శ్రీవారి వైభవం ఇక డిజిటల్ రూపంలో.. తిరుమల ఎస్వీ మ్యూజియం సందర్శనకు సిద్ధం!

తిరుమల:  తిరుమల క్షేత్ర వైభవాన్ని, శ్రీవేంకటేశ్వర స్వామివారి చరిత్రను సరికొత్త సాంకేతికతతో భక్తులకు పరిచయం చేసేందుకు టీటీడీ సిద్ధం చేసిన ఆధునీకరించిన ఎస్వీ మ్యూజియం సందర్శనకు ప్రత్యేక అవకాశం కల్పించింది. మ్యూజియం పూర్తిస్థాయి ప్రారంభానికి ముందు చేపట్టిన ట్రయల్ రన్ నవంబర్ 4వ తేదీతో ముగియనుంది. ఈ నేపథ్యంలో టీటీడీ ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు, విద్యార్థులు, మీడియా ప్రతినిధులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని అధికారులు కోరారు.

Tirumala SV Museum Trial Run, Last Date November 4
Tirumala SV Museum Trial Run, Last Date November 4
  • తిరుమల ఎస్వీ మ్యూజియం ట్రయల్ రన్ నవంబర్ 4తో ముగింపు.
  • ట్రయల్ రన్ అనంతరం సామాన్య భక్తులకు మ్యూజియం అందుబాటులోకి రానుంది.

తిరుమల:  తిరుమల క్షేత్ర వైభవాన్ని, శ్రీవేంకటేశ్వర స్వామివారి చరిత్రను సరికొత్త సాంకేతికతతో భక్తులకు పరిచయం చేసేందుకు టీటీడీ సిద్ధం చేసిన ఆధునీకరించిన ఎస్వీ మ్యూజియం సందర్శనకు ప్రత్యేక అవకాశం కల్పించింది. మ్యూజియం పూర్తిస్థాయి ప్రారంభానికి ముందు చేపట్టిన ట్రయల్ రన్ నవంబర్ 4వ తేదీతో ముగియనుంది. ఈ నేపథ్యంలో టీటీడీ ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు, విద్యార్థులు, మీడియా ప్రతినిధులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని అధికారులు కోరారు.

ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు..

ప్రస్తుతం కొనసాగుతున్న ట్రయల్ రన్‌లో భాగంగా ప్రతిరోజూ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సందర్శకులను అనుమతిస్తున్నారు. టీటీడీ ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులతో పాటు తిరుమల, తిరుపతికి చెందిన ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు, వారి కుటుంబ సభ్యులు మ్యూజియాన్ని సందర్శించవచ్చు. శ్రీవారి సేవకులు, టీటీడీ విద్యాసంస్థల విద్యార్థులతో పాటు ఇతర పాఠశాలలు, కళాశాలల విద్యార్థులకు కూడా అవకాశం కల్పించారు.

ఆధునిక సాంకేతికతతో ఆధ్యాత్మిక అనుభూతి

అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఆధునీకరించిన ఈ మ్యూజియంలో తిరుమల చరిత్ర, శ్రీవారి నిత్య సేవలు, వార్షిక ఉత్సవాల విశిష్టతను తెలియజేసే అరుదైన ఛాయాచిత్రాలు కొలువుదీరాయి. ప్రాచీన ఆభరణాల నమూనాలు, చారిత్రక నాణేలు, రాగిరేకులు, రాతి శిల్పాలు సందర్శకులకు అందుబాటులో ఉంచారు.

సంప్రదాయ ప్రదర్శనలకు ఆధునిక సాంకేతికతను జోడిస్తూ వర్చువల్ రియాలిటీ, 3డీ ప్రొజెక్షన్ మ్యాపింగ్, ఇంటరాక్టివ్ కియోస్క్‌లు, డిజిటల్ స్క్రీన్లను ఏర్పాటు చేశారు. తిరుమల క్షేత్ర చరిత్రతో పాటు శ్రీవారి ఆలయ నిర్మాణ విశేషాలను వివరించే ప్రత్యేక గ్యాలరీలు ఈ మ్యూజియంకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నాయి.

సందర్శకుల అభిప్రాయాల ఆధారంగా మార్పులు

మ్యూజియంలో ఏర్పాటు చేసిన డిజిటల్ పరికరాల పనితీరు, సందర్శకుల రాకపోకలు, రద్దీ నిర్వహణ వంటి అంశాలను టీటీడీ అధికారులు ట్రయల్ రన్‌లో పరిశీలిస్తున్నారు. సందర్శకుల నుంచి అందే అభిప్రాయాలు, సూచనలను పరిగణనలోకి తీసుకుని అవసరమైన మార్పులు చేయనున్నారు.

నవంబర్ 4తో ట్రయల్ రన్ ముగిసిన అనంతరం సామాన్య భక్తులకు కూడా మ్యూజియాన్ని అందుబాటులోకి తీసుకురావడానికి టీటీడీ చర్యలు చేపట్టనుంది. తద్వారా తిరుమలకు వచ్చే భక్తులకు శ్రీవారి చరిత్ర, తిరుమల క్షేత్ర ప్రాశస్త్యాన్ని మరింత చేరువ చేయాలని దేవస్థానం లక్ష్యంగా పెట్టుకుంది.

Tags

Be the first to react

Latest