శిశువు పుట్టిన వెంటనే కనిపించే చిన్న శరీరం ఆప్యాయమైన శ్వాసలకే మనం ఎక్కువగా దృష్టి పెడతాం. కానీ శాస్త్రవేత్తలు ఇప్పుడు శిశువు తొలి మలంలోనే వారి భవిష్యత్ ఆరోగ్యంపై కీలక సంకేతాలు దాగి ఉన్నాయని చెబుతున్నారు. ఇటీవలే విడుదలైన ఒక పరిశోధనలో శిశువు పేగుల్లో మొదటిసారి ఏర్పడే సూక్ష్మజీవాల సమూహం అంటే గట్ మైక్రోబయోమ్ ఆరోగ్యంపై ఎంత పెద్ద ప్రభావం చూపుతుందో కొత్త వివరాలు వెల్లడయ్యాయి.
పుట్టుకకు ముందు శరీరం పూర్తిగా క్రిమిరహితంగా ఉంటుంది. కానీ పుట్టిన మూడో లేదా నాలుగో రోజుకే పేగుల్లోకి మంచి బ్యాక్టీరియా చేరడం ప్రారంభమవుతుందని యుకే పరిశోధకులు చెబుతున్నారు. ఈ తొలి బ్యాక్టీరియా శిశువు రోగనిరోధక వ్యవస్థకు ప్రధాన శిక్షకుల్లా పనిచేస్తాయి. ఏవి మంచి సూక్ష్మజీవులు, ఏవి హానికరం, ఆహారంలో ఏ రకాలు సహజంగా భరించాలి, ఏ రకాలకు జాగ్రత్త అవసరం అన్నది ఈ సూక్ష్మజీవాలే నేర్పుతాయి.
శిశువు పుట్టే విధానం కూడా గట్ మైక్రోబయోమ్‌పై ప్రభావం చూపుతుందని పరిశోధన చెబుతోంది. సాధారణ ప్రసవంలో పుట్టిన పిల్లలు తల్లిపేగు బ్యాక్టీరియా నుంచి వచ్చే సహజ రక్షణను పొందుతారు. కానీ సిజేరియన్ ద్వారా పుట్టిన శిశువులు ఈ బ్యాక్టీరియాను పూర్తిగా పొందకపోవచ్చు, అందువల్ల మొదటి నెలల్లో శ్వాసకోశ ఇన్‌ఫెక్షన్లు వచ్చే అవకాశాలు కొంచెం ఎక్కువగా ఉంటాయని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. అయితే ఇది ప్రతి కేసులో వర్తించదని కూడా స్పష్టీకరిస్తున్నారు.
తొలి వారాల్లో శిశువు పేగుల్లో స్థిరపడే మూడు ప్రధాన బ్యాక్టీరియా బిఫిడోబ్యాక్టీరియం లాంగమ్, బి. బ్రేవ్, ఈ. ఫీకాలిస్ – ఇవేవి చెరుకున్నాయనే ఆధారంగా తదుపరి నెలల్లో పేగు ఆరోగ్యం ఎలా ఉండబోతుందో నిర్ణయమవుతుంది. అందులో ముఖ్యంగా బి. లాంగమ్ ఉన్న పిల్లలకు మొదటి రెండేళ్లలో పెద్ద అవాంతరాలు తక్కువగా ఉంటాయని అధ్యయనాలు చెబుతున్నాయి.
పుట్టిన క్షణంలో శిశువుల ముఖంపై కనిపించే మలపు అవశేషాలు చూసి తల్లిదండ్రులు భయపడొచ్చు. కానీ శాస్త్రీయంగా చూస్తే అదే మంచి బ్యాక్టీరియా శరీరంలోకి సహజంగా ప్రవేశించే మార్గం. ఇది వింతగా అనిపించినా, ప్రకృతిలో ఇదే ఉత్తమ రక్షణ పద్ధతిగా శాస్త్రవేత్తలు గుర్తిస్తున్నారు.
ఇక చివరగా, శాస్త్రవేత్తలు చెప్పే విలువైన సూచన ఒకటే—
“పుట్టుక నుంచి తొలి వెయ్యి రోజులు శిశువు ఆరోగ్యం నిర్ణయించే కీలక సమయం. శిశువు పేగు మైక్రోబయోమ్‌ను దెబ్బతీయకుండా మంచి ఆహారం, శుభ్రత, తల్లి పాల పోషణ – ఇవే పెద్ద రక్షణ. శిశువు తొలి మలం చిన్న విషయం లాగా కనిపించినా, అందులోని సమాచారమే భవిష్యత్ ఆరోగ్యానికి పెద్ద పునాది అని నిపుణులు చెబుతున్నారు.
ఈ సమాచారం కేవలం అవగాహనకు మాత్రమే ముందుగా మీ డాక్టర్ ని సంప్రదించి తగిన సూచనలు తీసుకోవడం మంచిది.