LIVE
Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!  •  Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!  •  Modi: ఫ్రాన్స్, స్లోవేకియా పర్యటనకు ప్రధాని మోదీ.. యూరప్ దేశాలతో బంధాల బలోపేతమే లక్ష్యం!  •  Promotions: దేవాదాయ శాఖలో భారీ ప్రమోషన్లు.. గ్రేడ్-1 ఆఫీసర్లుగా 26 మంది ఈఓలకు పదోన్నతులు!  •  TTD Updates: శ్రీవారి భక్తులకు అలర్ట్.. సెప్టెంబర్ నెల తిరుమల దర్శన టికెట్ల కోటా షెడ్యూల్ విడుదల!  •  EPFO: పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్... 8.25 శాతం వడ్డీ డబ్బులు అకౌంట్లలోకి వచ్చేది అప్పుడే!  •  Allu Arjun: రెండు దశాబ్దాల తర్వాత అదే క్రేజ్... 'హ్యాపీ' రీ-రిలీజ్ కలెక్షన్ల సంచలనం!  •  Srisailam: శ్రీశైల క్షేత్రంలో రికార్డు స్థాయి ఆర్థిక ప్రగతి.. బ్యాంకుల్లో వందల కోట్ల భారీ ఫిక్స్‌డ్ డిపాజిట్లు!  •  Google Maps: గూగుల్ మ్యాప్స్ క్రేజీ అప్‌డేట్.. ఇకపై పెట్రోల్, డీజిల్ ఖర్చులు మిగిలడం ఖాయం!  •  AP CRDA: 0.4 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో రూపుదిద్దుకుంటున్న నీరుకొండ రిజర్వాయర్...  • 
AndhraPravasi
AndhraPravasi
Latest Telugu and AP community news
⚡ BREAKING
Lifestyle

Railway New Update 2026: రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. సెకన్లలోనే టికెట్!

Railway New Update 2026: రైల్వే ప్రయాణికుల కోసం సరికొత్త సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. కాచిగూడ రైల్వే స్టేషన్‌లో పోర్టబుల్ టికెట్ వెండింగ్ మెషీన్ల ద్వారా సెకన్లలోనే అన్‌రిజర్వ్‌డ్, ప్లాట్‌ఫామ్ టికెట్లు పొందవచ్చు. క్యూ లైన్ల రద్దీని తగ్గించే ఈ కొత్త టెక్నాలజీ వివరాలు

AndhraPravasi News Desk 2 min read
Railway New Update 2026: రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. సెకన్లలోనే టికెట్!

Railway New Update 2026:  రైలు ప్రయాణం అంటేనే ముందుగా గుర్తొచ్చేది టికెట్ కౌంటర్ల దగ్గర ఉండే భారీ క్యూ లైన్లు. జనరల్ టికెట్ తీసుకోవాలంటే గంటల తరబడి వేచి చూడాల్సి వచ్చేది. కొన్నిసార్లు ఈ రద్దీ వల్ల రైలు మిస్ అయిపోయిన సందర్భాలూ ఎన్నో  ఉంటాయి. అయితే, ఇలాంటి ఇబ్బందులకు చెక్ పెట్టేందుకు దక్షిణ మధ్య రైల్వే ఒక సరికొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. టెక్నాలజీని సామాన్యుడికి చేరువ చేస్తూ, కేవలం సెకన్ల వ్యవధిలోనే చేతికి టికెట్ వచ్చేలా 'పోర్టబుల్ టికెట్ వెండింగ్ మెషీన్లను' అందుబాటులోకి తెచ్చింది.

హైదరాబాద్ డివిజన్ పరిధిలోని కాచిగూడ రైల్వే స్టేషన్‌లో ఈ పైలట్ ప్రాజెక్టును అధికారులు ఘనంగా ప్రారంభించారు. సాధారణంగా స్టేషన్లలో ఉండే పెద్ద పెద్ద వెండింగ్ మెషీన్లను వాడటం తెలియక చాలామంది ఇబ్బంది పడుతుంటారు. కానీ, ఇప్పుడు ప్రవేశపెట్టిన ఈ పోర్టబుల్ మెషీన్లు మొబైల్ ఫోన్ పరిమాణంలో ఉండి, ఎంతో సౌకర్యవంతంగా ఉంటాయి. రైల్వే సిబ్బంది (TTE) వీటిని చేతిలో పట్టుకుని స్టేషన్ ఎంట్రీ పాయింట్ల వద్ద, రద్దీగా ఉండే ప్రాంతాల్లో అందుబాటులో ఉంటారు. ప్రయాణికులు వారిని సంప్రదించి తమకు కావాల్సిన టికెట్‌ను వెంటనే పొందవచ్చు.

ఈ మెషీన్ల పనితీరు ఎంతో వేగంగా ఉంటుంది థర్మల్ ప్రింటింగ్ టెక్నాలజీ సహాయంతో సెకనుకు 80 ఎంఎం వేగంతో ఇది టికెట్‌ను ప్రింట్ చేస్తుంది. అంటే మీరు డబ్బులు చెల్లించిన మరుక్షణమే టికెట్ మీ చేతిలో ఉంటుందన్నమాట. కేవలం అన్-రిజర్వ్‌డ్ టికెట్లు మాత్రమే కాకుండా, ప్లాట్‌ఫామ్ టికెట్లు, ఎంఎంటీఎస్  టికెట్లను కూడా దీని ద్వారా జారీ చేస్తారు. దీనివల్ల కౌంటర్ల వద్ద రద్దీ తగ్గడమే కాకుండా, సమయం కూడా భారీగా ఆదా అవుతుందని అధికారులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించేలా ఈ మెషీన్లలో డిజిటల్ పేమెంట్ ఆప్షన్లను కూడా చేర్చారు. యూపీఐ (UPI) ద్వారా స్కాన్ చేసి లేదా నగదు ఇచ్చి కూడా టికెట్ తీసుకోవచ్చు. ప్రస్తుతం కాచిగూడ స్టేషన్ మీదుగా రోజుకు సుమారు 55 వేల మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుంటారు. ఇంతటి భారీ రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రవేశపెట్టిన ఈ విధానానికి ప్రయాణికుల నుంచి మంచి స్పందన వస్తోంది. ముఖ్యంగా అత్యవసరంగా ప్రయాణం చేసేవారికి, స్మార్ట్ ఫోన్ వాడటం రాని వృద్ధులకు ఇది ఎంతో ఊరటనిస్తోంది.

కాచిగూడలో లభించిన స్పందనను బట్టి, అతి త్వరలోనే సికింద్రాబాద్, నాంపల్లి వంటి ప్రధాన స్టేషన్లతో పాటు డివిజన్‌లోని అన్ని చిన్న, పెద్ద స్టేషన్లలో ఈ పోర్టబుల్ మెషీన్లను అందుబాటులోకి తీసుకురావాలని రైల్వే శాఖ ప్లాన్ చేస్తోంది. ఈ టెక్నాలజీ పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే, టికెట్ కోసం క్యూలో నిలబడటం అనేది పాత జ్ఞాపకంగా మిగిలిపోనుంది. ప్రయాణికుల సౌకర్యార్థం రైల్వే శాఖ తీసుకున్న ఈ నిర్ణయంపై సర్వత్రా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి.

Be the first to react

More Coverage

Highway Signboards: మీరు ఎప్పుడైనా గమనించారా? రోడ్డు పక్కన ఉండే ఆకుపచ్చ బోర్డుల వెనుక ఇంత పెద్ద సైన్స్ ఉందా? తెలిస్తే అబ్బా అంటారు!

Highway Signboards: మీరు ఎప్పుడైనా గమనించారా? రోడ్డు పక్కన ఉండే ఆకుపచ్చ బోర్డుల వెనుక ఇంత పెద్ద సైన్స్ ఉందా? తెలిస్తే అబ్బా అంటారు!

Highway Signboards: మీరు ఎప్పుడైనా హైవేలపై ప్రయాణించినప్పుడు రోడ్డు పక్కన లేదా పైన ఉండే బోర్డులను గమ…

South Korea: కొరియాలో ఉద్యోగం అంత కష్టమా? ‘భారతీయులెవరూ ఇక్కడికి రావద్దు’ అంటూ యువతి వైరల్ వీడియో!

South Korea: కొరియాలో ఉద్యోగం అంత కష్టమా? ‘భారతీయులెవరూ ఇక్కడికి రావద్దు’ అంటూ యువతి వైరల్ వీడియో!

South Korea: దక్షిణ కొరియాలో ఉద్యోగం చేయాలనుకుంటున్న భారతీయులను హెచ్చరిస్తూ ఓ యువతి పోస్ట్ చేసిన వీడ…