విజయవాడలోని ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో శాసనసభ్యులు, శాసనమండలి సభ్యుల కోసం క్రీడా పోటీలు నిర్వహిస్తున్న విషయం విదితమే. ఈ పోటీలలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఎంతో ఉత్సాహంగా పాల్గొంటున్నారు. ఈ క్రీడా పోటీలలో పాల్గొన్న ప్రకాశం జిల్లా సంతనూతలపాడు ఎమ్మెల్యే విజయ్ కుమార్ గాయపడ్డారు. క్రికెట్ మ్యాచ్‌లో ఫీల్డింగ్ చేస్తూ కింద పడిపోవడంతో ఆయన ముఖానికి గాయాలయ్యాయి. వెంటనే వైద్యులు ప్రాథమిక చికిత్స అందించారు. కుట్లు వేయవలసి ఉండటంతో ఆయనను ఆసుపత్రికి తరలించారు. మూడు రోజులపాటు నిర్వహించనున్న ప్రజాప్రతినిధుల క్రీడా పోటీలను మంగళవారం సాయంత్రం అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు ప్రారంభించిన విషయం తెలిసిందే.
ఇది కూడా చదవండి: నామినేటెడ్ పదవుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ! 60 వేల దరఖాస్తుల పరిశీలన! కొనసాగుతున్న కసరత్తు!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
వైసీపీకి గట్టి ఎదురు దెబ్బ! రేపు కూటమిలో చేరబోతున్న వైసీపీ కార్పొరేటర్లు ....
పోసాని పొలిటికల్ స్క్రిప్ట్! డైలాగ్ రైటర్ నుండి రిమాండ్ రైటర్ వరకు...
ఏపీ కేబినెట్‌లో కీలక నిర్ణయాలు ఇవే.. పలు బిల్లులకు ఆమోదం..! ఇక వారికి పండగే పండగ!
కేబినెట్ భేటీ అనంతరం చంద్రబాబు చాంబర్‌లో పవన్ కల్యాణ్ తో ప్రత్యేక భేటీ! పలు కీలక నిర్ణయాలకు ఆమోదం!
డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి మెయిన్స్ షెడ్యూల్ విడుదల! ఎప్పటి నుంచి అంటే..!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: