’ఆదర్శ కుటుంబం’ ట్రబుల్ ల్లో! నాకు నష్టం.. ‘పర్ణశాల’ నిర్మాత ఫైర్!

Adarsha Kutumbam Controversy: సినిమా పాటల వినియోగంపై టాలీవుడ్‌లో వివాదం తెరపైకి వచ్చింది. త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న ‘పర్ణశాల’ సినిమాలోని ‘జిమ్ జిమ్ తార’ పాటను తమ అనుమతి లేకుండా ‘ఆదర్శ కుటుంబం’ చిత్రంలో ఉపయోగించడంపై నిర్మాత మంచి వెంకట్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. తమ పాటను మరో సినిమాలో వాడటం సరైన పద్ధతి కాదని, దీనివల్ల చిన్న సినిమాలకు నష్టం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.

Adarsha Kutumbam Faces Copyright on jim jim Tara Song
Adarsha Kutumbam Faces Copyright on jim jim Tara Song
  • ‘ఆదర్శ కుటుంబం’లో ‘పర్ణశాల’ పాటను అనుమతి లేకుండా వాడటంపై నిర్మాత అభ్యంతరం తెలిపారు..
  • ఈ చర్య వల్ల తమ సినిమా ప్రచారానికి, చిన్న సినిమా మనుగడకు నష్టం కలుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.

Adarsha Kutumbam Controversy: సినిమా పాటల వినియోగంపై టాలీవుడ్‌లో వివాదం తెరపైకి వచ్చింది. త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న ‘పర్ణశాల’ సినిమాలోని ‘జిమ్ జిమ్ తార’ పాటను తమ అనుమతి లేకుండా ‘ఆదర్శ కుటుంబం’ చిత్రంలో ఉపయోగించడంపై నిర్మాత మంచి వెంకట్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. తమ పాటను మరో సినిమాలో వాడటం సరైన పద్ధతి కాదని, దీనివల్ల చిన్న సినిమాలకు నష్టం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ విషయంపై మీడియాతో మాట్లాడిన మంచి వెంకట్.. ‘జిమ్ జిమ్ తార’ పాటను ఇప్పటికే ఆదిత్య మ్యూజిక్ ద్వారా అధికారికంగా విడుదల చేశామని తెలిపారు. అయినప్పటికీ తమ నుంచి ఎలాంటి అనుమతి తీసుకోకుండా ‘ఆదర్శ కుటుంబం’లో హీరో వెంకటేశ్‌కు సంబంధించిన సన్నివేశంలో వినియోగించారని పేర్కొన్నారు. ఈ పరిణామం తమ సినిమా ప్రచారంపై ప్రభావం చూపే అవకాశం ఉందన్నారు. చిన్న సినిమాలను ప్రోత్సహించాల్సిన సమయంలో ఇలాంటి చర్యలు వాటి ఎదుగుదలకు అడ్డంకిగా మారుతాయని అన్నారు. ఇకపై తమ పాటను అనుమతి లేకుండా ఉపయోగిస్తే న్యాయపరంగా ముందుకెళ్తామని స్పష్టం చేశారు.

ఇక ‘పర్ణశాల’ విషయానికి వస్తే.. మంచి వెంకట్ నిర్మిస్తున్న ఈ సినిమాకు వై.జి. భరత్ దర్శకత్వం వహిస్తున్నారు. హారర్ కామెడీ, సస్పెన్స్ థ్రిల్లర్ అంశాలతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. సినిమా ప్రమోషన్లలో భాగంగా ‘జిమ్ జిమ్ తార’ పాటను లక్ష్మీదేవితో పాడించి చిత్రబృందం ప్రత్యేకంగా ప్రచారం నిర్వహించింది. ఆదిత్య మ్యూజిక్ ద్వారా విడుదలైన ఈ పాటకు ఇప్పటికే మంచి గుర్తింపు లభిస్తోంది. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Tags

Be the first to react

Latest