రమాణం చేయకుండా చంద్రబాబు, కూటమి ప్రభుత్వంపై నిందలు వేస్తే చూస్తూ ఊరుకోం. ప్రజలు కూడా వారి అవినీతి గురించి తెలుసుకుని, వారు చేసే తప్పుడు ప్రచారాలను తిప్పి కొట్టండి’ అని బుద్దా వెంకన్న కోరారు.
ఇది కూడా చదవండి: నామినేటెడ్ పదవుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ! 60 వేల దరఖాస్తుల పరిశీలన! కొనసాగుతున్న కసరత్తు!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
జగన్ కి షాక్‌ల మీద షాక్‌లు.. వైసీపీలో గందరగోళం.. మరో కీలక నేత రాజీనామా!
అయ్యయ్యో.. ఏపీ ఎమ్మెల్యేలకు క్రీడా పోటీలు... గాయపడిన ఎమ్మెల్యే.!
వైసీపీకి గట్టి ఎదురు దెబ్బ! రేపు కూటమిలో చేరబోతున్న వైసీపీ కార్పొరేటర్లు ....
ఏపీలో భానుడి ప్రతాపం ! తీవ్రంగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలు! ఆస్పత్రుల్లో డీహైడ్రేషన్ కేసులు...
ఇండియాలో 5 ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులు ఉన్న ఒకే ఒక్క రాష్ట్రం ఏదో తెలుసా.? అసలు ఊహించి ఉండరు!
పోసాని పొలిటికల్ స్క్రిప్ట్! డైలాగ్ రైటర్ నుండి రిమాండ్ రైటర్ వరకు...
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: