Women Empowerment: రూ.30 లక్షల జీతం ఉన్నా.. నా కోసం నేను జీవించడం మరిచిపోయా, అదే నిజమైన సంతృప్తి! Lokeshs post: భర్తగా గర్వంగా ఉంది.. బ్రాహ్మణిపై లోకేశ్ ఎమోషనల్ పోస్ట్! Gold Project: జొన్నగిరిలో బంగారు గనులు…! పదేళ్లలో 6 వేల టన్నుల ఉత్పత్తి లక్ష్యం! RRB Jobs 2026: నిరుద్యోగులకు శుభవార్త.. RRB 2026 జాబ్ క్యాలండర్ విడుదల, నోటిఫికేషన్ నెలలు ఇవే!! AP Govt: ఏపీలో కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఎంపికైన వారికి తీపికబురు..! నియామకాలు ఫైనల్! AmazonTech News: తెలంగాణలో అమెజాన్ భారీ పెట్టుబడి.. హైదరాబాద్‌లో AWS డేటా సెంటర్ విస్తరణ!! Gold Investment News: భారీగా పెరుగుతున్న బంగారం ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో తులం ఎంతంటే? Tirumala: శ్రీవారి దర్శనానికి భక్తుల వెల్లువ…! గంటల తరబడి క్యూ లైన్లలో నిరీక్షణ..! GOAT Tour India: టూర్‌లో హైదరాబాద్‌కు వచ్చిన మెస్సీ… రాహుల్ గాంధీతో ప్రత్యేక భేటీ!! US Immigration: ఇమిగ్రేషన్ మోసాలను అరికట్టేందుకు అమెరికా వలస నిబంధనలు కఠినం… పాత ఫోటోలపై!! Women Empowerment: రూ.30 లక్షల జీతం ఉన్నా.. నా కోసం నేను జీవించడం మరిచిపోయా, అదే నిజమైన సంతృప్తి! Lokeshs post: భర్తగా గర్వంగా ఉంది.. బ్రాహ్మణిపై లోకేశ్ ఎమోషనల్ పోస్ట్! Gold Project: జొన్నగిరిలో బంగారు గనులు…! పదేళ్లలో 6 వేల టన్నుల ఉత్పత్తి లక్ష్యం! RRB Jobs 2026: నిరుద్యోగులకు శుభవార్త.. RRB 2026 జాబ్ క్యాలండర్ విడుదల, నోటిఫికేషన్ నెలలు ఇవే!! AP Govt: ఏపీలో కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఎంపికైన వారికి తీపికబురు..! నియామకాలు ఫైనల్! AmazonTech News: తెలంగాణలో అమెజాన్ భారీ పెట్టుబడి.. హైదరాబాద్‌లో AWS డేటా సెంటర్ విస్తరణ!! Gold Investment News: భారీగా పెరుగుతున్న బంగారం ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో తులం ఎంతంటే? Tirumala: శ్రీవారి దర్శనానికి భక్తుల వెల్లువ…! గంటల తరబడి క్యూ లైన్లలో నిరీక్షణ..! GOAT Tour India: టూర్‌లో హైదరాబాద్‌కు వచ్చిన మెస్సీ… రాహుల్ గాంధీతో ప్రత్యేక భేటీ!! US Immigration: ఇమిగ్రేషన్ మోసాలను అరికట్టేందుకు అమెరికా వలస నిబంధనలు కఠినం… పాత ఫోటోలపై!!

SBI: రుణగ్రహీతలకు ఎస్‌బీఐ గుడ్‌న్యూస్! వడ్డీ రేట్లలో కోత… కొత్త వడ్డీ రేట్లు ఇవే!

2025-12-13 17:42:00
Land Of Snow: ప్రపంచంలో ‘ల్యాండ్ ఆఫ్ స్నో’గా పేరొందిన దేశం ఏదో మీకు తెలుసా!


దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) తన ఖాతాదారులకు ఊరటనిచ్చే కీలక నిర్ణయం తీసుకుంది. పలు రుణాలపై వడ్డీ రేట్లను స్వల్పంగా తగ్గించడంతో పాటు, కొన్ని ఎంపిక చేసిన టర్మ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను కూడా సవరించినట్లు ప్రకటించింది. ఈ కొత్త వడ్డీ రేట్లు ఈ నెల 15వ తేదీ నుంచి అమల్లోకి రానున్నాయి. ఈ నిర్ణయం వల్ల గృహ రుణాలు, వాహన రుణాలు, ఎంఎస్‌ఎంఈ రుణాలు తీసుకున్న వారికి ఈఎంఐ భారం కొంత మేర తగ్గే అవకాశం ఉంది. ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల్లో ఇది రుణగ్రహీతలకు మంచి ఊరటనిచ్చే అంశంగా భావిస్తున్నారు.

Weather Update: తెలుగు రాష్ట్రాల్లో చలి ఉధృతి… సాధారణం కంటే 7 డిగ్రీలు తక్కువ ఉష్ణోగ్రతలు IMD హెచ్చరిక!!

ఎస్బీఐ అన్ని కాలపరిమితులపై మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేటు (MCLR)ను 5 బేసిస్ పాయింట్ల మేర తగ్గించింది. దీనితో ఒక సంవత్సరం కాలపరిమితి గల MCLR 8.75 శాతం నుంచి 8.70 శాతానికి తగ్గింది. ఇదే విధంగా ఎక్స్‌టర్నల్ బెంచ్‌మార్క్ లెండింగ్ రేటు (EBLR)ను కూడా 25 బేసిస్ పాయింట్లు తగ్గిస్తూ 7.90 శాతంగా నిర్ణయించింది. అంతేకాకుండా పాత రుణగ్రహీతలకు వర్తించే బేస్ రేటును 10.00 శాతం నుంచి 9.90 శాతానికి తగ్గించింది. ఈ మార్పులతో ఫ్లోటింగ్ రేట్లపై తీసుకున్న రుణాలకు నెలవారీ వాయిదాలు తగ్గే అవకాశం ఉందని బ్యాంకింగ్ నిపుణులు చెబుతున్నారు.

IT Jobs: విశాఖలో సువర్ణ అధ్యాయం.. కూటమి ప్రభుత్వ సంచలన అడుగు.. యువత చేతిలో ల్యాప్‌టాప్‌లు.. గంజాయి కాదు.. లోకేష్ ఫైర్!

ఇక మరోవైపు రిటైల్ టర్మ్ డిపాజిట్లపై కూడా ఎస్బీఐ వడ్డీ రేట్లను స్వల్పంగా తగ్గించింది. రూ.3 కోట్ల లోపు ఉన్న డిపాజిట్లకు ఈ మార్పులు వర్తిస్తాయి. 2 నుంచి 3 సంవత్సరాల కాలపరిమితి గల డిపాజిట్లపై వడ్డీ రేటును 6.45 శాతం నుంచి 6.40 శాతానికి తగ్గించారు. సీనియర్ సిటిజన్లకు ఇదే కాలపరిమితిలో వడ్డీ రేటు 6.95 శాతం నుంచి 6.90 శాతానికి తగ్గింది. అలాగే ఎంతో ప్రజాదరణ పొందిన ‘అమృత్ వృష్టి’ 444 రోజుల టర్మ్ డిపాజిట్ పథకంపై వడ్డీని 6.60 శాతం నుంచి 6.45 శాతానికి తగ్గించినట్లు ఎస్బీఐ ప్రకటించింది.

Venky Mama: హ్యాపీ బర్త్‌డే వెంకీ మామ.. కలియుగ పాండవులుతో మొదలైన స్టార్ జర్నీ!

ప్రభుత్వ రంగ బ్యాంకుల ఆర్థిక పరిస్థితి గత కొన్నేళ్లుగా మెరుగుపడుతున్న నేపథ్యంలోనే ఈ తరహా వడ్డీ రేట్ల సవరణలు చోటు చేసుకుంటున్నాయి. 2022–23 ఆర్థిక సంవత్సరం నుంచి ప్రభుత్వ రంగ బ్యాంకులకు కేంద్ర ప్రభుత్వం ఎలాంటి మూలధన సహాయం అందించలేదని ఇటీవలే కేంద్ర ఆర్థిక శాఖ వెల్లడించింది. లాభాల్లో కొనసాగుతున్న బ్యాంకులు తమ వడ్డీ విధానాల్లో సర్దుబాట్లు చేస్తూ రుణగ్రహీతలకు కొంత ఊరట కల్పించేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఈ నిర్ణయం రుణ మార్కెట్‌లో డిమాండ్‌ను పెంచే అవకాశం ఉందని ఆర్థిక వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
 

సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లేవారికి గుడ్ న్యూస్.. కీలక తేదీలలో ప్రత్యేక రైళ్లను ప్రకటించిన దక్షిణ మధ్య రైల్వే
ప్రపంచవ్యాప్తంగా పాప్యులర్ అయిన ఒజెంపిక్ ఇంజెక్షన్ భారత్‌లో విడుదల! టైప్ 2 డయాబెటిస్ - బరువు తగ్గడానికి కూడా..
Car Sales: ధర తగ్గిన తర్వాత ఈ కార్లకు ఫుల్ డిమాండ్... పోటీపడి మరీ కొనేస్తున్నారు! టాప్ 5 బెస్ట్ సెల్లింగ్ SUVల వివరాలు!
H1B Visa ఫీజు పెంపు వ్యవహారంలో అనూహ్య పరిణామం.. కోర్టుకెక్కిన 20 రాష్ట్రాలు - ఆందోళనలో కార్పొరేట్లు!
Modi-Putin: మోదీ పుతిన్ సెల్ఫీ.. అమెరికా రాజకీయాల్లో కలకలం.. ట్రంప్‌కు దేశంలోనే వ్యతిరేకత!
విద్య ఎంత ముఖ్యమో విలువలు కూడా అంతే ముఖ్యం.. నేను ఈ స్థాయికి వచ్చానంటే!

Spotlight

Read More →