LIVE
Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!  •  Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!  •  Modi: ఫ్రాన్స్, స్లోవేకియా పర్యటనకు ప్రధాని మోదీ.. యూరప్ దేశాలతో బంధాల బలోపేతమే లక్ష్యం!  •  Promotions: దేవాదాయ శాఖలో భారీ ప్రమోషన్లు.. గ్రేడ్-1 ఆఫీసర్లుగా 26 మంది ఈఓలకు పదోన్నతులు!  •  TTD Updates: శ్రీవారి భక్తులకు అలర్ట్.. సెప్టెంబర్ నెల తిరుమల దర్శన టికెట్ల కోటా షెడ్యూల్ విడుదల!  •  EPFO: పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్... 8.25 శాతం వడ్డీ డబ్బులు అకౌంట్లలోకి వచ్చేది అప్పుడే!  •  Allu Arjun: రెండు దశాబ్దాల తర్వాత అదే క్రేజ్... 'హ్యాపీ' రీ-రిలీజ్ కలెక్షన్ల సంచలనం!  •  Srisailam: శ్రీశైల క్షేత్రంలో రికార్డు స్థాయి ఆర్థిక ప్రగతి.. బ్యాంకుల్లో వందల కోట్ల భారీ ఫిక్స్‌డ్ డిపాజిట్లు!  •  Google Maps: గూగుల్ మ్యాప్స్ క్రేజీ అప్‌డేట్.. ఇకపై పెట్రోల్, డీజిల్ ఖర్చులు మిగిలడం ఖాయం!  •  AP CRDA: 0.4 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో రూపుదిద్దుకుంటున్న నీరుకొండ రిజర్వాయర్...  • 
AndhraPravasi
AndhraPravasi
Latest Telugu and AP community news
⚡ BREAKING
Lifestyle

Tirumala: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. సర్వదర్శనానికి 12 గంటల సమయం!

Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ రోజురోజుకూ పెరుగుతోంది. వేసవి సెలవులు, ప్రత్యేక పూజలు, వారాంతపు రద్దీ కారణంగా శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు భారీ సంఖ్యలో భక్తులు తిరుమలకు చేరుకుంటున్నారు.

AndhraPravasi News Desk 1 min read
Tirumala: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. సర్వదర్శనానికి 12 గంటల సమయం!

సర్వదర్శనం భక్తులకు 12 గంటల సమయం..

300 రూ శీఘ్రదర్శనంకు 3–5 గంటల సమయం..

తిరుమలలో భక్తుల రద్దీ రోజురోజుకూ పెరుగుతోంది. వేసవి సెలవులు, ప్రత్యేక పూజలు, వారాంతపు రద్దీ కారణంగా శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు భారీ సంఖ్యలో భక్తులు తిరుమలకు చేరుకుంటున్నారు. బుధవారం ఉదయం పరిస్థితి ప్రకారం ఉచిత దర్శనం కోసం వచ్చిన భక్తులతో అన్ని కంపార్ట్మెంట్లు పూర్తిగా నిండిపోయాయి. క్యూలైన్లు కృష్ణ తేజ గెస్ట్ హౌస్ వరకు కొనసాగుతున్నాయి.

టీటీడీ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, ఉదయం 8 గంటల తర్వాత సర్వదర్శనానికి వెళ్లే భక్తులకు స్వామివారి దర్శనం పొందేందుకు సుమారు 12 గంటల సమయం పడుతోంది. రూ.300 ప్రత్యేక శీఘ్రదర్శనం టికెట్లు తీసుకున్న భక్తులకు కూడా 3 నుంచి 5 గంటల వరకు వేచి ఉండాల్సి వస్తోంది. అలాగే సర్వదర్శనం టోకెన్లు పొందిన భక్తులకు 4 నుంచి 6 గంటల సమయం పడుతోంది.

ఇక నిన్న ఒక్కరోజే స్వామివారిని మొత్తం 87,691 మంది భక్తులు దర్శించుకున్నారు. వారిలో 49,958 మంది భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. భక్తుల విరాళాలతో హుండీ ఆదాయం రూ.4.99 కోట్లకు చేరింది.

తిరుమలలో ప్రసాదాల విక్రయాలు కూడా భారీగా జరిగాయి. ఒక్కరోజే 4.22 లక్షల లడ్డూలను టీటీడీ విక్రయించింది. అన్నప్రసాదాల భవనంలో 2.52 లక్షల మంది భక్తులు ఉచిత భోజన సేవలను స్వీకరించారు. అలాగే వైద్యసేవల కోసం వచ్చిన 3,603 మంది భక్తులకు చికిత్స అందించినట్లు అధికారులు వెల్లడించారు.

భక్తుల రద్దీ అధికంగా ఉండటంతో టీటీడీ అన్ని ఏర్పాట్లు చేపట్టింది. క్యూలైన్లలో తాగునీరు, భోజనం, వైద్యసేవలు అందిస్తూ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటోంది.

Be the first to react

More Coverage

Highway Signboards: మీరు ఎప్పుడైనా గమనించారా? రోడ్డు పక్కన ఉండే ఆకుపచ్చ బోర్డుల వెనుక ఇంత పెద్ద సైన్స్ ఉందా? తెలిస్తే అబ్బా అంటారు!

Highway Signboards: మీరు ఎప్పుడైనా గమనించారా? రోడ్డు పక్కన ఉండే ఆకుపచ్చ బోర్డుల వెనుక ఇంత పెద్ద సైన్స్ ఉందా? తెలిస్తే అబ్బా అంటారు!

Highway Signboards: మీరు ఎప్పుడైనా హైవేలపై ప్రయాణించినప్పుడు రోడ్డు పక్కన లేదా పైన ఉండే బోర్డులను గమ…

South Korea: కొరియాలో ఉద్యోగం అంత కష్టమా? ‘భారతీయులెవరూ ఇక్కడికి రావద్దు’ అంటూ యువతి వైరల్ వీడియో!

South Korea: కొరియాలో ఉద్యోగం అంత కష్టమా? ‘భారతీయులెవరూ ఇక్కడికి రావద్దు’ అంటూ యువతి వైరల్ వీడియో!

South Korea: దక్షిణ కొరియాలో ఉద్యోగం చేయాలనుకుంటున్న భారతీయులను హెచ్చరిస్తూ ఓ యువతి పోస్ట్ చేసిన వీడ…