LIVE
Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!  •  Modi: ఫ్రాన్స్, స్లోవేకియా పర్యటనకు ప్రధాని మోదీ.. యూరప్ దేశాలతో బంధాల బలోపేతమే లక్ష్యం!  •  TTD Updates: శ్రీవారి భక్తులకు అలర్ట్.. సెప్టెంబర్ నెల తిరుమల దర్శన టికెట్ల కోటా షెడ్యూల్ విడుదల!  •  EPFO: పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్... 8.25 శాతం వడ్డీ డబ్బులు అకౌంట్లలోకి వచ్చేది అప్పుడే!  •  Allu Arjun: రెండు దశాబ్దాల తర్వాత అదే క్రేజ్... 'హ్యాపీ' రీ-రిలీజ్ కలెక్షన్ల సంచలనం!  •  Srisailam: శ్రీశైల క్షేత్రంలో రికార్డు స్థాయి ఆర్థిక ప్రగతి.. బ్యాంకుల్లో వందల కోట్ల భారీ ఫిక్స్‌డ్ డిపాజిట్లు!  •  Google Maps: గూగుల్ మ్యాప్స్ క్రేజీ అప్‌డేట్.. ఇకపై పెట్రోల్, డీజిల్ ఖర్చులు మిగిలడం ఖాయం!  •  AP CRDA: 0.4 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో రూపుదిద్దుకుంటున్న నీరుకొండ రిజర్వాయర్...  •  Vishaka: ప్రభుత్వ స్కూల్‌గా మారిన విశాఖ విమల విద్యాలయం.. కలెక్టర్, ఎమ్మెల్యే పల్లా చేతుల మీదుగా ప్రారంభం!  •  6G Network: భారత్‌లో 6G సంచలనం.. టెలికాం రంగం రూపురేఖలు మార్చబోతున్న కేంద్ర ప్రభుత్వ మాస్టర్ ప్లాన్!  • 
AndhraPravasi
AndhraPravasi
Latest Telugu and AP community news
⚡ BREAKING
Lifestyle

Village Style Natu Kodi Kura: నాటుకోడి కూర స్పెషల్.. ముక్క మెత్తగా, గ్రేవీ కమ్మగా రావాలంటే ఈ చిన్న చిట్కాలు పాటించండి!

Village Style Natu Kodi Kura: చిన్నప్పుడు పల్లెటూర్లలో తిన్న నాటుకోడి కూర రుచిని మిస్ అవుతున్నారా? అచ్చమైన నాటు మసాలాలతో, ముక్క మెత్తగా ఉడికేలా పాతకాలపు పద్ధతిలో నాటుకోడి కూరను ఇంట్లోనే ఎలా తయారు చేయాలో.. నోరూరించే రుచి కోసం ఈ చిట్కాలు ట్రై చేయండి..

AndhraPravasi News Desk 2 min read
Village Style Natu Kodi Kura: నాటుకోడి కూర స్పెషల్.. ముక్క మెత్తగా, గ్రేవీ కమ్మగా రావాలంటే ఈ చిన్న చిట్కాలు పాటించండి!

Village Style Natu Kodi Kura: నేటి కాలంలో రకరకాల ఫాస్ట్ ఫుడ్స్, హైబ్రిడ్ చికెన్ వెరైటీలు ఎన్ని వచ్చినా.. పల్లెటూరి నాటుకోడి కూర ఇచ్చే కిక్కే వేరు. ఆ ఘుమఘుమలు గుర్తొస్తేనే ఎవరికైనా నోరూరుతుంది. చిన్నప్పుడు అమ్మమ్మో, నాయనమ్మో కట్టెల పొయ్యి మీద వండి పెట్టిన ఆ రుచిని ఇప్పుడు సిటీ లైఫ్ లో మిస్ అవుతున్నామని చాలా మంది అనుకుంటూ ఉంటారు. అయితే, కొన్ని చిన్న చిన్న చిట్కాలు పాటిస్తే, మన ఇంట్లోనే అదే పాత కాలపు నాటుకోడి రుచిని అద్భుతంగా  చేసుకోవచ్చు. ముఖ్యంగా మసాలాలు నూరి వండటమే ఇందులోని అసలైన రహస్యం.

నాటుకోడి కూర టేస్టీగా రావాలంటే ముందుగా మసాలాల తయారీపై దృష్టి పెట్టాలి. బజార్లో దొరికే ప్యాకెట్ పొడులు కాకుండా, ధనియాలు, జీలకర్ర, మిరియాలు, లవంగాలు, యాలకులు  దాల్చిన చెక్కను దోరగా వేయించి అప్పటికప్పుడు పొడి చేసుకోవాలి. అలాగే, ఎండు కొబ్బరిని నేరుగా మంటపై కాల్చి ముక్కలు చేసి, నానబెట్టిన గసగసాలు, జీడిపప్పుతో కలిపి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఈ కొబ్బరి, గసగసాల మిశ్రమం కూరకు మంచి చిక్కదనాన్ని, అద్భుతమైన కమ్మదనాన్ని ఇస్తుంది.

కూర వండేటప్పుడు నాటుకోడి ముక్కలను పసుపు, ఉప్పుతో బాగా కడిగి సిద్ధం చేసుకోవాలి. బాణలిలో నూనె వేడి చేసి, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయే వరకు వేయించాలి. ఆపై చికెన్ ముక్కలను వేసి కనీసం పది నిమిషాల పాటు తక్కువ మంటపై మగ్గనివ్వాలి. ఇలా చేయడం వల్ల ముక్కలోని నీరు బయటకు వచ్చి, మసాలాలు బాగా పడతాయి. నాటుకోడి ఉడకడానికి సమయం పడుతుంది కాబట్టి ఓపికగా ఉడికించడం చాలా ముఖ్యం.

ఈ వంటకంలో మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే, నీళ్లు పోసేటప్పుడు ఎప్పుడూ వేడి నీటినే వాడాలి. చల్లటి నీళ్లు పోస్తే ఉడుకుతున్న నాటుకోడి ముక్క ఒక్కసారిగా బిగుసుకుపోయి గట్టిగా తయారవుతుంది. వేడి నీళ్లు పోయడం వల్ల ముక్క మెత్తగా ఉడికి, గ్రేవీ కూడా రుచిగా ఉంటుంది. మనం ముందుగా సిద్ధం చేసుకున్న గసగసాల పేస్ట్, కారం వేసి ముక్కకు పట్టేలా కలపాలి. కూర దగ్గరకు పడుతున్న సమయంలో తాజాగా నూరి పెట్టుకున్న మసాలా పొడిని చల్లితే ఆ వాసన ఇల్లంతా నిండిపోతుంది.

చివరగా కొద్దిగా కొత్తిమీర చల్లుకుని దించుకుంటే, అచ్చమైన పల్లెటూరి స్టైల్ నాటుకోడి కూర రెడీ. ఈ కూర వేడివేడి అన్నంలోకి గానీ, జొన్న రొట్టెలు లేదా రాగి సంకటితో తీసుకుంటే ఆ తృప్తి మాటల్లో చెప్పలేం. హోటల్ ఫుడ్ బోర్ కొట్టినప్పుడు, పాత రోజులను గుర్తు చేసుకుంటూ ఇలా ఇంట్లోనే స్వచ్ఛమైన మసాలాలతో వండుకుంటే ఆరోగ్యానికి ఆరోగ్యం, రుచికి రుచి దక్కుతాయి. అందుకే ఈసారి ఆదివారం మీ ఇంట్లో ఈ స్టైల్ లో నాటుకోడి కూరను ట్రై చేసి మీ చిన్ననాటి రుచులను ఆస్వాదించండి.

Be the first to react

More Coverage

Highway Signboards: మీరు ఎప్పుడైనా గమనించారా? రోడ్డు పక్కన ఉండే ఆకుపచ్చ బోర్డుల వెనుక ఇంత పెద్ద సైన్స్ ఉందా? తెలిస్తే అబ్బా అంటారు!

Highway Signboards: మీరు ఎప్పుడైనా గమనించారా? రోడ్డు పక్కన ఉండే ఆకుపచ్చ బోర్డుల వెనుక ఇంత పెద్ద సైన్స్ ఉందా? తెలిస్తే అబ్బా అంటారు!

Highway Signboards: మీరు ఎప్పుడైనా హైవేలపై ప్రయాణించినప్పుడు రోడ్డు పక్కన లేదా పైన ఉండే బోర్డులను గమ…

South Korea: కొరియాలో ఉద్యోగం అంత కష్టమా? ‘భారతీయులెవరూ ఇక్కడికి రావద్దు’ అంటూ యువతి వైరల్ వీడియో!

South Korea: కొరియాలో ఉద్యోగం అంత కష్టమా? ‘భారతీయులెవరూ ఇక్కడికి రావద్దు’ అంటూ యువతి వైరల్ వీడియో!

South Korea: దక్షిణ కొరియాలో ఉద్యోగం చేయాలనుకుంటున్న భారతీయులను హెచ్చరిస్తూ ఓ యువతి పోస్ట్ చేసిన వీడ…