ఏపీలో ఎండ తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది. నడి వేసవి రాకముందే ప్రజలు భయపడే స్థాయిలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 40 డిగ్రీల ఉష్ణోగ్రత సాధారణమైపోతోంది. చిత్తూరు నుంచి శ్రీకాకుళం వరకు పలు ప్రాంతాల్లో ఎండలు దంచికొడుతున్నాయి. దీనికి తోడు వడగాల్పులు ప్రబలడం ప్రజలకు మరింత ఇబ్బందికరంగా మారింది. రోడ్లపైకి రావాలంటే ప్రజలు హడలిపోతున్నారు.

ఇది కూడా చదవండివైసీపీకి మరో భారీ షాక్! కీలక నేత అరెస్ట్.. అసలు ఏమైందంటే..?

ప్రత్యేకించి రాయలసీమ జిల్లాల్లో వేడి గాలులు ప్రజలను తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నాయి. ఏప్రిల్, మే నెలల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగి 45 నుంచి 47 డిగ్రీల వరకు చేరుకునే అవకాశముందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఇటీవల నంద్యాల జిల్లాలో 42.7 డిగ్రీలు, కర్నూలు జిల్లా ఉలిందకొండలో 42.6 డిగ్రీలు, కడప జిల్లా ఖాజీపేటలో 41.8 డిగ్రీల మేర టెంపరేచర్ నమోదైంది. విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపిన సమాచారం మేరకు, శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, తూర్పుగోదావరి, ఏలూరు జిల్లాల్లో వడగాల్పులు ప్రభావం చూపే అవకాశముంది.

ఈ పరిస్థితి త్వరగా మారే సూచనలు కనిపించడం లేదు. మంగళవారం 58 మండలాల్లో వడగాల్పులు నమోదు కాగా, గురువారం కూడా 37 మండలాల్లో ఇదే పరిస్థితి కొనసాగుతుందని అధికారులు హెచ్చరించారు. ఎండ తీవ్రత పెరిగే సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, రద్దీ ప్రాంతాలకు దూరంగా ఉండాలని, శరీరాన్ని తేమగా ఉంచుకోవాలని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ సూచించారు.

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి


మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు
:


ఏపీ పింఛన్ దారులకు గుడ్ న్యూస్! ఆధార్ ఫింగర్ సమస్యకు పరిష్కారం.. ప్రభుత్వం కీలక నిర్ణయం!


తిరుమలలో భక్తుల వసతి కష్టాలకు చెక్! శిథిల భవనాల తొలగింపు.. టీటీడీ కార్యాచరణతో కీలక మార్పులు!


మాజీ ఎమ్మెల్యేపై కాల్పులు కలకలం.. సీసీ టీవీ పుటేజీ ఆధారంగా.!

నేటితో గొడ్డలి వేటుకు ఏళ్లు! కీలక సాక్షులు అనుమానాస్పద మృతి! బయటకు రానున్న నిజాలు!

 రాజకీయాలకు గుడ్ బై చెప్పనున్న కీలక నేత! ఆ అవకాశం రాకపోతే...!

 గత ప్రభుత్వంలో చీకట్లలో కూరుకుపోయిన విద్యుత్‌ రంగం... అసలు నిజాలు బయటకు!

ఇంటికి వెళ్లండి లేదా జైలుకు వెళ్లండి! ట్రంప్ యొక్క కఠినమైన విధానం! గ్రీన్ కార్డ్ హోల్డర్లు బహిష్కరణ !

బోరుగడ్డ అనిల్‌పై నాన్‌స్టాప్ కేసులు! రాజమండ్రిలో కృష్ణా పోలీసులు.. రేపు కోర్టులో హాజరు!

మీరు UPI వాడుతున్నారా?.. ఈ రూల్స్ ఏప్రిల్ నుండి మారుతోంది.. తెలుసుకోకపోతే ఇక అంతే!

ఏపీ ఇంటర్ విద్యలో విప్లవాత్మక మార్పులు.. సబ్జెక్టుల ఎంపికలో స్వేచ్ఛ! పోటీ పరీక్షల కోచింగ్‌లో..!

తల్లికి వందనం పథకంపై వైసీపీ అబద్ధాల హడావిడి! సీఎం చంద్రబాబు క్లారిటీ!

వైసీపీకి గట్టి ఎదురుదెబ్బ.. కోర్టులో పోసాని డ్రామా రివర్స్.. అనుకున్నదొకటి అయ్యింది ఇంకొకటి! ఈసారి ఏ జైలు కంటే.!

ముగ్గురు ఐపీఎస్‌లకు ఊహించని షాక్... కూటమి సర్కార్ కీలక నిర్ణయం! వైసీపీ హయాంలో అక్రమాలు..!

రైల్వే ప్రయాణికులకు గమనిక.. ఆ నాలుగు రైళ్లు ఇకపై అక్కడ నుంచి బయలుదేరుతాయి..

వల్లభనేని వంశీకి మళ్లీ భారీ షాక్.. రిమాండ్ అప్పటి వరకు పొడిగింపు.!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group