LIVE
Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!  •  Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!  •  Modi: ఫ్రాన్స్, స్లోవేకియా పర్యటనకు ప్రధాని మోదీ.. యూరప్ దేశాలతో బంధాల బలోపేతమే లక్ష్యం!  •  Promotions: దేవాదాయ శాఖలో భారీ ప్రమోషన్లు.. గ్రేడ్-1 ఆఫీసర్లుగా 26 మంది ఈఓలకు పదోన్నతులు!  •  TTD Updates: శ్రీవారి భక్తులకు అలర్ట్.. సెప్టెంబర్ నెల తిరుమల దర్శన టికెట్ల కోటా షెడ్యూల్ విడుదల!  •  EPFO: పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్... 8.25 శాతం వడ్డీ డబ్బులు అకౌంట్లలోకి వచ్చేది అప్పుడే!  •  Allu Arjun: రెండు దశాబ్దాల తర్వాత అదే క్రేజ్... 'హ్యాపీ' రీ-రిలీజ్ కలెక్షన్ల సంచలనం!  •  Srisailam: శ్రీశైల క్షేత్రంలో రికార్డు స్థాయి ఆర్థిక ప్రగతి.. బ్యాంకుల్లో వందల కోట్ల భారీ ఫిక్స్‌డ్ డిపాజిట్లు!  •  Google Maps: గూగుల్ మ్యాప్స్ క్రేజీ అప్‌డేట్.. ఇకపై పెట్రోల్, డీజిల్ ఖర్చులు మిగిలడం ఖాయం!  •  AP CRDA: 0.4 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో రూపుదిద్దుకుంటున్న నీరుకొండ రిజర్వాయర్...  • 
AndhraPravasi
AndhraPravasi
Latest Telugu and AP community news
⚡ BREAKING
Lifestyle

Benefits of Sugarcane Juice: చెరుకు రసంతో లాభాలే కాదు.. ముంచుకొస్తున్న ముప్పులు ఇవే! ఆరోగ్య నిపుణుల హెచ్చరిక..!!

Benefits of Sugarcane Juice: ఎండకాలంలో దాహం తీర్చుకోవడానికి చెరుకు రసం తాగుతున్నారా? అయితే జాగ్రత్త! ఒక గ్లాసు చెరుకు రసంలో ఉండే కేలరీలు, చక్కెర శాతం దీనివల్ల కలిగే సైడ్ ఎఫెక్ట్స్ గురించి తెలుసుకోండి..

AndhraPravasi News Desk 2 min read
Benefits of Sugarcane Juice: చెరుకు రసంతో లాభాలే కాదు.. ముంచుకొస్తున్న ముప్పులు ఇవే! ఆరోగ్య నిపుణుల హెచ్చరిక..!!

Benefits of Sugarcane Juice: భానుడు భగభగలాడుతున్నాడు మార్చి నెలలోనే ఎండలు ముదురుతున్నాయి. బయటకు వెళ్తే చాలు చెమటలు కక్కాల్సిందే. ఇలాంటి టైంలో మన కళ్లు ముందుగా వెతికేది రోడ్డు పక్కన ఉండే చెరుకు రసం బండ్లనే. గ్లాసు పట్టుకుని గటగటా తాగేస్తే ఆ కిక్కే వేరు తక్షణమే శక్తి వస్తుంది, దాహం తీరుతుంది. అయితే, ఈ తీపి పానీయం అమృతంలా అనిపించినా, దీని వెనుక కొన్ని జాగ్రత్తలు కూడా ఉన్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అవేంటో ఈ రోజు మనం  తెలుసుకుందాం.

ముందుగా మంచి విషయాల గురించి మాట్లాడుకుంటే.. చెరుకు రసం కేవలం రుచి కోసమే కాదు, ఇది ఒక పోషకాల గని. ఇందులో కాల్షియం, మెగ్నీషియం, ఐరన్ వంటి ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఎండలో తిరిగి నీరసించిపోయిన వారికి ఇది వెంటనే 'గ్లూకోజ్' లాగా పనిచేస్తుంది. అలాగే, కాలేయ సమస్యలు (లివర్ ప్రాబ్లమ్స్) ఉన్నవారికి ఇది చాలా మంచిది. మూత్రపిండాల్లో రాళ్లు ఉన్నా లేదా మూత్రంలో మంట వస్తున్నా చెరుకు రసం తాగడం వల్ల ఉపశమనం లభిస్తుంది. జీర్ణక్రియ మెరుగుపడటమే కాకుండా ముఖం మీద మొటిమలు కూడా తగ్గుతాయని చెబుతుంటారు.

ఏదైనా ఎక్కువైతే ఇబ్బందే అన్నట్లు ఒక గ్లాసు చెరుకు రసంలో దాదాపు 250 నుండి 300 కేలరీలు ఉంటాయి. ఇందులో చక్కెర శాతం చాలా ఎక్కువ. మీరు రోజుకు రెండు మూడు గ్లాసులు తాగితే, మీ శరీరంలోకి తెలియకుండానే భారీగా కేలరీలు వెళ్ళిపోతాయి. దీనివల్ల బరువు పెరిగే అవకాశం ఎక్కువగా ఉంది. ముఖ్యంగా డయాబెటిస్ లేదా షుగర్ వ్యాధి ఉన్నవారు దీనికి దూరంగా ఉండటమే మంచిది. లేదంటే రక్తంలో చక్కెర స్థాయిలు అదుపు తప్పుతాయి.

చెరుకు రసం తాగడం వల్ల కొందరిలో తల తిరగడం, నిద్రలేమి లేదా పొట్టలో గడబిడ వంటి సమస్యలు రావచ్చు. దీనికి ప్రధాన కారణం అందులో ఉండే 'పోలికోసనాల్' అనే పదార్థం. అలాగే రోడ్డు పక్కన తాగేటప్పుడు శుభ్రతను కూడా గమనించాలి. గ్లాసులు సరిగ్గా కడగకపోయినా, ఈగలు ముసిరే చోట తయారు చేసినా మనకు టైఫాయిడ్ లేదా కలరా వంటి జబ్బులు వచ్చే ప్రమాదం ఉంది. చెరుకు రసాన్ని తీసిన వెంటనే తాగేయాలి. అలా కాకుండా ఫ్రిజ్‌లో పెట్టినా లేదా కాసేపు బయట ఉంచినా అది ఆక్సీకరణం చెంది విషపూరితంగా మారుతుంది.

వేసవిలో శరీరాన్ని చల్లబరుచుకోవడానికి చెరుకు రసం మంచి ఎంపికే, కానీ అది పరిమితంగా ఉన్నప్పుడే. రోజుకు ఒక గ్లాసు తాగడం వల్ల పెద్దగా నష్టం ఉండదు. అయితే, మీకు ఇప్పటికే ఏదైనా ఆరోగ్య సమస్యలు ఉంటే మాత్రం డాక్టర్ సలహా తీసుకోవడం మర్చిపోవద్దు. దాహాన్ని తీర్చుకోవడానికి కేవలం జ్యూస్‌లపైనే ఆధారపడకుండా మంచినీళ్లు, కొబ్బరి నీళ్లు  మజ్జిగకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వండి. ఆరోగ్యంగా ఉండండి, వేసవిని జాగ్రత్తగా ఎదుర్కోండి..

Be the first to react

More Coverage

Highway Signboards: మీరు ఎప్పుడైనా గమనించారా? రోడ్డు పక్కన ఉండే ఆకుపచ్చ బోర్డుల వెనుక ఇంత పెద్ద సైన్స్ ఉందా? తెలిస్తే అబ్బా అంటారు!

Highway Signboards: మీరు ఎప్పుడైనా గమనించారా? రోడ్డు పక్కన ఉండే ఆకుపచ్చ బోర్డుల వెనుక ఇంత పెద్ద సైన్స్ ఉందా? తెలిస్తే అబ్బా అంటారు!

Highway Signboards: మీరు ఎప్పుడైనా హైవేలపై ప్రయాణించినప్పుడు రోడ్డు పక్కన లేదా పైన ఉండే బోర్డులను గమ…

South Korea: కొరియాలో ఉద్యోగం అంత కష్టమా? ‘భారతీయులెవరూ ఇక్కడికి రావద్దు’ అంటూ యువతి వైరల్ వీడియో!

South Korea: కొరియాలో ఉద్యోగం అంత కష్టమా? ‘భారతీయులెవరూ ఇక్కడికి రావద్దు’ అంటూ యువతి వైరల్ వీడియో!

South Korea: దక్షిణ కొరియాలో ఉద్యోగం చేయాలనుకుంటున్న భారతీయులను హెచ్చరిస్తూ ఓ యువతి పోస్ట్ చేసిన వీడ…