AP Government: ఏపీ ప్రభుత్వం షాకింగ్ నిర్ణయం..! విజయవాడ, తిరుపతి హోదాపై కీలక ప్రకటన..!

2025-12-28 07:08:00
కెనడాలో మన మహిళలకు అండగా.. టోరంటో భారత కాన్సులేట్ 'వన్ స్టాప్ సెంటర్'! 24 గంటల హెల్ప్‌లైన్..

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలకమైన నిర్ణయం తీసుకుంది. ఇటీవలి రోజులుగా తీవ్ర చర్చకు దారి తీసిన గ్రేటర్ విజయవాడ, గ్రేటర్ తిరుపతి ఏర్పాటు ప్రతిపాదనలను ప్రస్తుతానికి వాయిదా వేయాలని నిర్ణయించింది. ఈ విషయాన్ని ఏపీ మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ అధికారికంగా వెల్లడించారు. భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని అధికారులు ఇప్పటికే ఈ రెండు నగరాలకు గ్రేటర్ హోదా కల్పించేలా ప్రతిపాదనలు సిద్ధం చేసినప్పటికీ, కొన్ని సాంకేతిక, పరిపాలనా ఇబ్బందుల కారణంగా ప్రభుత్వం వెనక్కి తగ్గినట్లు మంత్రి స్పష్టం చేశారు. దీంతో ఈ రెండు నగరాల ప్రజల్లో నెలకొన్న అంచనాలకు తాత్కాలికంగా బ్రేక్ పడినట్టయింది.

China: కంటిరెప్పలో మాయమయ్యే వేగం.. చైనా ట్రైన్ వరల్డ్ రికార్డ్!

ఈ నిర్ణయానికి ప్రధాన కారణం జాతీయ జనగణన అని మంత్రి నారాయణ వివరించారు. దేశవ్యాప్తంగా త్వరలో జనగణన చేపట్టనున్న నేపథ్యంలో, ఆ ప్రక్రియ పూర్తయ్యే వరకు డీలిమిటేషన్ చేయరాదని కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిందని తెలిపారు. గ్రేటర్ హోదా ఇవ్వాలంటే కొత్తగా సరిహద్దుల నిర్ణయం, స్థానిక సంస్థల పునర్వ్యవస్థీకరణ అవసరం అవుతుంది. ఇవన్నీ డీలిమిటేషన్‌కు సంబంధించిన అంశాలే కావడంతో, జనగణన పూర్తయ్యే వరకు ఈ ప్రక్రియను ముందుకు తీసుకెళ్లడం సాధ్యం కాదని ప్రభుత్వం భావించినట్లు తెలిపారు. ఇదే అంశంపై సీఎం చంద్రబాబు నాయుడు కూడా స్పష్టత ఇచ్చినట్లు మంత్రి వెల్లడించారు.

Amaravati Farmers: రాజధాని రైతులకు ఊరట… లింక్ డాక్యుమెంట్లు లేకుండానే రుణాలకు గ్రీన్ సిగ్నల్..!!

గ్రేటర్ విజయవాడ ఏర్పాటుపై ప్రభుత్వం తొలుత పెద్ద ప్రణాళికనే రూపొందించింది. విజయవాడ చుట్టుపక్కల ఉన్న గ్రామాలు, మున్సిపాలిటీలను విలీనం చేసి నగర విస్తీర్ణాన్ని భారీగా పెంచాలని భావించింది. ఈ ప్రక్రియ ద్వారా జనాభా 20 లక్షలు దాటుతుందని, తద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాల నుంచి ఎక్కువ నిధులు రాబట్టవచ్చని అంచనా వేశారు. ఇందుకోసం విజయవాడలోకి సుమారు 74 గ్రామాలను విలీనం చేయాలనే ప్రతిపాదన కూడా వచ్చింది. అయితే జనగణన, ఎన్నికల కోడ్ వంటి అంశాలు అడ్డంకిగా మారడంతో, ఈ ప్రతిపాదనను ప్రభుత్వం తాత్కాలికంగా పక్కన పెట్టింది.

Bhuvaneswari garu: టెక్నాలజీలో భువనేశ్వరి నాకంటే ముందున్నారు.. సీఎం చంద్రబాబు!

అదేవిధంగా గ్రేటర్ తిరుపతి ప్రతిపాదన కూడా ప్రస్తుతం నిలిచిపోయింది. పర్యాటకం, ఆధ్యాత్మికం, విద్య, వ్యాపార రంగాల్లో తిరుపతి వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరంగా మారింది. ఇళ్ల కొరత పెరగడంతో సుమారు 30 శాతం మంది ప్రజలు శివారు ప్రాంతాలకు వలస వెళ్తున్నట్లు అంచనాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో తిరుపతి గ్రామీణం, చంద్రగిరి, రేణిగుంట, ఏర్పేడు, రామచంద్రాపురం మండలాల్లోని 63 గ్రామ పంచాయతీలను విలీనం చేసి గ్రేటర్ తిరుపతి ఏర్పాటు చేయాలనే యోచన చేసింది ప్రభుత్వం. అయితే జనగణన పూర్తయ్యాకే ఈ ప్రతిపాదనలపై తుది నిర్ణయం తీసుకుంటామని మంత్రి నారాయణ స్పష్టం చేశారు.

China US Relations: ఆ దేశానికి ఆయుధాలు అమ్మితే మూల్యం చెల్లించుకోవాల్సిందే… అమెరికాకు చైనా హెచ్చరిక!!
Medical Jobs: నిరుద్యోగులకు శుభవార్త..! ఒక్క రాత పరీక్ష లేకుండా ఉద్యోగాలు..!
Generation Beta: AI యుగంలో పుట్టిన తరం.. జనరేషన్ బీటా ఎవరు! జనరేషన్ల చరిత్రలో కొత్త అధ్యాయం!
Political Violence: 'రప్పా రప్పా నరుకుతాం' అంటే.. రఫ్ఫాడిస్తాం..! హోం మంత్రి అనిత స్ట్రాంగ్ వార్నింగ్!
Mumbai To Dubai: ఫ్లైట్ కాదండోయ్... ఇప్పుడు ట్రైన్ లోనే 2 గంటల్లో ముంబయి టు దుబాయ్... ఎలాగనుకుంటున్నారా!
Bank Holidays: ఏపీ, తెలంగాణలో బ్యాంక్ సెలవుల పూర్తి జాబితా ఇదే!

Spotlight

Read More →