LIVE
Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!  •  Modi: ఫ్రాన్స్, స్లోవేకియా పర్యటనకు ప్రధాని మోదీ.. యూరప్ దేశాలతో బంధాల బలోపేతమే లక్ష్యం!  •  TTD Updates: శ్రీవారి భక్తులకు అలర్ట్.. సెప్టెంబర్ నెల తిరుమల దర్శన టికెట్ల కోటా షెడ్యూల్ విడుదల!  •  EPFO: పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్... 8.25 శాతం వడ్డీ డబ్బులు అకౌంట్లలోకి వచ్చేది అప్పుడే!  •  Allu Arjun: రెండు దశాబ్దాల తర్వాత అదే క్రేజ్... 'హ్యాపీ' రీ-రిలీజ్ కలెక్షన్ల సంచలనం!  •  Srisailam: శ్రీశైల క్షేత్రంలో రికార్డు స్థాయి ఆర్థిక ప్రగతి.. బ్యాంకుల్లో వందల కోట్ల భారీ ఫిక్స్‌డ్ డిపాజిట్లు!  •  Google Maps: గూగుల్ మ్యాప్స్ క్రేజీ అప్‌డేట్.. ఇకపై పెట్రోల్, డీజిల్ ఖర్చులు మిగిలడం ఖాయం!  •  AP CRDA: 0.4 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో రూపుదిద్దుకుంటున్న నీరుకొండ రిజర్వాయర్...  •  Vishaka: ప్రభుత్వ స్కూల్‌గా మారిన విశాఖ విమల విద్యాలయం.. కలెక్టర్, ఎమ్మెల్యే పల్లా చేతుల మీదుగా ప్రారంభం!  •  6G Network: భారత్‌లో 6G సంచలనం.. టెలికాం రంగం రూపురేఖలు మార్చబోతున్న కేంద్ర ప్రభుత్వ మాస్టర్ ప్లాన్!  • 
AndhraPravasi
AndhraPravasi
Latest Telugu and AP community news
⚡ BREAKING
Lifestyle

Egg Masala Recipe: నోరూరించే డాబా స్టైల్ పెప్పర్ ఎగ్ మసాలా.. ఇలా చేస్తే గిన్నె ఊడ్చాల్సిందే!

Egg Masala Recipe: డాబా స్టైల్ పెప్పర్ ఎగ్ మసాలా కర్రీ ఒక్కసారి రుచి చూశారంటే వదిలిపెట్టరు! అతి తక్కువ మసాలాలతో. బిర్యానీ, చపాతీ, రైస్‌లోకి పర్ఫెక్ట్ కాంబినేషన్.

AndhraPravasi News Desk 2 min read
Egg Masala Recipe: నోరూరించే డాబా స్టైల్ పెప్పర్ ఎగ్ మసాలా.. ఇలా చేస్తే గిన్నె ఊడ్చాల్సిందే!

Egg Masala Recipe: కోడిగుడ్డు కూర అంటే ఎప్పుడూ ఒకేలా కాకుండా, కాస్త వెరైటీగా డాబా స్టైల్‌లో ఉండాలంటే ఈ పెప్పర్ ఎగ్ మసాలా ది బెస్ట్ ఆప్షన్. ఇది చపాతీ, బిర్యానీ లేదా వేడి అన్నం.. దేనిలోకైనా అదిరిపోతుంది. అసలు ఎక్కువ గరం మసాలాలు వాడకుండానే, ఇంట్లో ఉండే మిరియాలు, సోంపు వంటి దినుసులతో ఈ కర్రీని ఎంతో టేస్టీగా చేసుకోవచ్చు. వంట రాని వారు కూడా ఈజీగా చేసేలా ఉండే ఈ రెసిపీ టెక్స్చర్ చూస్తుంటేనే మీకు అర్థమైపోతుంది, ఇది ఎంత రుచిగా ఉంటుందో. ముక్క విరగకుండా, మసాలా లోపలి దాకా వెళ్లి భలే స్పైసీగా ఉంటుంది.

ముందుగా ఎగ్స్ ఉడకబెట్టేటప్పుడు పెంకు ఊడి రాకపోతే చాలా చిరాకు వస్తుంది కదా, దానికి ఒక చిన్న టెక్నిక్ ఫాలో అవ్వాలి. ఎప్పుడూ ఫ్రిజ్ నుంచి తీసిన వెంటనే గుడ్లను ఉడకబెట్టకూడదు, అవి రూమ్ టెంపరేచర్‌లో ఉండాలి. మరుగుతున్న నీళ్లలో కొంచెం ఉప్పు, ఒక నిమ్మచెక్క రసాన్ని తొక్కతో సహా వేస్తే, ఆ పెంకు కింద ఉండే పొర తెల్లసొనకి అంటుకోకుండా ఈజీగా ఊడి వచ్చేస్తుంది. కేవలం పది నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద ఉడికించి, వెంటనే చల్లటి నీళ్లలో వేసి పెంకు తీసేసి, గుడ్లను సగానికి కట్ చేసి పక్కన పెట్టుకోవాలి.

ఈ కర్రీకి అసలైన రుచి మనం చేసుకునే మిరియాల పొడిలోనే ఉంది. మిక్సీ జార్‌లో మిరియాలు, సోంపు, ధనియాలు, జీలకర్ర వేసి మెత్తగా పొడి చేసుకోవాలి. అలాగే గ్రేవీ కోసం టమాటాలు, పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర, జీడిపప్పు, పెరుగు వేసి మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక పాన్‌లో కొంచెం బటర్ వేసి, కట్ చేసిన గుడ్లను బోర్లించి పెట్టి, వాటిపై కొద్దిగా పసుపు, కారం, ఉప్పు, మనం కొట్టుకున్న మసాలా పొడి, కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర వేసి రెండు వైపులా ఎర్రగా రోస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి.

 కూర కోసం కడాయిలో నూనె వేసి, ఉల్లిపాయ ముక్కలను గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా వేయించాలి. ఉల్లిపాయలు ఎంత బాగా వేగితే గ్రేవీకి అంత చిక్కదనం వస్తుంది. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయాక, మనం గ్రైండ్ చేసుకున్న టమాటా-పెరుగు పేస్ట్ కూడా వేసి నూనె పైకి తేలే వరకు వేయించాలి. ఇందులో పసుపు, ఉప్పు, గరం మసాలా  మిగిలిన మిరియాల పొడి వేసి కలిపి, తగినన్ని నీళ్లు పోసి ఐదు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద గ్రేవీని దగ్గర పడనివ్వాలి.

గ్రేవీ ఉడుకుతున్నప్పుడు వేయించి పెట్టుకున్న కోడిగుడ్లను అందులో వేసి, పైన కొద్దిగా కసూరి మేతి, పచ్చిమిర్చి చీలికలు, కొత్తిమీర చల్లుకోవాలి. గుడ్లు వేసిన తర్వాత మరీ ఎక్కువ సేపు ఉడికించాల్సిన పనిలేదు, జస్ట్ రెండు నిమిషాలు ఉంచి స్టవ్ ఆపేస్తే చాలు. గుడ్లకు మసాలా అంతా పట్టి, భలే రుచిగా తయారవుతుంది. అంతే, ఎంతో స్పెషల్‌గా ఉండే డాబా స్టైల్ పెప్పర్ ఎగ్ మసాలా రెడీ అయిపోయినట్లే. ఈ సండే మీ ఇంట్లో ఇది తప్పకుండా ట్రై చేయండి..

Be the first to react

More Coverage

Highway Signboards: మీరు ఎప్పుడైనా గమనించారా? రోడ్డు పక్కన ఉండే ఆకుపచ్చ బోర్డుల వెనుక ఇంత పెద్ద సైన్స్ ఉందా? తెలిస్తే అబ్బా అంటారు!

Highway Signboards: మీరు ఎప్పుడైనా గమనించారా? రోడ్డు పక్కన ఉండే ఆకుపచ్చ బోర్డుల వెనుక ఇంత పెద్ద సైన్స్ ఉందా? తెలిస్తే అబ్బా అంటారు!

Highway Signboards: మీరు ఎప్పుడైనా హైవేలపై ప్రయాణించినప్పుడు రోడ్డు పక్కన లేదా పైన ఉండే బోర్డులను గమ…

South Korea: కొరియాలో ఉద్యోగం అంత కష్టమా? ‘భారతీయులెవరూ ఇక్కడికి రావద్దు’ అంటూ యువతి వైరల్ వీడియో!

South Korea: కొరియాలో ఉద్యోగం అంత కష్టమా? ‘భారతీయులెవరూ ఇక్కడికి రావద్దు’ అంటూ యువతి వైరల్ వీడియో!

South Korea: దక్షిణ కొరియాలో ఉద్యోగం చేయాలనుకుంటున్న భారతీయులను హెచ్చరిస్తూ ఓ యువతి పోస్ట్ చేసిన వీడ…