తీరం దాటనున్న అక్వాన్! ఈ జిల్లాకు రెడ్ అలెర్ట్! ఉత్తరాంధ్ర–దక్షిణ ఒడిశా తీరాలను తాకిన బాహ్యవలయం!
Cyclone Akwan: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర తుపాను 'అక్వాన్' తీరం దాటే ప్రక్రియ ప్రారంభమై, బాహ్యవలయం ఉత్తరాంధ్ర–దక్షిణ ఒడిశా తీరాలను తాకిందని RTGS–APSDMA వెల్లడించింది. గంటకు 21 కి.మీ. వేగంతో కదులుతూ ఉదయానికి గోపాల్‌పూర్ సమీపంలో తీరం దాటనున్న ఈ తుపాను ప్రభావంతో ఇవాళ శ్రీకాకుళం జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని, ఇప్పటికే ఇచ్ఛాపురంలో 16 సెం.మీ., కంచిలి, కవిటిలో 10 సెం.మీ. వర్షపాతం నమోదైనందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎండీ ప్రఖర్ జైన్ సూచించారు.
- రాష్ట్రంలోని 4 కార్పొరేషన్లు, 19 మున్సిపాలిటీలు / నగర పంచాయతీల పరిధిలో పెయిడ్ హాలిడే అమలు!
- ఎన్నికలు జరిగే పట్టణ స్థానిక సంస్థల పరిధిలోని షాపులు, వాణిజ్య సంస్థలు, ప్రైవేట్ కంపెనీల ఉద్యోగులందరికీ వర్తింపు!
- ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు వీలుగా కార్మికశాఖ కీలక ఉత్తర్వులు జారీ!
Environment: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమై ఉన్న తీవ్ర తుపాను 'అక్వాన్' (Akwan) తీరం దాటే ప్రక్రియ ప్రారంభమైందని RTGS – APSDMA నవంబర్ 20, 2026 ఉదయం 4:30 గంటలకు విడుదల చేసిన తాజా నివేదికలో వెల్లడించింది. తుపాను బాహ్యవలయం ఇప్పటికే ఉత్తరాంధ్ర–దక్షిణ ఒడిశా తీరాలను తాకిందని, ఉదయానికి ఒడిశాలోని గోపాల్‌పూర్ సమీపంలో తుపాను పూర్తిగా తీరం దాటనుందని ఏపీఎస్డీఎంఏ ఎండీ, ఆర్టీజీఎస్ సీఈవో ప్రఖర్ జైన్ తేలిపారు.
గంటకు 21 కి.మీ. వేగం – ప్రధాన తీర ప్రాంతాలకు ప్రస్తుత దూరం
గడిచిన 6 గంటల్లో అక్వాన్ తీవ్ర తుపాను గంటకు 21 కిలోమీటర్ల వేగంతో తీరం వైపు కదులుతోంది. తాజా సమాచారం ప్రకారం తుపాను కేంద్రం కళింగపట్నంకి 110 కి.మీ., విశాఖపట్నంకి 170 కి.మీ., గోపాల్‌పూర్‌కి 170 కి.మీ., పూరీకి 250 కి.మీ., మరియు నరసాపురానికి 370 కి.మీ. దూరంలో కేంద్రీకృతమై ఉంది.
శ్రీకాకుళం జిల్లాలో భారీ వర్ష సూచన – ప్రజలకు ప్రఖర్ జైన్ అలర్ట్
తుపాను ప్రభావంతో ఇవాళ శ్రీకాకుళం జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, మిగిలిన ఉత్తరాంధ్ర జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లా ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని ఏపీఎస్డీఎంఏ ఎండీ ప్రఖర్ జైన్ సూచించారు.
ఇచ్ఛాపురంలో 16 సెం.మీ. వర్షపాతం – ఏడు మండలాల్లో విస్తారంగా వానలు
ఇప్పటికే తుపాను ప్రభావంతో శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్ఛాపురం, కవిటి, సోంపేట, కంచిలి, మందస, పలాస, వజ్రపుకొత్తూరు మండలాల్లో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటివరకు ఇచ్ఛాపురం మండలంలో అత్యధికంగా 16 సెం.మీ. వర్షపాతం నమోదు కాగా, కంచిలి మరియు కవిటిలో 10 సెం.మీ., పలాసలో 9.9 సెం.మీ. వర్షపాతం నమోదైంది.
సోంపేట, వజ్రపుకొత్తూరు వర్షపాత వివరాలు & సహాయక అప్రమత్తత
అలాగే సోంపేట మండలంలో 9.2 సెం.మీ., వజ్రపుకొత్తూరు మండలంలో 4.9 సెం.మీ. వర్షపాతం నమోదైనట్లు ప్రఖర్ జైన్ వెల్లడించారు. తుపాను పూర్తిగా తీరం దాటే వరకు లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని, అత్యవసర పరిస్థితుల్లో అధికారుల సూచనలు పాటించాలని APSDMA కోరింది.
Tags
Be the first to react