LIVE
Tirupati: తిరుపతిలో హిందూ సంఘాల ఐక్యతా యాత్ర.. ధర్మ పరిరక్షణకు పిలుపు!  •  Machilipatnam: మచిలీపట్నం అభివృద్ధికి ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్ సహకారం!  •  Chandrababu: ఉపాధి హామీ నిధులను పూర్తిగా వినియోగించాలి.. జలధారపై సీఎం సమీక్ష!  •  Amaravathi: అమరావతి అభివృద్ధి కోసం భూముల సమీకరణ వేగవంతం చేయాలి.. మంత్రి నారాయణ!  •  Assam: అస్సాంలో యుద్ధ విమానం ప్రమాదం.. ఐదుగురు వాయుసేన సిబ్బంది మృతి!  •  Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!  •  Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!  •  Modi: ఫ్రాన్స్, స్లోవేకియా పర్యటనకు ప్రధాని మోదీ.. యూరప్ దేశాలతో బంధాల బలోపేతమే లక్ష్యం!  •  Health Tips: పక్షవాతానికి ముందు వచ్చే డేంజర్ బెల్స్.. మైక్రో స్ట్రోక్ పై వైద్యుల వివరణ!  •  Promotions: దేవాదాయ శాఖలో భారీ ప్రమోషన్లు.. గ్రేడ్-1 ఆఫీసర్లుగా 26 మంది ఈఓలకు పదోన్నతులు!  • 
AndhraPravasi
AndhraPravasi
Latest Telugu and AP community news
Lifestyle

Punjabi Chole Masala Recipe: అదిరిపోయే 'రెస్టారెంట్ స్టైల్' పంజాబీ చోలే మసాలా.. ఇంట్లోనే ఇలా ఈజీగా చేసేయండి!

Punjabi Chole Masala Recipe: రెస్టారెంట్ స్టైల్‌లో పంజాబీ చోలే మసాలాను ఇంట్లోనే ఎలా తయారు చేయాలో శనగలకు మంచి రంగు రావాలన్నా, గ్రేవీ చిక్కగా రుచిగా ఉండాలన్నా పాటించాల్సిన సీక్రెట్ టిప్స్ తయారీ విధానం మీకోసం..

AndhraPravasi News Desk 2 min read
Punjabi Chole Masala Recipe: అదిరిపోయే 'రెస్టారెంట్ స్టైల్' పంజాబీ చోలే మసాలా.. ఇంట్లోనే ఇలా ఈజీగా చేసేయండి!

Punjabi Chole Masala Recipe: సౌత్ ఇండియన్ ఇళ్లలో పండుగైనా, ఆదివారమైనా ఎక్కువగా వినిపించే పేరు చికెన్  మటన్ ఫిష్ రొయ్యలే అయితే ఒక్కసారైనా చోలే మసాలా ను ఇలా ట్రై చేయండి వేడివేడి పూరీతో  పులావ్‌తో ఈ కమ్మని మసాలా కూర తింటుంటే ఆ రుచే వేరు. అయితే, చాలామందికి రెస్టారెంట్‌లో వచ్చే ఆ రంగు, రుచి ఇంట్లో రావడం లేదని  ఆ చింత ఇక అక్కర్లేదు! కొన్ని చిన్న చిన్న చిట్కాలు పాటిస్తే, మీ వంటింట్లోనే అచ్చం హోటల్ రుచితో పంజాబీ చోలే మసాలాను సిద్ధం చేయవచ్చు.

సీక్రెట్ ఏంటంటే

పంజాబీ చోలే మసాలా ప్రత్యేకత అంతా ఆ గ్రేవీ రంగు  చిక్కదనంలోనే ఉంటుంది. సాధారణంగా ఇంట్లో చేసే చోలే లేత రంగులో ఉంటాయి, కానీ రెస్టారెంట్లలో అవి ముదురు రంగులో మెరుస్తూ కనిపిస్తాయి. దీని కోసం ఉడికించేటప్పుడే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే, ఉల్లిపాయలను వేయించే విధానం కూడా ఈ వంటకం రుచిని అమాంతం పెంచేస్తుంది.

తయారీకి కావాల్సిన వస్తువులు:

 శనగలు  - 1 కప్పు

ఉల్లిపాయలు - 3 (పొడవుగా కోసినవి)

 టమోటా ప్యూరీ - 2 కప్పులు

 పెరుగు - అర కప్పు

 అల్లం వెల్లుల్లి పేస్ట్ - 1 స్పూన్

 హోల్ స్పైసెస్ (యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు)

 టీ పొడి లేదా టీ బ్యాగ్స్

 మసాలాలు: కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా, చోలే మసాలా, ఉప్పు, నూనె.

తయారీ విధానం:

ముందుగా శనగలను రాత్రంతా (కనీసం 7 గంటలు) నానబెట్టుకోవాలి. కుక్కర్‌లో శనగలు వేసి, అందులో కొద్దిగా ఉప్పు, ఒక బిర్యానీ ఆకు, పెద్ద యాలకులు వేయాలి. హోటల్ స్టైల్ రంగు కోసం ఒక చిన్న తెల్లని బట్టలో కొద్దిగా టీ పొడిని మూటగట్టి అందులో వేయండి (లేదా టీ బ్యాగ్ వాడొచ్చు). అలాగే ఒకటి రెండు ఎండిన ఉసిరి ముక్కలు వేస్తే మంచి రంగు వస్తుంది. ఒక 5-6 విజిల్స్ వచ్చే వరకు మెత్తగా ఉడికించుకుని పక్కన పెట్టుకోవాలి.

 ఉల్లిపాయల ట్రిక్:

మరో పక్క బాణలిలో నూనె వేసి, పొడవుగా కోసిన ఉల్లిపాయ ముక్కలను దోరగా, ఎరుపు రంగు వచ్చే వరకు వేయించాలి. ఇవి చల్లారిన తర్వాత మిక్సీ పట్టకుండా చేత్తోనే కొంచెం నలిపి పక్కన పెట్టుకోండి. ఇదే ఈ కూరకు మంచి టెక్స్చర్‌ని ఇస్తుంది.

 గ్రేవీ తయారీ:

అదే బాణలిలో కొద్దిగా జీలకర్ర వేసి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. ఆ తర్వాత టమోటా ప్యూరీ వేసి నూనె తేలే వరకు ఉడికించాలి. ఇప్పుడు మంట తగ్గించి కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేయాలి. ఇందులోనే అర కప్పు పెరుగు కలిపితే గ్రేవీకి మంచి రిచ్‌నెస్ వస్తుంది.

మసాలా వేగిన తర్వాత, ఉడికించి పెట్టుకున్న శనగలను (టీ బ్యాగ్ తీసేసి) నీళ్లతో సహా కలపాలి. కూర చిక్కబడటం కోసం గరిటెతో కొన్ని శనగలను మెత్తగా నలపాలి. చివరగా మనం వేయించి పెట్టుకున్న ఉల్లిపాయలు, కస్తూరి మేతి, గరం మసాలా, కొద్దిగా  చల్లి రెండు నిమిషాలు ఉడికించాలి. పైన కొత్తిమీర, పచ్చిమిర్చి చీలికలతో గార్నిష్ చేస్తే నోరూరించే పంజాబీ చోలే మసాలా రెడీ..

Be the first to react

More Coverage

Highway Signboards: మీరు ఎప్పుడైనా గమనించారా? రోడ్డు పక్కన ఉండే ఆకుపచ్చ బోర్డుల వెనుక ఇంత పెద్ద సైన్స్ ఉందా? తెలిస్తే అబ్బా అంటారు!

Highway Signboards: మీరు ఎప్పుడైనా గమనించారా? రోడ్డు పక్కన ఉండే ఆకుపచ్చ బోర్డుల వెనుక ఇంత పెద్ద సైన్స్ ఉందా? తెలిస్తే అబ్బా అంటారు!

Highway Signboards: మీరు ఎప్పుడైనా హైవేలపై ప్రయాణించినప్పుడు రోడ్డు పక్కన లేదా పైన ఉండే బోర్డులను గమ…

South Korea: కొరియాలో ఉద్యోగం అంత కష్టమా? ‘భారతీయులెవరూ ఇక్కడికి రావద్దు’ అంటూ యువతి వైరల్ వీడియో!

South Korea: కొరియాలో ఉద్యోగం అంత కష్టమా? ‘భారతీయులెవరూ ఇక్కడికి రావద్దు’ అంటూ యువతి వైరల్ వీడియో!

South Korea: దక్షిణ కొరియాలో ఉద్యోగం చేయాలనుకుంటున్న భారతీయులను హెచ్చరిస్తూ ఓ యువతి పోస్ట్ చేసిన వీడ…