LIVE
Assam: అస్సాంలో యుద్ధ విమానం ప్రమాదం.. ఐదుగురు వాయుసేన సిబ్బంది మృతి!  •  Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!  •  Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!  •  Modi: ఫ్రాన్స్, స్లోవేకియా పర్యటనకు ప్రధాని మోదీ.. యూరప్ దేశాలతో బంధాల బలోపేతమే లక్ష్యం!  •  Health Tips: పక్షవాతానికి ముందు వచ్చే డేంజర్ బెల్స్.. మైక్రో స్ట్రోక్ పై వైద్యుల వివరణ!  •  Promotions: దేవాదాయ శాఖలో భారీ ప్రమోషన్లు.. గ్రేడ్-1 ఆఫీసర్లుగా 26 మంది ఈఓలకు పదోన్నతులు!  •  TTD Updates: శ్రీవారి భక్తులకు అలర్ట్.. సెప్టెంబర్ నెల తిరుమల దర్శన టికెట్ల కోటా షెడ్యూల్ విడుదల!  •  EPFO: పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్... 8.25 శాతం వడ్డీ డబ్బులు అకౌంట్లలోకి వచ్చేది అప్పుడే!  •  Allu Arjun: రెండు దశాబ్దాల తర్వాత అదే క్రేజ్... 'హ్యాపీ' రీ-రిలీజ్ కలెక్షన్ల సంచలనం!  •  Srisailam: శ్రీశైల క్షేత్రంలో రికార్డు స్థాయి ఆర్థిక ప్రగతి.. బ్యాంకుల్లో వందల కోట్ల భారీ ఫిక్స్‌డ్ డిపాజిట్లు!  • 
AndhraPravasi
AndhraPravasi
Latest Telugu and AP community news
⚡ BREAKING
Lifestyle

Tomato Stuffed Curry: కేవలం పది నిమిషాల్లో.. టమాటాతో రొటీన్ కూరలు తిని బోర్ కొట్టిందా? ఈ ‘గుత్తి టమాటా మసాలా’ ట్రై చేయండి!

Tomato Stuffed Curry In Telugu: మనందరి ఇళ్లలోనూ ప్రతిరోజూ ఎదురయ్యే అతి పెద్ద ప్రశ్న - "ఈరోజు కూర ఏం చేయాలి?". ఫ్రిజ్ తెరిచి చూస్తే ఎక్కువగా కనిపించేవి టమాటాలే. అటువంటప్పుడు రొటీన్ గా చేసే టమాటా పప్పు లేదా టమాటా పచ్చడి కాకుండా, ఏదైనా స్పెషల్ గా చేయాలనిపిస్తే 'గుత్తి టమాటా మసాలా క…

AndhraPravasi News Desk 2 min read
Tomato Stuffed Curry: కేవలం పది నిమిషాల్లో.. టమాటాతో రొటీన్ కూరలు తిని బోర్ కొట్టిందా? ఈ ‘గుత్తి టమాటా మసాలా’ ట్రై చేయండి!
  • చిన్న టమాటాలతో పెద్ద మ్యాజిక్: బిర్యానీ, పుల్కాల్లోకి అదిరిపోయే మసాలా కర్రీ రెసిపీ..
     
  • ఈరోజు కూర ఏం చేయాలి? అనే ప్రశ్నకి సమాధానం.. నోరూరించే ఈ స్పెషల్ టమాటా కర్రీ!

Tomato Stuffed Curry In Telugu: మనందరి ఇళ్లలోనూ ప్రతిరోజూ ఎదురయ్యే అతి పెద్ద ప్రశ్న - "ఈరోజు కూర ఏం చేయాలి?". ఫ్రిజ్ తెరిచి చూస్తే ఎక్కువగా కనిపించేవి టమాటాలే. అటువంటప్పుడు రొటీన్ గా చేసే టమాటా పప్పు లేదా టమాటా పచ్చడి కాకుండా, ఏదైనా స్పెషల్ గా చేయాలనిపిస్తే 'గుత్తి టమాటా మసాలా కర్రీ' ఒక అద్భుతమైన ఆప్షన్. ఈ కూర వేడి వేడి అన్నంలోకైనా, చపాతీ, రోటీ, పుల్కా లేదా బిర్యానీ వంటి మసాలా రైస్ రకాల్లోకైనా చాలా రుచిగా ఉంటుంది. ఈ రోజు మనం ఎంతో టేస్టీగా ఉండే ఈ గ్రేవీ రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో వివరంగా తెలుసుకుందాం.

కావలసిన పదార్థాలు..
ఈ కూర రుచిగా రావాలంటే మనం ఎంచుకునే టమాటాలు ముఖ్యం. మరీ పెద్దవి కాకుండా చిన్న సైజులో ఉండే పావు కేజీ టమాటాలు తీసుకోండి.

తయారీ విధానం
1. టమాటాల తయారీ:
ముందుగా టమాటాలను శుభ్రంగా కడిగి, పైన ఉండే తొడుముని కట్ చేయాలి. తర్వాత టమాటాని పూర్తిగా విడదీయకుండా, పైన నాలుగు గాట్లు పెట్టుకోవాలి (గుత్తి వంకాయకి పెట్టినట్టు). ఇలా చేయడం వల్ల మసాలా లోపలి వరకు వెళ్లి టమాటా రుచిగా ఉంటుంది.

2. అద్భుతమైన మసాలా పేస్ట్:
స్టవ్ మీద పాన్ పెట్టుకుని వేరుశెనగ గుళ్ళను దోరగా వేయించాలి. అవి వేగాక నువ్వులు వేసి చిటపటలాడే వరకు ఫ్రై చేసి పక్కకు తీయాలి. ఇవి చల్లారిన తర్వాత మిక్సీ జార్ లోకి తీసుకుని, పైన చెప్పిన మసాలా దినుసులన్నీ (ధనియాలు, జీలకర్ర, కొబ్బరి, జీడిపప్పు, గసగసాలు, చెక్క, లవంగాలు, యాలకులు) వేసి మొదట మెత్తటి పొడిలా గ్రైండ్ చేయాలి. ఆ తర్వాత తగినన్ని నీళ్లు పోసి స్మూత్ పేస్ట్ లా చేసి పక్కన పెట్టుకోవాలి.

3. టమాటాలను మగ్గించడం:
కడాయిలో ఒక టేబుల్ స్పూన్ నూనె వేసి, మనం గాట్లు పెట్టుకున్న టమాటాలను అందులో వేయాలి. కొద్దిగా ఉప్పు, పసుపు చల్లి మూత పెట్టి మధ్యమధ్యలో కలుపుతూ 60 నుంచి 80 శాతం వరకు మగ్గించుకోవాలి. ఇవి మరీ మెత్తగా అవ్వాల్సిన అవసరం లేదు. తర్వాత వీటిని ఒక ప్లేట్ లోకి తీసి పక్కన పెట్టండి.

4. గ్రేవీ తయారీ:
అదే కడాయిలో మరికొంత నూనె వేసి ఆవాలు, జీలకర్ర పోపు వేయాలి. సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి, అవి బాగా వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేయాలి. ఇప్పుడు అందులో పసుపు, కారం, ఉప్పు వేసి కలిపి, మనం ముందుగా సిద్ధం చేసుకున్న మసాలా పేస్ట్ వేయాలి. ఈ మసాలా నుండి నూనె పైకి తేలేంత వరకు నిదానంగా వేయించాలి. అప్పుడే కూరకు మంచి రుచి వస్తుంది.

5. వంట పూర్తి చేయడం:
మసాలా వేగాక చింతపండు రసం పోసి రెండు నిమిషాలు ఉడికించాలి. గ్రేవీ కొంచెం ఉడుకుతున్నప్పుడు పచ్చిమిరపకాయలు, కరివేపాకు, గరం మసాలా మరియు వేయించి పెట్టుకున్న టమాటాలను వేయాలి. గ్రేవీ చిక్కదనాన్ని బట్టి ముప్పావు కప్పు నీళ్లు పోసి, మూత పెట్టి 5-10 నిమిషాలు లో టు మీడియం ఫ్లేమ్ లో ఉడికించాలి.

రుచిని పెంచే రహస్యం (Tips)
ఇలా చేస్తే ఎంతో రుచికరమైన గుత్తి టమాటా మసాలా కర్రీ రెడీ! మీ ఇంట్లో వారు కూడా డెఫినెట్ గా మళ్ళీ మళ్ళీ చేయమని అడుగుతారు. మీరు కూడా ఈ పద్ధతిలో ట్రై చేసి చూడండి.

Be the first to react

More Coverage

Highway Signboards: మీరు ఎప్పుడైనా గమనించారా? రోడ్డు పక్కన ఉండే ఆకుపచ్చ బోర్డుల వెనుక ఇంత పెద్ద సైన్స్ ఉందా? తెలిస్తే అబ్బా అంటారు!

Highway Signboards: మీరు ఎప్పుడైనా గమనించారా? రోడ్డు పక్కన ఉండే ఆకుపచ్చ బోర్డుల వెనుక ఇంత పెద్ద సైన్స్ ఉందా? తెలిస్తే అబ్బా అంటారు!

Highway Signboards: మీరు ఎప్పుడైనా హైవేలపై ప్రయాణించినప్పుడు రోడ్డు పక్కన లేదా పైన ఉండే బోర్డులను గమ…

South Korea: కొరియాలో ఉద్యోగం అంత కష్టమా? ‘భారతీయులెవరూ ఇక్కడికి రావద్దు’ అంటూ యువతి వైరల్ వీడియో!

South Korea: కొరియాలో ఉద్యోగం అంత కష్టమా? ‘భారతీయులెవరూ ఇక్కడికి రావద్దు’ అంటూ యువతి వైరల్ వీడియో!

South Korea: దక్షిణ కొరియాలో ఉద్యోగం చేయాలనుకుంటున్న భారతీయులను హెచ్చరిస్తూ ఓ యువతి పోస్ట్ చేసిన వీడ…