ఉద్యోగులే సంస్థ బలం... టీడీపీ కార్యాలయంలో సిబ్బందికి న్యూ ఇయర్ కానుకలు! ఏపీలో వారికి తీపికబురు.. రుణమాఫీ నుంచి ఉద్యోగుల డీఏ పెంపు వరకు.. పండగ తెచ్చిన సర్కార్! ఏపీలో ఆ ప్రాంతానికి మహర్దశ! రూ.14 కోట్లతో కొత్తగా మరో స్టేడియం.. భూముల ధరలకు రెక్కలు! Ward Secretariat: కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయం! వార్డు సచివాలయాలకు పేరు మార్పు! Interest Free Loans: ఏపీలో వారికి వడ్డీ లేని రుణాలు! 50 శాతం వరకు రాయితీ కూడా... త్వరపడండి! ఏపీ రేషన్ కార్డుదారులకు శుభవార్త.. కిలో రూ.20 మాత్రమే! ఎన్ని కావాలంటే అన్ని తీసుకెళ్ళొచ్చు! Municipality Upgrade: ప్రభుత్వ కీలక నిర్ణయం! ఏపీలో మూడు మున్సిపాలిటీలకు గ్రేడ్ పెంపు.. AP Government: ఏపీలో వాళ్లందరికీ గుడ్ న్యూస్! న్యూ ఇయర్ కానుక.. ఒక్కొకరికి రూ.12 వేలు! Pensioners Issue: పెన్షన్ పెంచకపోతే ఆ పని చేస్తాం! వృద్ధుల బెదిరింపుకు తలొగ్గిన ప్రభుత్వం! Bangladeshi leader: బంగ్లా యువనేత హత్యపై ఇండియా బంగ్లాదేశ్ మధ్య ఆరోపణలు.. హాదీ హత్య కేసులో ట్విస్ట్! ఉద్యోగులే సంస్థ బలం... టీడీపీ కార్యాలయంలో సిబ్బందికి న్యూ ఇయర్ కానుకలు! ఏపీలో వారికి తీపికబురు.. రుణమాఫీ నుంచి ఉద్యోగుల డీఏ పెంపు వరకు.. పండగ తెచ్చిన సర్కార్! ఏపీలో ఆ ప్రాంతానికి మహర్దశ! రూ.14 కోట్లతో కొత్తగా మరో స్టేడియం.. భూముల ధరలకు రెక్కలు! Ward Secretariat: కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయం! వార్డు సచివాలయాలకు పేరు మార్పు! Interest Free Loans: ఏపీలో వారికి వడ్డీ లేని రుణాలు! 50 శాతం వరకు రాయితీ కూడా... త్వరపడండి! ఏపీ రేషన్ కార్డుదారులకు శుభవార్త.. కిలో రూ.20 మాత్రమే! ఎన్ని కావాలంటే అన్ని తీసుకెళ్ళొచ్చు! Municipality Upgrade: ప్రభుత్వ కీలక నిర్ణయం! ఏపీలో మూడు మున్సిపాలిటీలకు గ్రేడ్ పెంపు.. AP Government: ఏపీలో వాళ్లందరికీ గుడ్ న్యూస్! న్యూ ఇయర్ కానుక.. ఒక్కొకరికి రూ.12 వేలు! Pensioners Issue: పెన్షన్ పెంచకపోతే ఆ పని చేస్తాం! వృద్ధుల బెదిరింపుకు తలొగ్గిన ప్రభుత్వం! Bangladeshi leader: బంగ్లా యువనేత హత్యపై ఇండియా బంగ్లాదేశ్ మధ్య ఆరోపణలు.. హాదీ హత్య కేసులో ట్విస్ట్!

Political Violence: 'రప్పా రప్పా నరుకుతాం' అంటే.. రఫ్ఫాడిస్తాం..! హోం మంత్రి అనిత స్ట్రాంగ్ వార్నింగ్!

2025-12-27 19:12:00
Mumbai To Dubai: ఫ్లైట్ కాదండోయ్... ఇప్పుడు ట్రైన్ లోనే 2 గంటల్లో ముంబయి టు దుబాయ్... ఎలాగనుకుంటున్నారా!


రాజకీయ ముసుగులో వైసీపీ నాయకులు, కార్యకర్తలు ఉన్మాదపు చర్యలకు దిగుతున్నారని రాష్ట్ర హోం మంత్రి అనిత తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పుట్టినరోజు వేడుకల పేరుతో సమాజంలో హింసాత్మక, హానికర సంప్రదాయాలను ప్రోత్సహించడం అత్యంత గర్హనీయమని ఆమె పేర్కొన్నారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్ పుట్టినరోజు సందర్భంగా జగన్ ఫ్లెక్సీల వద్ద మేకలను బలివ్వడం, రక్తాభిషేకాలు చేయడం వంటి ఘటనలు రాష్ట్రంలో శాంతిభద్రతలకు తీవ్ర ముప్పుగా మారుతున్నాయని హెచ్చరించారు. ఇవన్నీ యాదృచ్ఛిక ఘటనలు కాదని, ఒక వ్యవస్థీకృత నేర ధోరణిగా కనిపిస్తున్నాయని ఆమె ఆరోపించారు.

Bank Holidays: ఏపీ, తెలంగాణలో బ్యాంక్ సెలవుల పూర్తి జాబితా ఇదే!

నేడు టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో అనిత మాట్లాడుతూ… సాధారణంగా పుట్టినరోజులు సేవా కార్యక్రమాలతో జరుపుకోవడం సంప్రదాయమని గుర్తుచేశారు. అన్నదానం, రక్తదానం, పేదలకు ఆహారం పంపిణీ చేయడం, ఆలయాల్లో పూజలు నిర్వహించడం లాంటి సత్కార్యాలు చేయాల్సిన చోట, వైసీపీ శ్రేణులు రౌడీయిజానికి బలాన్ని చేకూర్చేలా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. కేక్ కట్ చేయడానికి చిన్న ప్లాస్టిక్ కత్తి వాడటం మన సంస్కృతి అయితే, వైసీపీ కార్యకర్తలు వేటకొడవళ్ళు, పెద్ద కత్తులతో కేక్ కట్ చేస్తూ భయానక వాతావరణాన్ని సృష్టిస్తున్నారని విమర్శించారు. “రప్పా రప్పా అని నరుకుతాం… 2029లో ఇదే రిపీట్” అంటూ నినాదాలు చేయడం వారి నేరపూరిత మనస్తత్వానికి నిదర్శనమని అన్నారు.

District Redivision: జిల్లాల పునర్విభజనపై ఏపీ సర్కార్ కీలక నిర్ణయం.. తుది నోటిఫికేషన్ కు ముహూర్తం ఫిక్స్!!

కళ్యాణదుర్గం, ఉరవకొండ, సింగనమల, రాప్తాడు, కుప్పం సహా 10కి పైగా నియోజకవర్గాల్లో ఒకే రోజు, ఒకే తరహాలో జంతు బలులు, రక్తాభిషేకాలు జరగడం వెనుక జగన్ ఆదేశాలే ఉన్నాయనే అనుమానాలు బలపడుతున్నాయని అనిత వ్యాఖ్యానించారు. మాజీ మంత్రులు పక్కనే నిలబడి ప్రోత్సహిస్తుండగా, కార్యకర్తలు మేకల తలలు నరికిన ఫోటోలు సోషల్ మీడియాలో పోస్టులు చేయడం అత్యంత దారుణమని అన్నారు. పండుగల పేరిట టపాసులు కాల్చడాన్ని ఆపమని కోరిన ఓ గర్భిణీ మహిళను కడుపుపై తన్నడం వంటి ఘటనలు వైసీపీ శ్రేణుల ఉన్మాదానికి పరాకాష్ఠ అని దుయ్యబట్టారు.

Prakash Raj: మేమంతా నీతోనే అనసూయకు ప్రకాశ్ రాజ్ ట్వీట్.. డ్రెస్ కాదు.. టాలెంట్‌దే అసలైన అడ్రస్.. SKN!

వైసీపీ శ్రేణులు చేసే ఈ అరాచక చర్యలను వారి నాయకుడు జగన్ ఒక్క మాటతోనైనా ఖండించకపోవడం దారుణమని అనిత తీవ్రంగా తప్పుబట్టారు. “ఆస్తి కోసం సొంత తల్లి, చెల్లెలిపైనే కేసులు పెట్టిన వ్యక్తి… మీ పిల్లల భవిష్యత్తును కాపాడతాడా?” అంటూ ఆమె ప్రశ్నించారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్నది చంద్రబాబు నాయుడు ప్రభుత్వమేనని స్పష్టం చేసిన ఆమె, శాంతిభద్రతల విషయంలో ఎలాంటి రాజీ లేదన్నారు. కత్తులు, కొడవళ్ళతో తిరిగే ఉన్మాదులను ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టబోమని, రౌడీయిజానికి పాల్పడిన ప్రతి ఒక్కరిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. “గీత దాటితే కటకటాలే… రప్పా రప్పా అంటే రిమాండ్ తప్పదు” అంటూ హోం మంత్రి అనిత ఘాటు హెచ్చరికలు జారీ చేశారు.
 

PSB Merger Plan: చిన్న బ్యాంకులకు కౌంట్‌డౌన్..? భారీ బ్యాంకులతో కలిపే యోచన!
Viral video : ఢిల్లీ కంటే బెంగళూరే రాజధానిగా బెటర్.. వైరల్ అవుతున్న వీడియో!!
International Relations: ఉక్రెయిన్ యుద్ధంపై కీలక మలుపు? ట్రంప్‌తో భేటీకి జెలెన్స్కీ సిద్ధం!!
Hot Soup: చికెన్, మటన్ పాయ కాదండోయ్..! చేపల పాయ సూప్ ఇంట్లోనే ఇలా చేసెయ్యండి!
Land Issues: రైతుల భూ సమస్యలకు ఫుల్ స్టాప్…! రాష్ట్రవ్యాప్తంగా రెవెన్యూ క్లినిక్‌లు!
India China : చైనాతో సై అంటున్న భారత్.. సరిహద్దుల్లో మౌలిక వసతులకు టర్బో స్పీడ్!

Spotlight

Read More →