ఈ రోజుల్లో స్మార్ట్‌ఫోన్ అనేది మన జీవితంలో ఒక భాగం అయిపోయింది. అయితే ఒక కొత్త ఫోన్ కొనాలనుకున్నప్పుడు మనందరినీ వేధించే ప్రధాన సమస్య.. బడ్జెట్. తక్కువ ధరలో మంచి కెమెరా ఉండాలి, ఫోన్ చూడటానికి ఖరీదైనదిగా కనిపించాలి, అలాగే స్పీడ్ కూడా బాగుండాలి అని కోరుకుంటాం. సరిగ్గా ఇలాంటి కోరికలన్నింటినీ నెరవేరుస్తూ వివో (Vivo) తన వివో వి40 5జి (Vivo V40 5G) ఫోన్‌ను మార్కెట్లోకి తీసుకువచ్చింది.
సాధారణంగా ఫ్లాగ్‌షిప్ స్థాయి కెమెరా అనుభవం కావాలంటే వేల రూపాయలు ఖర్చు చేయాల్సి ఉంటుంది. కానీ కేవలం ₹9,999 ధరలో ప్రీమియం అనుభూతిని అందించడమే లక్ష్యంగా ఈ ఫోన్ రూపొందించబడింది.
ఫోన్ చూడటానికి చాలా సింపుల్‌గా అనిపించినా, చేతిలోకి తీసుకోగానే ఆ ఫీలింగ్ మారిపోతుంది. వెనుక భాగంలో ఇచ్చిన ప్రత్యేకమైన ఫినిషింగ్ వల్ల ఇది ఒక ఖరీదైన ఫోన్‌ను పట్టుకున్నామనే భావనను కలిగిస్తుంది. ఆకట్టుకునే డిజైన్‌తో పాటు ప్రీమియం లుక్‌ను కోరుకునే వారికి ఈ ఫోన్ ఒక స్టైలిష్ ఆప్షన్‌గా నిలుస్తుంది.
ఫ్లాగ్లిప్ కెమెరా అనుభవం విషయానికి వస్తే, వివో వి40 5జి లో హై రిజల్యూషన్ మెయిన్ కెమెరా సెన్సార్ ఇవ్వడం వల్ల ఫోటోలు చాలా క్లియర్గా రావడం కనిపిస్తుంది. డే లైట్లో కలర్స్ నేచురల్గా ఉండటం మాత్రమే కాదు, షాడోస్లో కూడా డీటెయిల్స్ మిస్ కాకుండా క్యాప్చర్ చేయగలిగేలా కెమెరాను ట్యూన్ చేశారు.
నైట్ ఫోటోగ్రఫీ లో కూడా నాయిస్ తగ్గించి క్లారిటీ పెంచేలా సాఫ్ట్వేర్ సపోర్ట్ అందించారు. పోర్ట్రెయిట్ మోడ్లో బ్యాక్ గ్రౌండ్ బ్లర్ సహజంగా కనిపించడం ఈ ఫోన్ కి మరో ప్లస్. సెల్ఫీ కెమెరా కూడా సోషల్ మీడియా యూజర్లను దృష్టిలో పెట్టుకుని షార్నెస్ ఎక్కువగా ఉండేలా రూపొందించారు కాబట్టి రీల్స్ స్టోరీస్ కోసం ప్రత్యేకంగా ఎడిటింగ్ చేయాల్సిన అవసరం పెద్దగా ఉండదు.
బ్యాటరీ బ్యాకప్ విషయానికి వస్తే, వివో వి40 5జి రోజువారీ వినియోగానికి నమ్మకంగా నిలుస్తుంది. పెద్ద బ్యాటరీ ఉండటం వల్ల ఒకసారి ఫుల్ ఛార్జ్ చేస్తే ఉదయం నుంచి రాత్రి వరకు సోషల్ మీడియా బ్రౌజింగ్ వీడియో స్ట్రీమింగ్ కాల్స్ వంటి సాధారణ వినియోగంలో టెన్షన్ లేకుండా వాడుకోవచ్చు. ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉండటం వల్ల తక్కువ సమయంలోనే మళ్లీ ఫోన్ ఉపయోగానికి సిద్ధంగా అవుతుంది. రోజూ బయట తిరిగే వాళ్లకు ఇది చాలా ఉపయోగపడే అంశం.
వివో వి40 5జి యొక్క అసలు శక్తి దాని ధరలోనే ఉంది. ఇన్ని ప్రీమియం ఫీచర్లు ఉండి కూడా దీని ధరను కేవలం ₹9,999 గా నిర్ణయించడం గొప్ప విషయం. ఒక బడ్జెట్ ఫోన్ లో ఫ్లాగ్‌షిప్ లుక్, మంచి కెమెరా, మరియు నమ్మకమైన బ్యాటరీని కోరుకునే వారికి ఇది కచ్చితంగా సరైన ఎంపిక. సాధారణంగా వివో 'వి' సిరీస్ ఫోన్లు ₹30,000 పైనే ఉంటాయి. అయితే ఈ నిర్దిష్ట మోడల్ బడ్జెట్ వినియోగదారుల కోసం ఒక ప్రత్యక వెర్షన్ గా కనిపిస్తోంది.