LIVE
Defence: రూ.1.78 లక్షల కోట్లకు చేరిన భారత రక్షణ ఉత్పత్తి.. కొత్త రికార్డు నమోదు!  •  LPG: సామాన్యుడికి తప్పని గ్యాస్ మంట.. కేంద్ర ప్రభుత్వం సంచలనం.. వారికి బిగ్ షాక్..!!  •  NEET: నీట్ రీ-ఎగ్జామ్ ముందు అప్రమత్తమైన ఎన్టీఏ.. సోషల్ మీడియాలో మోసగాళ్లపై నిఘా!  •  ROB: నిడమర్రు ఆర్‌ఓబీ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన మంత్రులు నారా లోకేష్, పెమ్మసాని చంద్రశేఖర్!  •  Modi: జీ7 వేదికగా మోదీ-ట్రంప్ కీలక భేటీ.. వరుస ద్వైపాక్షిక భేటీలు!  •  Donald Trump: ఇరాన్ ముందు మోకరిల్లిన ట్రంప్.. అమెరికా, ఇరాన్ మధ్య 60 రోజుల కాల్పుల విరమణ ఒప్పందం!  •  Indian Railways: ప్రయాణికులకు అలర్ట్... జూన్ 20 నుండి ఆ ఎక్స్‌ప్రెస్ సమయాల్లో మార్పు!  •  Gold Rate Today: పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. వరుసగా రెండో రోజు తగ్గిన బంగారం ధరలు! తాజా రేట్లు ఇవే!  •  Pakistan: హాలిడే ట్రిప్‌లో ఊహించని విషాదం.. పాకిస్థాన్‌లో ఘోరం.. 9 ఏళ్ల చిన్నారిని కాల్చి చంపిన పోలీసులు!  •  India: భారత్ దెబ్బకు టర్కీ విమానయాన సంస్థ విలవిల.. రూ. 4,200 కోట్ల నష్టంతో రాత్రికి రాత్రే.. 10,000 మంది ఉద్యోగులను.!  • 
Lifestyle

Mango Roti Pachadi: నోరూరించే మామిడికాయ రోటి పచ్చడి..వేడి అన్నంలో నెయ్యి వేస్తే స్వర్గమే..!!

Mango Pachadi: తక్కువ పులుపు ఉండే తోతాపురి (కలెక్టర్) మామిడికాయతో నోరూరించే రోటి పచ్చడి తయారీ విధానం అన్నంలోకి ఎంతో రుచిగా ఉండేలా ఈ పచ్చడిని సింపుల్ టిప్స్‌తో ఎలా చేసుకోవాలో తెలుసుకోండి.

AndhraPravasi News Desk 2 min read
Mango Roti Pachadi: నోరూరించే మామిడికాయ రోటి పచ్చడి..వేడి అన్నంలో నెయ్యి వేస్తే స్వర్గమే..!!

Mango Roti Pachadi: మామిడికాయ అనగానే మనకు ముందుగా గుర్తొచ్చేది ఆ పులుపు, పళ్ళు కిరకిరలాడే ఆ అనుభవం. కాస్త ఉప్పు, కారం వేసుకొని మామిడికాయ ముక్కలను నంచుకొని తింటుంటే ఆ రుచే వేరండోయ్! ఎండలు భగభగ మండుతున్నాయి, మామిడికాయల సీజన్ కూడా వచ్చేసింది. ఎప్పుడూ తినేలా కాకుండా, అప్పుడప్పుడు ఇలా మామిడికాయతో రోటి పచ్చడి చేసుకొని, వేడి వేడి అన్నంలో కాస్త నెయ్యి దండించి తింటే.. "ఈ జన్మమే రుచి చూడడానికి వేదిక కదరా.. అన్న పాట తప్పకుండా గుర్తొస్తుందండోయ్.. మరి ఇంకెందుకు ఆలస్యం, పచ్చడి తయారీ మొదలుపెట్టేద్దామా!

కావలసిన పదార్థాలు:
మామిడికాయలు: 2 (పెద్ద సైజు తోతాపురి కాయలు)
ఎండుమిర్చి: 10 నుండి 16 (మీ కారానికి తగినట్లుగా)
ఆవాలు: ఒక స్పూన్
మినపప్పు: ఒక స్పూన్
జీలకర్ర: అర స్పూన్
పసుపు: ఒక స్పూన్
ఉప్పు: రుచికి సరిపడా
నూనె: తాలింపునకు సరిపడినంత

తయారీ విధానం:

ముందుగా మరీ పుల్లగా ఉండని తోతాపురి (కలెక్టర్ కాయ) కాయలను తీసుకొని శుభ్రంగా కడిగి, పైన చెక్కు తీయాలి. ఆపై వీటిని చిన్న చిన్న ముక్కలుగా తరిగి పక్కన పెట్టుకోవాలి. ఈ కాయలో ఉండే ప్రత్యేకత ఏమిటంటే, ఇది మరీ విపరీతమైన పులుపు ఉండదు. కాబట్టి మనం వేసే ఉప్పు, కారం దీనికి చక్కగా సరిపోతాయి.

స్టవ్ వెలిగించి మూకుడు పెట్టుకొని, కేవలం ఒక స్పూన్ నూనె వేయండి. నూనె కాగాక ఎండుమిర్చి, జీలకర్ర, వేసి వెంటనే దించేయాలి. దించిన వేడి మీదనే చిటికెడు పసుపు వేస్తే పచ్చడికి మంచి రంగు వస్తుంది. వేయించిన ఎండుమిర్చి రోట్లో వేసి మెత్తగా దంచుకోవాలి. మిక్సీ కంటే రోట్లో నూరితేనే ఆ రుచి అద్భుతంగా ఉంటుంది. మెత్తగా అయ్యాక, తరిగిన మామిడికాయ ముక్కలు, తగినంత ఉప్పు వేసి రుబ్బాలి. ముక్కల్ని మరీ మెత్తగా పేస్ట్‌లా చేయకుండా, అక్కడక్కడా చిన్న చిన్న పలుకులు తగులుతుంటేనే పచ్చడి తింటున్నప్పుడు బాగుంటుంది.

తయారైన పచ్చడిని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. దీనికి మళ్లీ తాలింపు వేస్తే ఆ రుచి రెట్టింపు అవుతుంది. స్టవ్ వెలిగించి పెనంలో తగినంత నూనె వేసి ఆవాలు, జీలకర్ర , శనగపప్పు, చిటపటలాడించాలి ఎండుమిర్చి చేర్చి ఎర్రగా వేయించాలి. పప్పులు వేగాక కరివేపాకు వేసి పోపు పెట్టుకోవాలి. ఆ పోపులో మనం నూరుకున్న పచ్చడిని వేసి కలిపేయాలి. ఆ వాసనకే వంటిల్లు మొత్తం గుమగుమలాడిపోతుంది.

ఈ పచ్చడికి తడి తగలకుండా జాగ్రత్తపడితే  5 రోజుల పాటు నిల్వ ఉంటుంది. ఇది కేవలం అన్నంలోకే కాకుండా, రాగి సంకటి, కొర్ర అన్నం వంటి సిరిధాన్యాల వంటకాల్లోకి కూడా ఎంతో అద్భుతంగా ఉంటుంది. పిల్లలకు ఇలాంటి రుచికరమైన పచ్చళ్లు అలవాటు చేస్తే ఆకలి పెరగడమే కాకుండా, వారు అన్నం ఇష్టంగా తింటారు. సంవత్సరానికి ఒకసారి వచ్చే ఈ సీజన్‌లో ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి.. ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే!

Be the first to react

More Coverage

Highway Signboards: మీరు ఎప్పుడైనా గమనించారా? రోడ్డు పక్కన ఉండే ఆకుపచ్చ బోర్డుల వెనుక ఇంత పెద్ద సైన్స్ ఉందా? తెలిస్తే అబ్బా అంటారు!

Highway Signboards: మీరు ఎప్పుడైనా గమనించారా? రోడ్డు పక్కన ఉండే ఆకుపచ్చ బోర్డుల వెనుక ఇంత పెద్ద సైన్స్ ఉందా? తెలిస్తే అబ్బా అంటారు!

Highway Signboards: మీరు ఎప్పుడైనా హైవేలపై ప్రయాణించినప్పుడు రోడ్డు పక్కన లేదా పైన ఉండే బోర్డులను గమ…

South Korea: కొరియాలో ఉద్యోగం అంత కష్టమా? ‘భారతీయులెవరూ ఇక్కడికి రావద్దు’ అంటూ యువతి వైరల్ వీడియో!

South Korea: కొరియాలో ఉద్యోగం అంత కష్టమా? ‘భారతీయులెవరూ ఇక్కడికి రావద్దు’ అంటూ యువతి వైరల్ వీడియో!

South Korea: దక్షిణ కొరియాలో ఉద్యోగం చేయాలనుకుంటున్న భారతీయులను హెచ్చరిస్తూ ఓ యువతి పోస్ట్ చేసిన వీడ…