UAE లో వరుసగా ఐదు రోజులు సెలవులు ప్రకటించిన ప్రభుత్వం!

UAE Eid Al Etihad 2026: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) ప్రభుత్వం ఉద్యోగులకు కీలక ప్రకటన చేసింది. దేశ 55వ జాతీయ దినోత్సవం (Eid Al Etihad) సందర్భంగా ఫెడరల్ ప్రభుత్వ ఉద్యోగులకు మూడు రోజుల పాటు సెలవులు ప్రకటించింది. ఈ మేరకు నవంబర్ 13న యూఏఈ ప్రభుత్వ మీడియా కార్యాలయం అధికారికంగా వెల్లడించింది.

UAE Announces 2026 Eid Al Etihad Holidays
UAE Announces 2026 Eid Al Etihad Holidays
  • యూఏఈ 55వ జాతీయ దినోత్సవం (ఈద్ అల్ ఇతిహాద్) సందర్భంగా ఫెడరల్  ఉద్యోగులకు డిసెంబర్ 2 నుంచి 4 వరకు మూడు రోజుల సెలవులు ప్రకటించారు.
  • ప్రభుత్వ ఉద్యోగులకు 5 రోజులు, ప్రైవేట్ ఉద్యోగులకు 2 రోజులు సెలవులు ప్రకటించారు.

UAE Eid Al Etihad 2026: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) ప్రభుత్వం ఉద్యోగులకు కీలక ప్రకటన చేసింది. దేశ 55వ జాతీయ దినోత్సవం (Eid Al Etihad) సందర్భంగా ఫెడరల్ ప్రభుత్వ ఉద్యోగులకు మూడు రోజుల పాటు సెలవులు ప్రకటించింది. ఈ మేరకు నవంబర్ 13న యూఏఈ ప్రభుత్వ మీడియా కార్యాలయం అధికారికంగా వెల్లడించింది.

డిసెంబర్ 2 నుంచి మూడు రోజుల సెలవులు

యూఏఈ ఫెడరల్ ప్రభుత్వ ఉద్యోగులకు 2026 డిసెంబర్ 2 (బుధవారం) నుంచి డిసెంబర్ 4 (శుక్రవారం) వరకు సెలవులు ఉంటాయి. తిరిగి డిసెంబర్ 7 (సోమవారం) నుంచి ప్రభుత్వ కార్యాలయాల్లో సాధారణ విధులు ప్రారంభమవుతాయి. మధ్యలో శని, ఆదివారాలు వారాంతపు సెలవులు కావడంతో ఉద్యోగులకు వరుసగా ఐదు రోజుల విరామం లభించనుంది.

ప్రైవేట్ ఉద్యోగులకు కూడా పండగ సెలవులు

ప్రైవేట్ రంగ ఉద్యోగులకు కూడా ప్రభుత్వం సెలవులను ప్రకటించింది. వీరికి డిసెంబర్ 2, 3 తేదీల్లో రెండు రోజుల పాటు వేతనంతో కూడిన సెలవులు లభించనున్నాయి. శని, ఆదివారాలు సాధారణ సెలవులుగా ఉండే ఉద్యోగులు డిసెంబర్ 4న వార్షిక సెలవు తీసుకుంటే ఐదు రోజుల పాటు విశ్రాంతి పొందవచ్చు.

55 ఏళ్ల యూఏఈ ఐక్యతకు గుర్తుగా వేడుకలు

1971 డిసెంబర్ 2న ఆరు ఎమిరేట్లు కలిసి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌గా(UAE) ఏర్పడ్డాయి. అనంతరం 1972లో రాస్ అల్ ఖైమా కూడా ఈ సమాఖ్యలో చేరింది. ఈ చారిత్రక ఐక్యతకు గుర్తుగా ప్రతి ఏడాది డిసెంబర్ 2న ఈద్ అల్ ఇతిహాద్ వేడుకలను నిర్వహిస్తారు. 2026లో యూఏఈ ఏర్పాటై 55 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా దేశవ్యాప్తంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

Tags

Be the first to react

Latest