LIVE
Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!  •  Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!  •  Modi: ఫ్రాన్స్, స్లోవేకియా పర్యటనకు ప్రధాని మోదీ.. యూరప్ దేశాలతో బంధాల బలోపేతమే లక్ష్యం!  •  Promotions: దేవాదాయ శాఖలో భారీ ప్రమోషన్లు.. గ్రేడ్-1 ఆఫీసర్లుగా 26 మంది ఈఓలకు పదోన్నతులు!  •  TTD Updates: శ్రీవారి భక్తులకు అలర్ట్.. సెప్టెంబర్ నెల తిరుమల దర్శన టికెట్ల కోటా షెడ్యూల్ విడుదల!  •  EPFO: పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్... 8.25 శాతం వడ్డీ డబ్బులు అకౌంట్లలోకి వచ్చేది అప్పుడే!  •  Allu Arjun: రెండు దశాబ్దాల తర్వాత అదే క్రేజ్... 'హ్యాపీ' రీ-రిలీజ్ కలెక్షన్ల సంచలనం!  •  Srisailam: శ్రీశైల క్షేత్రంలో రికార్డు స్థాయి ఆర్థిక ప్రగతి.. బ్యాంకుల్లో వందల కోట్ల భారీ ఫిక్స్‌డ్ డిపాజిట్లు!  •  Google Maps: గూగుల్ మ్యాప్స్ క్రేజీ అప్‌డేట్.. ఇకపై పెట్రోల్, డీజిల్ ఖర్చులు మిగిలడం ఖాయం!  •  AP CRDA: 0.4 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో రూపుదిద్దుకుంటున్న నీరుకొండ రిజర్వాయర్...  • 
AndhraPravasi
AndhraPravasi
Latest Telugu and AP community news
⚡ BREAKING
Lifestyle

Summer special curd rice: పిల్లలు పెరుగన్నం తినడం లేదా? ఈ స్టైల్ దద్దోజనం చేసి పెట్టండి.. మళ్ళీ మళ్ళీ అడిగి మరీ తింటారు!

Summer special curd rice: వేసవి ఎండల నుంచి మీ పిల్లలకు ఉపశమనం కలిగించే కమ్మని దద్దోజనం! స్కూల్ నుంచి రాగానే నీరసంగా ఉండే పిల్లల కోసం, అమృతంలా కరిగిపోయే ఈ టెంపుల్ స్టైల్ దద్దోజనాన్ని ఇలా చేసి పెట్టండి. అన్నం గట్టిపడకుండా, కడుపుకి హాయినిచ్చే ఈ హెల్తీ రెసిపీ సీక్రెట్స్ మీకోసం

AndhraPravasi News Desk 2 min read
Summer special curd rice: పిల్లలు పెరుగన్నం తినడం లేదా? ఈ  స్టైల్ దద్దోజనం చేసి పెట్టండి.. మళ్ళీ మళ్ళీ అడిగి మరీ తింటారు!

Summer special curd rice: పండగలు వస్తున్నాయంటే చాలు.. ఇల్లంతా నైవేద్యాల పరిమళాలతో నిండిపోతుంది. ముఖ్యంగా ప్రసాదాల్లో దద్దోజనానికి ఉండే క్రేజే వేరు. అయితే చాలామంది ఇంట్లో చేసే దద్దోజనం కాసేపటికే గట్టిపడిపోవడం లేదా పుల్లగా అయిపోవడం జరుగుతుంటుంది. అలా కాకుండా, గుడిలో పెట్టే ప్రసాదంలా కమ్మగా, వెన్నలా మెత్తగా ఉండాలంటే ఈ చిన్న చిన్న టిప్స్ పాటిస్తే సరిపోతుంది. ఆ తయారీ విధానం ఏంటో ఇప్పుడు చూద్దాం.

కావలసిన పదార్థాలు:

బియ్యం, వెన్న (Butter), పెరుగు, పచ్చిమిర్చి, అల్లం తురుము, ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనె, పచ్చి శనగపప్పు, మినప్పప్పు, మిరియాలు, జీడిపప్పు, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు, ఇంగువ, కొత్తిమీర  ఉప్పు.

ముందుగా ఒక కప్పు బియ్యాన్ని శుభ్రంగా కడిగి ప్రెజర్ కుక్కర్‌లో వేయాలి. దీనికి మూడు కప్పుల నీళ్లు పోయాలి అన్నం మెత్తగా రావాలి కాబట్టి నీళ్లు ఎక్కువే ఉండాలి ఇందులో ఒక టేబుల్ స్పూన్ వెన్న వేసి, మూత పెట్టి మూడు విజిల్స్ రానివ్వాలి. వెన్న వేయడం వల్ల అన్నం అస్సలు గట్టిపడదు. అన్నం ఉడికాక వేడిగా ఉన్నప్పుడే గరిటతో మెత్తగా మాష్ చేసుకోవాలి. ఈ మిశ్రమం పూర్తిగా చల్లారిన తర్వాతే మూడు కప్పుల కమ్మటి పెరుగు, తగినంత ఉప్పు, సన్నగా తరిగిన పచ్చిమిర్చి, అల్లం తురుము వేసి బాగా కలుపుకోవాలి. వేడి మీద పెరుగు వేస్తే త్వరగా పులిసిపోతుంది.

స్టవ్ మీద పాన్ పెట్టి ఆవు నెయ్యి లేదా మీరు వాడుతున్న నూనె వేయాలి. నెయ్యి కాగాక శనగపప్పు, మినప్పప్పు, మిరియాలు, జీడిపప్పు వేసి దోరగా వేయించాలి. చివరగా ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు వేసి చిటపటలాడాక.. పావు చెంచా ఇంగువ వేసి స్టవ్ ఆపేయాలి. ముందుగా

తయారు చేసుకున్న ఈ తాలింపును పెరుగన్నంలో వేసి, కొద్దిగా కొత్తిమీర చల్లుకుని కలుపుకుంటే ఎంతో రుచికరమైన టెంపుల్ స్టైల్ దద్దోజనం రెడీ! ఇది సాయంత్రం వరకు కూడా అంతే తాజాగా, మృదువుగా ఉంటుంది. ఈ సమ్మర్ కి మీ పిల్లలకు ఇలా  చేసి పెట్టండి మళ్లీ మళ్లీ ఇదే రెసిపీ అడిగిమరీ చేయించుకుంటారు ఇంకెందుకు ఆలస్యం   ఒకసారి ట్రై చేయండి

Be the first to react

More Coverage

Highway Signboards: మీరు ఎప్పుడైనా గమనించారా? రోడ్డు పక్కన ఉండే ఆకుపచ్చ బోర్డుల వెనుక ఇంత పెద్ద సైన్స్ ఉందా? తెలిస్తే అబ్బా అంటారు!

Highway Signboards: మీరు ఎప్పుడైనా గమనించారా? రోడ్డు పక్కన ఉండే ఆకుపచ్చ బోర్డుల వెనుక ఇంత పెద్ద సైన్స్ ఉందా? తెలిస్తే అబ్బా అంటారు!

Highway Signboards: మీరు ఎప్పుడైనా హైవేలపై ప్రయాణించినప్పుడు రోడ్డు పక్కన లేదా పైన ఉండే బోర్డులను గమ…

South Korea: కొరియాలో ఉద్యోగం అంత కష్టమా? ‘భారతీయులెవరూ ఇక్కడికి రావద్దు’ అంటూ యువతి వైరల్ వీడియో!

South Korea: కొరియాలో ఉద్యోగం అంత కష్టమా? ‘భారతీయులెవరూ ఇక్కడికి రావద్దు’ అంటూ యువతి వైరల్ వీడియో!

South Korea: దక్షిణ కొరియాలో ఉద్యోగం చేయాలనుకుంటున్న భారతీయులను హెచ్చరిస్తూ ఓ యువతి పోస్ట్ చేసిన వీడ…