ఖాళీ కడుపుతో ఒక కప్పు లెమన్ టీ తాగితే ఏమవుతుంది అనే ప్రశ్న చాలామందిలో ఉంటుంది. సాధారణంగా లెమన్ టీని రుచికోసం మాత్రమే తాగే పానీయంగా భావిస్తారు. కానీ ఇది కేవలం రుచికే పరిమితం కాదని, ఆరోగ్య పరంగా ఎన్నో లాభాలు అందిస్తుందని వైద్యులు, పోషక నిపుణులు చెబుతున్నారు. రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో లెమన్ టీని అలవాటుగా చేసుకుంటే శరీరంలో చిన్నచిన్న కానీ ముఖ్యమైన మార్పులు కనిపిస్తాయని అంటున్నారు.
లెమన్ టీకి ప్రధానంగా జీర్ణక్రియను మెరుగుపరిచే గుణం ఉంది. ఉదయం లేవగానే తాగినప్పుడు ఇది జీర్ణవ్యవస్థను మెల్లగా ఉత్తేజితం చేస్తుంది. రాత్రంతా విశ్రాంతిలో ఉన్న కడుపు, పేగులు తిరిగి సజావుగా పనిచేయడానికి ఇది సహకరిస్తుంది. కడుపు ఉబ్బరం, అజీర్ణం, గ్యాస్ వంటి సమస్యలు ఉన్నవారికి ఇది ఉపశమనాన్ని ఇస్తుంది. జీర్ణ ఎంజైమ్‌ల ఉత్పత్తిని ప్రోత్సహించడం వల్ల ఆహారం సులభంగా జీర్ణమవుతుంది.
లెమన్ టీలో ఉండే విటమిన్ సీ శరీరానికి ఎంతో అవసరం. ఇది రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది. తరచూ జలుబు, దగ్గు, గొంతు నొప్పి వంటి సమస్యలు ఎదురయ్యే వారికి లెమన్ టీ మంచి సహాయకారి. ఇందులో యాంటీబాక్టీరియల్, యాంటీవైరల్ లక్షణాలు ఉండటం వల్ల శరీరాన్ని ఇన్ఫెక్షన్ల నుంచి కాపాడడంలో ఇది తోడ్పడుతుంది. ముఖ్యంగా వాతావరణ మార్పుల సమయంలో ఇది మరింత ఉపయోగకరంగా ఉంటుంది.
చర్మ ఆరోగ్యానికి కూడా లెమన్ టీ మంచి యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉండటంతో చర్మంపై ఏర్పడే మచ్చలు, నలుపుదనాన్ని తగ్గించడంలో ఇది సహాయపడుతుంది. చర్మ కణాలను లోపలినుంచి శుభ్రపరచి సహజమైన మెరుపును అందిస్తుంది. వృద్ధాప్య లక్షణాలు ఆలస్యంగా కనిపించడానికి కూడా ఇది దోహదపడుతుందని నిపుణులు చెబుతున్నారు. రోజూ లెమన్ టీ తాగేవారిలో చర్మం తాజాగా కనిపిస్తుందని అనుభవాలు చెబుతున్నాయి.
బరువు తగ్గాలనుకునే వారికి లెమన్ టీ ఒక మంచి అలవాటు. ఇది జీవక్రియను వేగవంతం చేసి, శరీరంలో అదనంగా పేరుకుపోయిన కొవ్వును క్రమంగా తగ్గించడంలో సహాయపడుతుంది. చక్కెర కలిపిన టీ, కాఫీకి బదులుగా లెమన్ టీని ఎంచుకుంటే కేలరీల నియంత్రణ సులభమవుతుంది. దీంతో పాటు శరీరంలో నీటి శాతం సమతుల్యంగా ఉండేందుకు ఇది ఉపయోగపడుతుంది.
లెమన్ టీ సహజమైన మూత్రవిసర్జన కారిగా పనిచేస్తుంది. శరీరంలో పేరుకుపోయిన విషపదార్థాలను బయటకు పంపడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది. కిడ్నీల పనితీరును మెరుగుపరచి, శరీరాన్ని నిర్విషీకరణ చేసే ప్రక్రియకు ఇది తోడ్పడుతుంది. అందుకే చాలా మంది ఆరోగ్య నిపుణులు ఉదయాన్నే లెమన్ టీని సూచిస్తుంటారు. ఈ సంవత్సరం కేవలం మీ అవగాహనకు మాత్రమే మీ ఆరోగ్య పరిస్థితి రిత్యా ముందుగా మీ డాక్టర్ ను సంప్రదించడం మంచిది.