LIVE
Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!  •  Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!  •  Modi: ఫ్రాన్స్, స్లోవేకియా పర్యటనకు ప్రధాని మోదీ.. యూరప్ దేశాలతో బంధాల బలోపేతమే లక్ష్యం!  •  Promotions: దేవాదాయ శాఖలో భారీ ప్రమోషన్లు.. గ్రేడ్-1 ఆఫీసర్లుగా 26 మంది ఈఓలకు పదోన్నతులు!  •  TTD Updates: శ్రీవారి భక్తులకు అలర్ట్.. సెప్టెంబర్ నెల తిరుమల దర్శన టికెట్ల కోటా షెడ్యూల్ విడుదల!  •  EPFO: పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్... 8.25 శాతం వడ్డీ డబ్బులు అకౌంట్లలోకి వచ్చేది అప్పుడే!  •  Allu Arjun: రెండు దశాబ్దాల తర్వాత అదే క్రేజ్... 'హ్యాపీ' రీ-రిలీజ్ కలెక్షన్ల సంచలనం!  •  Srisailam: శ్రీశైల క్షేత్రంలో రికార్డు స్థాయి ఆర్థిక ప్రగతి.. బ్యాంకుల్లో వందల కోట్ల భారీ ఫిక్స్‌డ్ డిపాజిట్లు!  •  Google Maps: గూగుల్ మ్యాప్స్ క్రేజీ అప్‌డేట్.. ఇకపై పెట్రోల్, డీజిల్ ఖర్చులు మిగిలడం ఖాయం!  •  AP CRDA: 0.4 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో రూపుదిద్దుకుంటున్న నీరుకొండ రిజర్వాయర్...  • 
AndhraPravasi
AndhraPravasi
Latest Telugu and AP community news
⚡ BREAKING
Lifestyle

Tirumala: తిరుమలలో భక్తుల భారీ రద్దీ.. సర్వదర్శనానికి 24 గంటల సమయం!

Tirumala: శ్రీవారి దర్శనం కోసం తిరుమలకు భక్తులు భారీగా తరలివస్తుండటంతో ఆలయ పరిసరాలు భక్తజన సందోహంతో కిక్కిరిసిపోయాయి.

AndhraPravasi News Desk 1 min read
Tirumala: తిరుమలలో భక్తుల భారీ రద్దీ.. సర్వదర్శనానికి 24 గంటల సమయం!

ఉచిత దర్శనం కోసం శిలాతోరణం వరకు లైన్ లో వేచి ఉన్న భక్తులు..

సర్వ దర్శనమ్ టోకెన్ పొందిన భక్తులకు 6 నుండి 8 గంటల సమయం..

తిరుమల: శ్రీవారి దర్శనం కోసం తిరుమలకు భక్తులు భారీగా తరలివస్తుండటంతో ఆలయ పరిసరాలు భక్తజన సందోహంతో కిక్కిరిసిపోయాయి. వేసవి సెలవులు, వారాంతం నేపథ్యంలో భక్తుల రద్దీ మరింత పెరిగినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు.

ఉచిత సర్వదర్శనం కోసం వచ్చిన భక్తులతో అన్ని కంపార్ట్మెంట్లు పూర్తిగా నిండిపోయాయి. భక్తుల క్యూలైన్ శిలాతోరణం వరకు కొనసాగుతోంది. ఉదయం 8 గంటల తర్వాత సర్వదర్శనం కోసం వెళ్లే భక్తులకు దాదాపు 24 గంటల సమయం పడుతున్నట్లు అధికారులు వెల్లడించారు.

రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం (శీఘ్రదర్శనం) కోసం కూడా భక్తులు భారీగా వేచి ఉండాల్సి వస్తోంది. ఈ దర్శనానికి సుమారు 4 నుంచి 5 గంటల సమయం పడుతోంది. అలాగే సర్వదర్శనం టోకెన్ పొందిన భక్తులకు 6 నుంచి 8 గంటల నిరీక్షణ కొనసాగుతోంది.

ఇక శ్రీవారిని దర్శించుకునేందుకు రోజురోజుకూ పెరుగుతున్న భక్తుల సంఖ్య తిరుమలలో ఆధ్యాత్మిక వాతావరణాన్ని మరింత పెంచుతోంది. నిన్న ఒక్కరోజే 75,688 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. వారిలో 38,264 మంది భక్తులు తలనీలాలు సమర్పించి తమ మొక్కులు తీర్చుకున్నారు.

అలాగే నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.54 కోట్లుగా నమోదైంది. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని తిరుమలలో అన్ని ఏర్పాట్లు సమర్థంగా కొనసాగుతున్నాయని టీటీడీ అధికారులు తెలిపారు.

Be the first to react

More Coverage

Highway Signboards: మీరు ఎప్పుడైనా గమనించారా? రోడ్డు పక్కన ఉండే ఆకుపచ్చ బోర్డుల వెనుక ఇంత పెద్ద సైన్స్ ఉందా? తెలిస్తే అబ్బా అంటారు!

Highway Signboards: మీరు ఎప్పుడైనా గమనించారా? రోడ్డు పక్కన ఉండే ఆకుపచ్చ బోర్డుల వెనుక ఇంత పెద్ద సైన్స్ ఉందా? తెలిస్తే అబ్బా అంటారు!

Highway Signboards: మీరు ఎప్పుడైనా హైవేలపై ప్రయాణించినప్పుడు రోడ్డు పక్కన లేదా పైన ఉండే బోర్డులను గమ…

South Korea: కొరియాలో ఉద్యోగం అంత కష్టమా? ‘భారతీయులెవరూ ఇక్కడికి రావద్దు’ అంటూ యువతి వైరల్ వీడియో!

South Korea: కొరియాలో ఉద్యోగం అంత కష్టమా? ‘భారతీయులెవరూ ఇక్కడికి రావద్దు’ అంటూ యువతి వైరల్ వీడియో!

South Korea: దక్షిణ కొరియాలో ఉద్యోగం చేయాలనుకుంటున్న భారతీయులను హెచ్చరిస్తూ ఓ యువతి పోస్ట్ చేసిన వీడ…