LIVE
Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!  •  Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!  •  Modi: ఫ్రాన్స్, స్లోవేకియా పర్యటనకు ప్రధాని మోదీ.. యూరప్ దేశాలతో బంధాల బలోపేతమే లక్ష్యం!  •  Promotions: దేవాదాయ శాఖలో భారీ ప్రమోషన్లు.. గ్రేడ్-1 ఆఫీసర్లుగా 26 మంది ఈఓలకు పదోన్నతులు!  •  TTD Updates: శ్రీవారి భక్తులకు అలర్ట్.. సెప్టెంబర్ నెల తిరుమల దర్శన టికెట్ల కోటా షెడ్యూల్ విడుదల!  •  EPFO: పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్... 8.25 శాతం వడ్డీ డబ్బులు అకౌంట్లలోకి వచ్చేది అప్పుడే!  •  Allu Arjun: రెండు దశాబ్దాల తర్వాత అదే క్రేజ్... 'హ్యాపీ' రీ-రిలీజ్ కలెక్షన్ల సంచలనం!  •  Srisailam: శ్రీశైల క్షేత్రంలో రికార్డు స్థాయి ఆర్థిక ప్రగతి.. బ్యాంకుల్లో వందల కోట్ల భారీ ఫిక్స్‌డ్ డిపాజిట్లు!  •  Google Maps: గూగుల్ మ్యాప్స్ క్రేజీ అప్‌డేట్.. ఇకపై పెట్రోల్, డీజిల్ ఖర్చులు మిగిలడం ఖాయం!  •  AP CRDA: 0.4 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో రూపుదిద్దుకుంటున్న నీరుకొండ రిజర్వాయర్...  • 
AndhraPravasi
AndhraPravasi
Latest Telugu and AP community news
⚡ BREAKING
Lifestyle

Jasmine Gardening Tips: వేసవిలో మల్లెలు విరబూయాలంటే ఈ చిన్న చిట్కాలు పాటించండి!

Jasmine Gardening Tips: మీ ఇంట్లో మల్లె మొక్కలు ఉన్నా పూలు పూయడం లేదా? వేసవికాలంలో మల్లెలు విరబూయడానికి అవసరమైన ఎరువులు ఇంటి చిట్కాలు మీ కోసమే..

AndhraPravasi News Desk 2 min read
Jasmine Gardening Tips: వేసవిలో మల్లెలు విరబూయాలంటే ఈ చిన్న చిట్కాలు పాటించండి!

Jasmine Gardening Tips: వేసవికాలం వచ్చిందంటే చాలు మన పెరట్లో మల్లెపూల సువాసనలు వెదజల్లుతుంటాయి. చాలామంది తమ ఇంట్లో మల్లె చెట్లు ఉన్నా కూడా పువ్వులు సరిగ్గా పూయడం లేదని నర్సరీల చుట్టూ తిరుగుతుంటారు. వాస్తవానికి మొక్కను తెచ్చిన కొత్తలో బాగానే పూసినా, ఆ తర్వాత మొగ్గలు రావడం తగ్గిపోతుంటుంది. కానీ కొన్ని చిన్న జాగ్రత్తలు పాటిస్తే చాలు, మీ కురుల్లో మల్లెలను మూరలు మూరలుగా అలంకరించుకోవచ్చు.

మల్లె మొక్కలకు అన్నింటికంటే ముఖ్యమైనది సూర్యరశ్మి. రోజుకు కనీసం ఐదు నుంచి ఆరు గంటల పాటు నేరుగా ఎండ తగిలే చోట మొక్కను ఉంచాలి, లేదంటే మొక్క సరిగ్గా పెరగదు. ఎండ తగలకపోతే మొగ్గలు రావడం చాలా కష్టమవుతుంది. అలాగే మొక్క చుట్టూ గాలి బాగా ఆడేలా చూడాలి. గాలి తగలకపోతే ఆకులపై తేమ చేరిపోయి ఫంగస్ లాంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది.

మొక్క బలంగా ఎదగాలంటే మనం వేసే మట్టిలో కూడా పోషకాలు ఉండాలి. కేవలం ఎర్రమట్టి మాత్రమే కాకుండా అందులో కొంచెం ఇసుక, కోకోపీట్  పశువుల ఎరువు కలిపి వాడటం మంచిది. మనం ఇంట్లో వాడేసిన టీ పొడిని బాగా కడిగి ఎండబెట్టి మొక్కలకు వేస్తే అద్భుతమైన ఎరువులా పనిచేస్తుంది. అలాగే గుడ్డు పెంకుల పొడిలో ఉండే కాల్షియం మొక్కకు మంచి బలాన్ని ఇస్తుంది.

నీరు పోసే విషయంలో కూడా కొన్ని పొరపాట్లు జరుగుతుంటాయి. మట్టి పైపొర ఆరిపోయినట్లు అనిపిస్తేనే నీరు పోయాలి, వేసవిలో రోజుకు రెండు సార్లు పోస్తే సరిపోతుంది. ముఖ్యంగా నీటిని నేరుగా మట్టిలోనే పోయాలి కానీ ఆకులపై చల్లకూడదు, అలా చేస్తే ఫంగల్ ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఉంది. ఉదయం పూట నీరు పోయడం మొక్క ఆరోగ్యానికి చాలా మంచిది.

మల్లెలు విపరీతంగా పూయాలంటే కత్తిరింపులు చాలా అవసరం. ఎండిపోయిన కొమ్మలను, పసుపు రంగులోకి మారిన ఆకులను ఎప్పటికప్పుడు తీసేయాలి. అలాగే మనం వాడే శనగపిండిని నీటిలో కలిపి రెండు రోజులు పులియబెట్టి మొక్కలకు వేస్తే మొగ్గలు బాగా వస్తాయి. పుల్లటి మజ్జిగను నీటిలో కలిపి మొక్క మొదట్లో పోస్తే ఫంగస్ సమస్య ఉండదు. ఇలాంటి చిన్న చిట్కాలు పాటిస్తే  మీ ఇంట్లో మల్లెలు విరబూస్తాయి.

Be the first to react

More Coverage

Highway Signboards: మీరు ఎప్పుడైనా గమనించారా? రోడ్డు పక్కన ఉండే ఆకుపచ్చ బోర్డుల వెనుక ఇంత పెద్ద సైన్స్ ఉందా? తెలిస్తే అబ్బా అంటారు!

Highway Signboards: మీరు ఎప్పుడైనా గమనించారా? రోడ్డు పక్కన ఉండే ఆకుపచ్చ బోర్డుల వెనుక ఇంత పెద్ద సైన్స్ ఉందా? తెలిస్తే అబ్బా అంటారు!

Highway Signboards: మీరు ఎప్పుడైనా హైవేలపై ప్రయాణించినప్పుడు రోడ్డు పక్కన లేదా పైన ఉండే బోర్డులను గమ…

South Korea: కొరియాలో ఉద్యోగం అంత కష్టమా? ‘భారతీయులెవరూ ఇక్కడికి రావద్దు’ అంటూ యువతి వైరల్ వీడియో!

South Korea: కొరియాలో ఉద్యోగం అంత కష్టమా? ‘భారతీయులెవరూ ఇక్కడికి రావద్దు’ అంటూ యువతి వైరల్ వీడియో!

South Korea: దక్షిణ కొరియాలో ఉద్యోగం చేయాలనుకుంటున్న భారతీయులను హెచ్చరిస్తూ ఓ యువతి పోస్ట్ చేసిన వీడ…