వైసీపీ ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ (YSRCP MLC Marri Rajsekhar) రాజీనామా ఇప్పుడు అసెంబ్లీలో హాట్‌టాపిక్‌గా మారింది. వైసీపీకి రాజీనామా చేసిన మర్రి.. కాసేపటి క్రితమే శాసనమండలి ఛైర్మన్ కొయ్యే మోషేన్ రాజును (AP Legislative Council Chairman moshen raju) కలిసి రాజీనామా పత్రాన్ని అందజేశారు. తన రాజీనామాను వెంటనే ఆమోదించాలని మండలి చైర్మన్‌ను కోరారు. మర్రి రాజశేఖర్ పదవీకాలం 2029 వరకూ ఉంది. వైసీపీకి రాజీనామా చేసిన ఆయన త్వరలో తెలుగుదేశం (TDP) గూటికి వెళ్లనున్నట్లు తెలుస్తోంది. అయితే.. రాజీనామాకు సిద్ధమైన రాజశేఖర్‌ను బుజ్జగించేందుకు ప్రయత్నించారు వైసీపీ నేతలు. రాజీనామాను ఉపసంహరించుకోవాలని ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ కోరారు. అయితే తాను నిర్ణయం తీసేసుకున్నట్లు తేల్చిచెప్పేశారు రాజశేఖర్. వైసీపీ సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. కాగా.. చిలకలూరిపేట(Chilakalupet) ఇన్‌చార్జిగా విడదల రజనీని(Vidadala Rajini) నియమించడం పట్ల మర్రి రాజశేఖర్ తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది.
ఇది కూడా చదవండి: మాజీ మంత్రికి టీడీపీ నేత బుద్ధా వెంకన్న సవాల్! అవినీతి సొమ్ముతో అడ్డగోలుగా..
రజనీని వైసీపీ ఇన్‌చార్జిగా నియమించిన నాటి నుంచి వైసీపీ(YCP)కి దూరంగా ఉంటూ వస్తున్నారు. వైవీ సుబ్బారెడ్డి, అయోద్యరామిరెడ్డి బుజ్జగించినప్పటికి ఆయన అసంతృప్తిలోనే ఉన్నారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ఘోరంగా ఓడిపోయిన రజనీని(Vidadala Rajini) మరల చిలకలూరిపేట ఇన్‌చార్జిగా ఎలా నియమిస్తారని రాజశేఖర్ ప్రశ్నించారు. చివరకు వైసీపీకి గుడ్‌బై చెప్పేయాలని నిర్ణయించుకున్న ఆయన.. రాజీనామా పత్రాన్ని మండలి చైర్మన్‌కు అందజేశారు. కానీ మర్రి రాజశేఖర్ రాజీనామా చేస్తున్నారని తెలిసిన వెంటనే లాబీలో ఆయనతో మాట్లాడేందుకు వైసీపీ నేతలు ప్రయత్నించారు. రాజీనామా చేయాలని నిర్ణయం తీసేసుకున్నట్లు వారికి తేల్చి చెప్పేశారు రాజశేఖర్. మర్రి రాజశేఖర్ రాజీనామాతో వైసీపీ అసంతృప్త ఎమ్మెల్సీల సంఖ్య ఐదుకు చేరింది. అయితే మర్రి రాజశేఖర్ బాటలో మరికొందరు వైసీపీ(YCP) ఎమ్మెల్సీలు ఉన్నట్లు తెలుస్తోంది. నెక్స్ట్ ఎవరంటూ మండలి లాబీలో విస్తృత చర్చనడుస్తోంది.
ఇది కూడా చదవండి: నామినేటెడ్ పదవుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ! 60 వేల దరఖాస్తుల పరిశీలన! కొనసాగుతున్న కసరత్తు!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
బొత్స వ్యాఖ్యలకు లోకేష్ దిమ్మతిరిగే కౌంటర్! మండలిలో మాటల యుద్ధం! దమ్ముంటే ఈ డేటాను ఇవ్వండి..
జగన్ కి షాక్‌ల మీద షాక్‌లు.. వైసీపీలో గందరగోళం.. మరో కీలక నేత రాజీనామా!
అయ్యయ్యో.. ఏపీ ఎమ్మెల్యేలకు క్రీడా పోటీలు... గాయపడిన ఎమ్మెల్యే.!
వైసీపీకి గట్టి ఎదురు దెబ్బ! రేపు కూటమిలో చేరబోతున్న వైసీపీ కార్పొరేటర్లు ....
ఏపీలో భానుడి ప్రతాపం ! తీవ్రంగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలు! ఆస్పత్రుల్లో డీహైడ్రేషన్ కేసులు...
ఇండియాలో 5 ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులు ఉన్న ఒకే ఒక్క రాష్ట్రం ఏదో తెలుసా.? అసలు ఊహించి ఉండరు!
పోసాని పొలిటికల్ స్క్రిప్ట్! డైలాగ్ రైటర్ నుండి రిమాండ్ రైటర్ వరకు...
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: