Vijayawada Airport: విజయవాడ ఎయిర్‌పోర్ట్‌లో శ్రీవారి దర్శన టికెట్లు - టీటీడీ సరికొత్త ప్రణాళిక! Tirumala Latest Updates: తిరుమలలో భక్తుల ప్రభంజనం... శిలాతోరణం వరకు క్యూలైన్ల తాకిడి! దర్శనం టైమింగ్స్... Replica of Tirumala: అమరావతిలో తిరుమల ప్రతిరూపం.... రూ. 260 కోట్లతో రెండో ప్రకారం నిర్మాణం! Tirumala Latest Updates: తిరుమలలో శ్రీవారి దర్శన అప్‌డేట్స్... 5 కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్న భక్తులు! TTD: తిరుమల భక్తులకు గుడ్ న్యూస్.. క్యూ లైన్ల పర్యవేక్షణకు అధునాతన వ్యవస్థ! Kedarnath 2026: 6 నెలల తర్వాత తెరుచుకున్న కేదార్‌నాథ్ తలుపులు.. Tirumala Latest Update: తిరుమలలో సాధారణంగా భక్తుల రద్దీ.. 6 గంటల్లో శ్రీవారి సర్వదర్శనం! Tirumala Latest Update: శ్రీవారిమెట్ల మార్గంలో చిరుత కలకలం... భక్తులకు టీటీడీ కీలక సూచనలు! Tamannaah: "శ్రీవారి చెంత మిల్కీ బ్యూటీ": తిరుమల కొండపై సందడి చేసిన నటి తమన్నా! Tirumala Latest Update: తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ.. సర్వదర్శనానికి 4 గంటలే! Vijayawada Airport: విజయవాడ ఎయిర్‌పోర్ట్‌లో శ్రీవారి దర్శన టికెట్లు - టీటీడీ సరికొత్త ప్రణాళిక! Tirumala Latest Updates: తిరుమలలో భక్తుల ప్రభంజనం... శిలాతోరణం వరకు క్యూలైన్ల తాకిడి! దర్శనం టైమింగ్స్... Replica of Tirumala: అమరావతిలో తిరుమల ప్రతిరూపం.... రూ. 260 కోట్లతో రెండో ప్రకారం నిర్మాణం! Tirumala Latest Updates: తిరుమలలో శ్రీవారి దర్శన అప్‌డేట్స్... 5 కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్న భక్తులు! TTD: తిరుమల భక్తులకు గుడ్ న్యూస్.. క్యూ లైన్ల పర్యవేక్షణకు అధునాతన వ్యవస్థ! Kedarnath 2026: 6 నెలల తర్వాత తెరుచుకున్న కేదార్‌నాథ్ తలుపులు.. Tirumala Latest Update: తిరుమలలో సాధారణంగా భక్తుల రద్దీ.. 6 గంటల్లో శ్రీవారి సర్వదర్శనం! Tirumala Latest Update: శ్రీవారిమెట్ల మార్గంలో చిరుత కలకలం... భక్తులకు టీటీడీ కీలక సూచనలు! Tamannaah: "శ్రీవారి చెంత మిల్కీ బ్యూటీ": తిరుమల కొండపై సందడి చేసిన నటి తమన్నా! Tirumala Latest Update: తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ.. సర్వదర్శనానికి 4 గంటలే!

Bhagavad Gita: నశించేది జగత్తే.. నిలిచేది ఆత్మ స్వరూపమే.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా -16!

ప్రియమైన ఆంధ్రప్రవాసి పాఠక భక్తులారా,సాక్షాత్తు వ్యాస భగవానుని కృపా ప్రసాదంతో, గీతామాత ఆరాధనకు మనకు లభించిన ఈ పవిత్ర అవకాశాన్ని మీతో పంచుకోవడం ఆనందకరమైన కర

Published : 2025-09-28 06:00:00

ప్రియమైన ఆంధ్రప్రవాసి పాఠక భక్తులారా,

సాక్షాత్తు వ్యాస భగవానుని కృపా ప్రసాదంతో, గీతామాత ఆరాధనకు మనకు లభించిన ఈ పవిత్ర అవకాశాన్ని మీతో పంచుకోవడం ఆనందకరమైన కర్తవ్యంగా భావిస్తున్నాం..

సాక్షాత్తు భగవంతుని వ్యక్తస్వరూపము, మూర్తి స్వరూపమైన శ్రీమద్భగవద్గీత మానవాళికి అందిన రోజు గీతా జయంతి రోజు. డిసెంబర్ ఒకటవ తేదీకి గీతా జయంతి వస్తుంది. ఈ గీతా జయంతి సందర్భంగా, పూజ్య శ్రీ గురుదేవుల ఆశీస్సులతో శ్రీమద్భగవద్గీత అష్టోత్తర శతనామావళిలోని ఈరోజు 16వ రోజు నామాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నాము.

ప్రతి నామం వెనుక ఉన్న అర్థం, ఆధ్యాత్మికత, భక్తి సారాన్ని తెలుసుకొని మనం గీతామాతను మరింతగా ఆరాధించుకుందాం. ఈ పవిత్ర ప్రయత్నంలో భాగంగా, ఆంధ్రప్రవాసి Devotional విభాగంలో ప్రతి రోజు ఒక నామాన్ని మీకు అందజేస్తూ, మన గీతామాత కరుణకు అంజలి ఘటిస్తున్నాము.

ఓం వ్యాసదేవాయ నమః

పూజ్యశ్రీ భవఘ్నీ గురుదేవుల వారి అనుగ్రహం తో

శ్రీమద్భగవద్గీత అష్టోత్తరశత నామావళి

16. ఓం అమృత స్వరూపిణ్యై నమః

అర్థం: అమృతం అంటే మృతి లేనిది. శాశ్వతమైనది. అది పరమాత్మే. ఈ చరాచర జగత్తు మొత్తం మారేదే. నశించిపోయేదే. ‘జగన్మిథ్యా’ అన్నారు శంకర భగవత్పాదులు. జగత్తు మిథ్య అంటే మాయావరణలో ఉన్నది. మనకు కనపడే జగత్తు యథార్థ స్వరూపం ఇది కాదు. దాని అసలు తత్త్వం ఇది కాదు. ఇదంతా వాస్తవం, ఇది ఎప్పటికీ ఇట్లాగే ఉంటుంది అనుకొంటున్నాము. అది అలా ఉండటం లేదు. ఇట్లా అనుకుంటున్న మనం కూడా ఇలానే ఉండటం లేదు.

దృశ్యమానమయిన జగత్తు మొత్తం మారేదే, నశించి పోయేదే. ఈ జగత్తుకు సంబంధించిన జ్ఞానం సైతం మారిపోయేదే. కానీ భగవద్గీత అందించే జ్ఞానం ఎన్నటికీ నాశనం కానట్టిది. అమృతమైనది. అన్ని కాలాలకు అవసరమైనది. కాలధర్మం లేనిది. అది పరమాత్మ స్వరూపం.

ఒకానొకప్పుడు దేవ దానవులు అమృతం కోసం క్షీర సాగరాన్ని మథించారు. దానినుండి తొలుత విషం వెలువడింది. లక్ష్మీ దేవి, చంద్రుడు, ఐరావతము మొదలుగా అనేకం జన్మించిన పిమ్మట, మహాప్రయత్నంతో చిట్ట చివరికి అమృతం లభించింది.  

కాని ఇక్కడ ఎట్టి ప్రయత్నం లేకుండానే పరమాత్మ బోధ రూపమైన గీతామృతం మనకు లభించింది. అది పరమ విద్య. బ్రహ్మరూపిణి. దానిని ఆరాధించి, ఆచరించి, ఆత్మానుభవం పొందినవారు అమృతస్థానం పొందుతారు.

యం హి న వ్యథయంత్యేతే
పురుషం పురుషర్షభ ।
సమ దుఃఖ సుఖం ధీరం 
సో-మృతత్వాయ కల్పతే ॥ 2.15

అర్థం: ఎవరిని శబ్ద స్పర్శాది విషయాలు చలింపజేయవో, సుఖదుఃఖాల పట్ల సమభావం గల అట్టి ధీరుడే అమృతత్త్వమునకు / మోక్షమునకు తగినవాడు.

అమృతత్త్వం అంటే మోక్షమే. నామ, రూప, దృశ్య ప్రపంచం అంతా జనన మరణాలతో, నాశనంతో కూడినది. ఆత్మ స్థితికి మరణం లేదు. అది అమృతం.

అట్టి మహత్తర స్థితిని నాకు ప్రసాదిస్తున్న అమృతప్రాయమైన శ్రీమద్భగవద్గీతకు ప్రీతితో నమోవాకం చేస్తున్నాను.

ఈ జన్మను సార్థకం, సఫలం చేసుకోవటానికి ప్రతి క్షణం గీతామాతను గుర్తు చేసుకొంటూ, ఇంతటి అనుగ్రహాన్ని ప్రసాదించిన సాక్షాత్తు విష్ణు స్వరూపులైన వ్యాసదేవులకు హృదయపూర్వక కృతజ్ఞతలు.

ఈక్రింది telegram channel లింకు ద్వారా మనం పూజ్య శ్రీ భవఘ్ని గురుదేవుల వారి సత్సంగాలు శ్రవణం చేయవచ్చు

https://t.me/jaibhavaghni

లింకు లో జాయిన్ అవండి
ఇంతటి మహత్తరమైన అవకాశాన్ని మనకందించిన గురుదేవుల వారికి అమ్మకు కృతజ్ఞతలు తెలియజేస్తూ

జై గురుదేవ్

నామం 15 : Bhagavad Gita: భగవద్గీత పఠనమే జన్మదుఃఖ విముక్తి మార్గం.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా -15!

నామం 14 : Bhagavad Gita: ధర్మాన్ని హరిస్తే అది మనల్ని హరిస్తుంది.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా-14!

నామం 13 : Bhagavad Gita: యజ్ఞక్రియల ద్వారా దేవశక్తిని ప్రసన్నం చేసే మంత్రాలు వేదాల్లో.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా -13!

నామం 12 : Bhagavad Gita: సృష్టి అంతా పరమాత్మ స్వరూపమే.. జీవుడు పరమాత్మ వేరే కాదు.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా - 12!

నామం 11 : Bhagavad Gita: ప్రతి క్షణం గీతామాతను స్మరించడం ద్వారానే జీవిత సఫలం.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా-11!

నామం 10 :Bhagavad Gita : ఈ జన్మను సార్థకం, సఫలం చేసుకోవటానికి ప్రతి క్షణం.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా - 10!

నామం 9 : Bhagavad Gita: భయాలు, బాధలు లేని జీవనానికి భగవత్ అనుగ్రహం.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా - 9!

నామం 8 :  Bhagavad Gita: పాప పరిహారానికి స్నానం.. పెద్దల ఉపదేశం.. తీర్థయాత్రలకంటే గొప్పది.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా-8!!

నామం 7 :  Bhagavad Gita: ధర్మార్థ కామ మోక్షాలను ప్రసాదించే.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా-7!

నామం 6 : Bhagavad Gita: ఇచ్ఛా, క్రియ, పరాశక్తి రూపంలో ప్రత్యక్షమయ్యే గీతా తత్త్వం.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా - 6!

నామం 5 : Bhagavad Gita: ఆది అంతం లేనట్టిది, ఎల్లప్పుడూ ఉందేది సనాతనం.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా - 5!

నామం 4 : Bhagavad Gita: సత్యం, చైతన్యం, ఆనందమే పరమాత్మ స్వరూపం.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా-4!

నామం 3 :Bhagavad Gita: అజ్ఞానాంధకారం తొలగించే వారే గురువు.. దుఃఖానికి ఒకే ఒక మూలకారణం అజ్ఞానం.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా - 3!

నామం  2 : Bhagavad Gita: పరమాత్మ శక్తిమంతుడు.. గీతామాత పరాశక్తి స్వరూపిణి.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా - 2!

నామం 1 : Bhagavad Gita: ప్రతి రోజూ ఒక్కో నామం.. ఆధ్యాత్మిక ప్రయాణంలో అడుగు.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా-1

Spotlight

Read More →