LIVE
Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!  •  Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!  •  Modi: ఫ్రాన్స్, స్లోవేకియా పర్యటనకు ప్రధాని మోదీ.. యూరప్ దేశాలతో బంధాల బలోపేతమే లక్ష్యం!  •  Promotions: దేవాదాయ శాఖలో భారీ ప్రమోషన్లు.. గ్రేడ్-1 ఆఫీసర్లుగా 26 మంది ఈఓలకు పదోన్నతులు!  •  TTD Updates: శ్రీవారి భక్తులకు అలర్ట్.. సెప్టెంబర్ నెల తిరుమల దర్శన టికెట్ల కోటా షెడ్యూల్ విడుదల!  •  EPFO: పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్... 8.25 శాతం వడ్డీ డబ్బులు అకౌంట్లలోకి వచ్చేది అప్పుడే!  •  Allu Arjun: రెండు దశాబ్దాల తర్వాత అదే క్రేజ్... 'హ్యాపీ' రీ-రిలీజ్ కలెక్షన్ల సంచలనం!  •  Srisailam: శ్రీశైల క్షేత్రంలో రికార్డు స్థాయి ఆర్థిక ప్రగతి.. బ్యాంకుల్లో వందల కోట్ల భారీ ఫిక్స్‌డ్ డిపాజిట్లు!  •  Google Maps: గూగుల్ మ్యాప్స్ క్రేజీ అప్‌డేట్.. ఇకపై పెట్రోల్, డీజిల్ ఖర్చులు మిగిలడం ఖాయం!  •  AP CRDA: 0.4 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో రూపుదిద్దుకుంటున్న నీరుకొండ రిజర్వాయర్...  • 
AndhraPravasi
AndhraPravasi
Latest Telugu and AP community news
⚡ BREAKING
Lifestyle

Tirumala: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. సర్వదర్శనానికి 8 గంటల నిరీక్షణ!

Tirumala: తిరుమల శ్రీవారి దర్శనం కోసం భక్తుల రద్దీ కొనసాగుతోంది. వేసవి సెలవులు, శుభకార్యాల కాలం నేపథ్యంలో దేశం నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తిరుమలకు చేరుకుంటున్నారు. ఆలయ పరిసరాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి.

AndhraPravasi News Desk 1 min read
Tirumala: తిరుమలలో కొనసాగుతున్న  భక్తుల రద్దీ.. సర్వదర్శనానికి 8 గంటల నిరీక్షణ!

ఉచిత దర్శనం కోసం 22 కంపార్ట్మెంట్ల లో వేచి ఉన్న భక్తులు..

సర్వదర్శనం భక్తులకు 08 గంటల సమయం..

తిరుమల శ్రీవారి దర్శనం కోసం భక్తుల రద్దీ కొనసాగుతోంది. వేసవి సెలవులు, శుభకార్యాల కాలం నేపథ్యంలో దేశం నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తిరుమలకు చేరుకుంటున్నారు. ఆలయ పరిసరాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి.

టీటీడీ విడుదల చేసిన తాజా వివరాల ప్రకారం, ఉచిత దర్శనం కోసం వచ్చిన భక్తులతో ప్రస్తుతం 22 కంపార్ట్మెంట్లు నిండిపోయాయి. సర్వదర్శనం కోసం భక్తులు సుమారు 8 గంటల పాటు వేచి ఉండాల్సి వస్తోంది.

అలాగే ₹300 ప్రత్యేక ప్రవేశ దర్శనం (శీఘ్రదర్శనం) కోసం వచ్చిన భక్తులకు 3 నుంచి 4 గంటల సమయం పడుతోంది. సర్వదర్శనం టోకెన్లు పొందిన భక్తులకు కూడా 4 నుంచి 6 గంటల వరకు దర్శన సమయం పడుతున్నట్లు అధికారులు తెలిపారు.

ఇక నిన్న ఒక్కరోజే స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 78,985గా నమోదైంది. అదే రోజు 33,761 మంది భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు.

శ్రీవారి హుండీ ఆదాయం కూడా గణనీయంగా నమోదైంది. నిన్న ఒక్కరోజులోనే హుండీ ద్వారా ₹3.55 కోట్ల ఆదాయం వచ్చినట్లు టీటీడీ వెల్లడించింది.

భక్తుల రద్దీ ఎక్కువగా ఉన్న నేపథ్యంలో దర్శనానికి వచ్చే వారు తగిన ఏర్పాట్లతో రావాలని, టీటీడీ సూచనలు పాటించాలని అధికారులు కోరుతున్నారు.

Be the first to react

More Coverage

Highway Signboards: మీరు ఎప్పుడైనా గమనించారా? రోడ్డు పక్కన ఉండే ఆకుపచ్చ బోర్డుల వెనుక ఇంత పెద్ద సైన్స్ ఉందా? తెలిస్తే అబ్బా అంటారు!

Highway Signboards: మీరు ఎప్పుడైనా గమనించారా? రోడ్డు పక్కన ఉండే ఆకుపచ్చ బోర్డుల వెనుక ఇంత పెద్ద సైన్స్ ఉందా? తెలిస్తే అబ్బా అంటారు!

Highway Signboards: మీరు ఎప్పుడైనా హైవేలపై ప్రయాణించినప్పుడు రోడ్డు పక్కన లేదా పైన ఉండే బోర్డులను గమ…

South Korea: కొరియాలో ఉద్యోగం అంత కష్టమా? ‘భారతీయులెవరూ ఇక్కడికి రావద్దు’ అంటూ యువతి వైరల్ వీడియో!

South Korea: కొరియాలో ఉద్యోగం అంత కష్టమా? ‘భారతీయులెవరూ ఇక్కడికి రావద్దు’ అంటూ యువతి వైరల్ వీడియో!

South Korea: దక్షిణ కొరియాలో ఉద్యోగం చేయాలనుకుంటున్న భారతీయులను హెచ్చరిస్తూ ఓ యువతి పోస్ట్ చేసిన వీడ…